సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఆకాశవాణికి విద్యుత్ వాహనాలు -ఆలిండియా రేడియోకు పర్యావరణ హితకర వాహనాలు
Posted On:
02 DEC 2021 4:20PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పర్యావరణ హితకర విధానాలు, విద్యుత్ వాహనాల ద్వారా రవాణాకు అనుగుణంగా ఆలిండియా రేడియో తన మొత్తం రవాణా అవసరాలకు విద్యుత్ వాహనాలను వాడే విధానానికి మారింది. ప్రసార భారతి ఛీఫ్ ఎక్సిక్యుటివ్ శశిశేఖర్ వెంపటి, ఆలిండియా రేడియో డైరక్టర్ జనరల్ ఎన్.వేణుధర్ రెడ్డి న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్‌లో 26 ఎలక్ట్రిక్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
ఇండియా పర్యావరణ లక్ష్యాలను సాకారం చేయడానకి తనవంతుగా చేపట్టిన చర్య ఎంతో కీలకమైనది, ఢిల్లీలో వినియోగించనున్న రెండో అతి పెద్ద రవాణా వాహన సముదాయం గా చెప్పుకోవచ్చు.
ప్రసార భారతి ఛీఫ్ ఎక్సిక్యుటివ్ ఆఫీసర్ శశిశేఖర్ వెంపటి మాట్లాడుతూ, విద్యుత్ వాహనాలకు మారడం అనేది కీలక చ ర్య అని ఆయన చెప్పారు. పర్యావరణం కూడా పరిశుభ్రంగా ఉండే క్లీన్ ఇండియా ప్రధానమంత్రి లక్ష్యం.
ఆలిండియా రేడియో డైరక్టర్ జనరల్ ఎన్.వేణుధర్ రెడ్డి మాట్లాడుతూ , ఆకాశవాణి భవన్‌లో ఇ- వాహనాల అనుభవంతో ఇతర స్టేషన్లలో కూడా ఇలాంటి వాహనాలను తీసుకురానున్నట్టు తెలిపారు. ఆలిండియా రేడియో , కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సిఇఎస్ ఎల్) తో ఇ- వాహనాలకు సంబంధించి రాగల 5 సంవత్సరాల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు.
***
(Release ID: 1777801)
Visitor Counter : 136