విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా అస్సాంలో ఆర్ ఈసీ ఆధ్వర్యం లో 'బిజ్లీ ఉత్సవ్'

Posted On: 01 DEC 2021 4:19PM by PIB Hyderabad

75 సంవత్సరాల స్వాతంత్రాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా - విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ - ఆర్ ఈసి లిమిటెడ్ అస్సాం లోని కామరూప్ జిల్లా సోనాపూర్ గ్రామంలోను,  పరిసర గ్రామాల్లోనూ మంగళవారం  'బిజ్లీ ఉత్సవ్' నిర్వహించింది.సోనాపూర్ గ్రామ పంచాయితీ అధ్యక్షుడు  బిపుల్ డేకా, మాజీ అధ్యక్షులు కుంజోలతా డేకా, రుహిని కెఆర్ దాస్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఉపెన్ భత్యా మొద్లైన అనేక మంది ప్రముఖులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు.

 

 

విద్యుత్ ప్రయోజనాలను, మారుమూల ప్రాంతాల్లో విద్యుదీకరణ సమయంలో ఎదుర్కొంటున్న సవాళ్లను ,విద్యుత్ లభ్యతతో జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడిందీ అతిధులు,  ప్రముఖులు తమ ప్రసంగాలలో వివరించారు. విద్యుత్ సౌకర్యం తమ జీవితాలను ఎలా మార్చిందనే దానిపై అనుభవాన్ని , అభిప్రాయాలను పంచుకోవడానికి గ్రామాల నుండి లబ్ధిదారులను కూడా వేదికపై ఆహ్వానించారు.

 

 

గ్రామస్థులు,పిల్లలను భాగస్వాములను చేస్తూ,  వివిధ పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి. విద్యుత్ ప్రయోజనాలు , దాని సంరక్షణ, స్వచ్ఛ భారత్ అభియాన్,కోవిడ్ భద్రతా నియమాలు వంటి విషయాలపై అవగాహన కల్పించేలా నుక్కడ్ నాటకాన్ని  కూడా ప్రదర్శించారు.. పోటీలలో గెలుపొందిన వారికి ఎల్ ఈడీ బల్బులను బహుమతులుగా పంపిణీ చేయడంతో ఈ కార్యక్రమం ముగిసింది.

పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైనందున సామాజిక దూరం ,మాస్కులు  ధరించడం వంటి అన్ని కోవిడ్ భద్రతా నియమాలు , జాగ్రత్తలు పాటించారు. అంతేకాకుండా, హాజరైన వారందరికీ మాస్కులు కూడా పంపిణీ చేశారు.

ఆర్ ఈసి లిమిటెడ్ గురించి: ఆర్ ఈసి లిమిటెడ్ అనేది దేశవ్యాప్తంగా విద్యుత్ రంగ. ఫైనాన్సింగ్ , డెవలప్ మెంట్ పై దృష్టి సారించిన  నవరత్న ఎన్ బిఎఫ్ సి. 1969లో ఏర్పాటైన ఆర్.ఇ.సి లిమిటెడ్ తన కార్యకలాపాల నిర్వహణలో యాభై సంవత్సరాలకు పైగా పూర్తి చేసుకుంది. ఇది రాష్ట్ర విద్యుత్ బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర/రాష్ట్ర విద్యుత్ వినియోగాలు, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు, గ్రామీణ విద్యుత్ సహకార సంస్థలు ప్రైవేట్ రంగ విద్యుత్ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీని వ్యాపార కార్యకలాపాలు పూర్తి విద్యుత్ రంగ విలువ గొలుసులో ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తాయి; వివిధ రకాల ప్రాజెక్టుల్లో జనరేషన్, ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ ,పునరుత్పాదక విద్యుత్ సెగ్మెంట్ లు ఉన్నాయి.

 

***



(Release ID: 1777009) Visitor Counter : 171


Read this release in: English , Urdu , Hindi , Punjabi