గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎస్.హెచ్.జి.ల ఉత్పత్తులపై ఫ్లిప్.కార్ట్.తో అవగాహన!
జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం కింద ఒప్పందం
Posted On:
01 DEC 2021 2:50PM by PIB Hyderabad
దేశంలోని స్వయం సహాయక బృందాలకు (ఎస్.హెచ్.జి.లకు) చెందిన ఉత్పత్తిదారులు ఫ్లిప్.కార్ట్ సమర్థ్ కార్యక్రమం ద్వారా జాతీయ మార్కెట్లతో అనుసంధానం పొందేలా ప్రభుత్వం ఒక అవగాహనా ఒప్పందాన్ని (ఎం.ఒ.యు.ను) కుదుర్చుకుంది. ఈ మేరకు, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఫ్లిప్ కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మధ్య ఎం.ఒ.యు. కుదిరింది. జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం కింద కుదిరిన ఈ అవగాహనతో స్వయం సహాయక గ్రూపులకు సంబంధించిన పారిశ్రామికులు, చేతిపనులవారు, చేనేతకార్మికులు, ఇతర వృత్తిపనులవారు జాతీయ మార్కెట్లతో అనుసంధామయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది.
ఈ ఎం.ఒ.యు. కీలకాంశాలను ఈ దిగువన చూడవచ్చు.:
స్వయసహాయ బృందాలకు, వారి సమూహాలకు సంబంధించిన ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సంబంధించి ఆయా ఎస్.హెచ్.జి. సభ్యులకు, సమూహ సభ్యులకు తగిన శిక్షణ ఇస్తారు.
ఈ వేదికపై విక్రయాలు సాగించడానికి సంబంధించి ఆరు నెలలపాటు కమిషన్ చార్జీలన్నింటినీ మాఫీ చేస్తారు.
ఒక్కో విక్రయదారుకు సంబంధించి వందవరకూ ఉత్పాదనల వర్గీకరణపై మద్దతు లభిస్తుంది.
ఉత్పాదనలను గిడ్డంగుల్లో నిల్వచేయడం, లెక్కల నిర్వహణ వంటి అంశాల్లో మద్దతు ఇవ్వడం తదితర ప్రయోజనాలు కూడా ఉంటాయి.
ఇక, ఎస్.హెచ్.జి. బృందాల ఉత్పాదనల మార్కెటింగ్ కార్యకలాపాలకు సంబంధించి, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ-మార్కెట్ ప్లేస్ (GeM) సహకారంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ఏర్పాటు చేసింది. జి.ఇ.ఎం.లో నిల్వ సదుపాయంతో “సరస్ కలెక్షన్” సదుపాయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
ఇక,, జి.ఇ.ఎం. పోర్టల్.లో రిజిస్ట్రేషన్ విషయంలో స్వయం సహాయక బృందాలకు అస్సాం, బీహార్, చత్తీస్.గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తగిన మద్దతను అందించాయి.
స్వయం సహాయ బృందాలు అమెజాన్, ఫ్లికార్ట్ సైట్లతో రిజిస్టర్ చేసుకునేందుకు జార్ఖండ్ ప్రభుత్వం మద్దతు ఇవ్వగా, కేరళ, మహారాష్ట్ర మాత్రం, అమెజాన్ సంస్థతో రిజిస్టర్ చేసుకునేందుకు ఎస్.హెచ్.జి.లకు తమ మద్దతును అందజేశాయి.
ఎస్.హెచ్.జి.లకు తగిన మద్దతు ఇచ్చేందుకు అస్సాం, బీహార్, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తగిన ఈ కామర్స్ వేదికలను రూపొందించుకున్నాయి.; ఇందుకు సంబంధించిన వివరాలను దిగువన చూడవచ్చు.
క్రమసంఖ్య
|
రాష్ట్రం
|
వెబ్.సైట్ పేరు
|
1
|
అస్సాం
|
అసోమీ (Asomi)
|
2
|
బీహార్
|
జీవికా షాప్ (Jeevika Shop)
|
3
|
కేరళ
|
కుడుంబశ్రీ బజార్ (Kudumbashree Bazaar)
|
4
|
మధ్యప్రదేశ్
|
మధ్యప్రదేశ్ ఆజీవికా మార్ట్ (Madhya Pradesh Aajeevika Mart)
|
ఈ సమాచారాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కుమారి సాధ్వీ నిరంజన్ జ్యోతి నిన్న లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆమె ఈ వివరాలు వెల్లడించారు.
****
(Release ID: 1777007)