సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఎంఎంఎంఏ సెక్టార్ కు మద్దతు

Posted On: 02 DEC 2021 2:01PM by PIB Hyderabad

 కోవిడ్ -19 మహమ్మారి ద్వారా భారీగా ప్రభావితమైన ఎమ్ఎస్ఎమ్ఈ రంగాన్ని పునరుజ్జీవింపజేయడానికి భారత ప్రభుత్వ కార్యక్రమం "రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పనితీరు (ర్యాంప్)"కు సహాయం చేయడానికి 500 మిలియన్ డాలర్ల (₹ 3750 కోట్లు) రుణాన్ని ఆమోదించినట్లు  ప్రపంచ బ్యాంకు 4 జూన్ 2021 నాటి తన బోర్డు సమావేశంలో ఎంఎస్ ఎంఈ మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. ఎంఎంఎంఏ పోటీతత్వంలో ఒక భాగం - ఒక పోస్ట్ కోవిడ్ స్థితిస్థాపకత, రికవరీ ప్రోగ్రామ్ (ర్యాంప్‌). దీనికోసం క్యాబినెట్ ఆమోదం కొరకు వేచి ఉన్నప్పటి నుంచి ఈ కార్య‌క్ర‌మం కోసం రాష్ట్రాల వారీగా పెట్టుబడులు. అనుమతులు రాలేదు. వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్ అప్రైజల్ డాక్యుమెంట్ ప్రకారం, ఎమ్ ఎస్ ఎమ్ ఈల్లో 40 శాతానికి పైగా అధికారిక ఫైనాన్స్ వనరులను   ర్యాంప్ కార్య‌క్ర‌మం కింద‌ పొంద‌లేదు.  ప్రతిపాదిత కార్యక్రమం (ర్యాంప్) ప్రభుత్వ కోవిడ్ స్థితిస్థాపకత, రికవరీ కార్యక్రమాల్లో వివిధ జోక్యాలకు మద్దతు అందిస్తుంది. మార్కెట్ యాక్సెస్, క్రెడిట్ యాక్సెస్ అందించ‌డం, కేంద్ర‌రాష్ట్రా స్థాయిలో సంస్థలు  పాలనను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఎమ్ఎస్ ఎమ్ ఈల పోటీ కోణంపై దృష్టి సారించి, ప్రభుత్వం కార్యక్రమాలకు ఈ కార్యక్రమం మద్దతు ఇస్తుంది. ఈ సమాచారాన్ని కేంద్ర ఎంఎస్ ఎంల‌ మంత్రి  నారాయణ్ రాణే ఈ రోజు లోక్ సభలో లిఖితపూర్వకంగా తెలిపారు.  

***



(Release ID: 1777507) Visitor Counter : 152


Read this release in: English , Urdu , Marathi , Tamil