విద్యుత్తు మంత్రిత్వ శాఖ
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా జైపూర్ లోని రామ్ గంజ్ లో జీఐఎస్ సబ్ స్టేషన్ ప్రారంభం
రూ. 7.50 కోట్లతో నిర్మించియాన్ ఈ సబ్ స్టేషన్ తో 4,000 మంది వాడకం దారులకు లబ్ధి
प्रविष्टि तिथि:
01 DEC 2021 3:55PM by PIB Hyderabad
జైపూర్ ప్రజలకు విద్యుత్ సరఫరాను మెరుగుపరచటంలో తీసుకున్న మరో చొరవలో భాగంగా జైపూర్ నగరంలోని రామ్ గంజ్ లో 33/11 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దీన్ని ప్రారంభించారు. జైపూర్ లోని ఆదర్శ నగర్ ఎమ్మెల్యే శ్రీ అమీన్ కాగజీ,
రాజస్థాన్ విద్యుత్ శాఖామంత్రి శ్రీ భన్వర్ సింగ్ భాటీ ఈ సబ్ స్టేషన్ ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. జైపూర్ లోని కిషన్ పోల్ ఎమ్మెల్యే శ్రీ అమీన్ కాగజీ,ఆదర్శ నగర్ ఎమ్మెల్యే శ్రీ రఫీక్ ఖాన్ కూడా జైపూర్ విద్యుత్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజస్థాన్ ప్రభుత్వ డిస్కం ఛైర్మన్ శ్రీ భాస్కర్ ఏ. సావంత్, జేవీవీఎన్ ఎల్ ఎండీ శ్రీ నవీన్ అరోరా , పీపీఎం చీఫ్ ఇంజనీర్ శ్రీ డికె శర్మ తదితర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో మహారత్న హోదా పొందిన సంస్థగాను, విద్యుత్ రంగం మీద దృష్టి సారించిన నాన్ బామకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ గానూ ఉన్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దీనికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించి ఐపీడీస్ పథకం కింద నిర్మించింది. ప్రాజెక్టు అమలు బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీ యూపీ ఆర్ నిర్మాణ్ నిగమ్ లిమిటెడ్. ఈ జీఐఎస్ సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.7.5 కోట్లు ఖర్చు కాగా ఇది దాదాపు 4000 మంది వినియోగదారులకు లబ్ధి చేకూర్చుతుంది. దీనివలన రామ్ గంజ్, పరిసర ప్రాంతాల ప్రజలకు నిరాటంకంగా విద్యుత్ సరఫరా జరుగుతుంది.
ఐపీడీస్ పథకం కింద జైపూర్ డిస్కం కు నాలుగు జీఐఎస్ సబ్ స్టేషన్లు మంజూరయ్యాయి. అందులో ఒకటి గత నెలలో జైపూర్ నగరంలో ప్రారంభించారు. మరో రెండు త్వరలోనే ప్రారంభమవుతాయి.
***
(रिलीज़ आईडी: 1777024)
आगंतुक पटल : 263