ఆయుష్
యునాని, సిద్ధ ఔషధాల ప్రోత్సాహానికి కీలక చర్యలు
Posted On:
30 NOV 2021 3:49PM by PIB Hyderabad
జాతీయ స్థాయి సంస్థలైన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ (ఎన్ ఐయుఎం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ద (ఎన్ఐఎస్) సంస్థలు కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ కింద గల స్వతంత్ర సంస్థలు. ఇవి నాణ్యమైన విద్యను, ఆరోగ్య సేవలను తమతమ రంగాలలో అందిస్తున్నాయి. యునాన వైద్యంలో పరిశోధన సంస్థ అయిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ యునానిఇ (సిసిఆర్‌యుఎం), సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ సిద్ద (సిసిఆర్ ఎస్) సంస్థలు యునాని, సిద్ధ వైద్యంలో పరిశోధన కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు పలు చర్యలు చేపడుతున్నాయి. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (ఎన్‌సిఐఎస్ఎం) ను నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. బోర్డ్ ఆఫ్ యునాని, సిద్ద, సోవరిగ్ప ను కూడా ఎన్ సి ఐ ఎస్ ఎం చట్టం 2020 కింద వాటి వాటి నిర్దేశిత ప్రయోజనాల కోసం ఏర్పాటు చేశారు.
ఆయుష్ ద్వారా కోవిడ్ -19 విషయంలో పరిశోధనకు వీలు కల్పించేందుకు (యునాని, సిద్ద తో సహా) ఆయుష్ మంత్రిత్వశౄఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నోటిఫికేషన్ కింద ప్రొఫిలాక్టిక్ చర్యలు, క్వారంటైన్, లక్షణాలు కనిపించని, లేదా లక్షణాలు కలిగిన కోవిడ్ -19 కు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు సేకరించి తగిన చికిత్సకు చర్యలు, పరిశోధన చేయడం ఉన్నాయి. ఇప్పటివరకు సిద్ద ద్వారా 13 పరిశోధనలు, యునాని కింద 8 పరిశోధనలను పరిశోధనా మండలులు, జాతీయ సంస్థలు చేపట్టాయి.
ఆయుష్ మంత్రిత్వశాఖ యునాని, సిద్ధ ద్వారా కోవిడ్ 19 పేషెంట్లకు హోం ఐసొలేషన్ కు సంబంధించి పలు మార్గదర్శకాలను రూపొందించింది.
అంతర్జాతీయ ప్రమాణీకృత పదజాల అభివృద్ధి, తగిన ప్రమాణాలతో కూడిన కార్యకలాపాలు, శిక్షణ పద్ధతులలో ప్రమాణాలు, యునాని సిద్ధ వైద్య విధానాలకు సంబంధించి వ్యాధుల విషయంలో అంతర్జాతీయ వర్గీకరణ (ఐసిడి -11) వంటి వాటిని ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలసి ప్రారంభించడం జరిగింది. ఆయుష్ మంత్రిత్వశాఖతో ఒప్పందానికి అనుగుణంగా వీటిని చేపట్టడం జరిగింది.
ప్రస్తుత నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్, బెంగళూరుకు చెందిన శాటిలైట్ సెంటర్ ను ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ సంస్థ నాణ్యమైన విద్యను , ఆరోగ్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది,
సిసిఆర్ యుఎం, ఎన్ ఐ యుఎం, సిసిఆర్ ఎస్, ఎన్ ఐఎస్ లకు 2019-20,2020-21 సంవత్సరాలలో నిధుల కేటాయింపు, వినియోగం వివరాలు కిందివిధంగా ఉన్నాయి.
కోట్ల రూపాయలలో......
|
సంస్థలు
|
2019-20
|
2020-21
|
కేటాయింపు
|
వ్యయం
|
కేటాయింపు
|
వ్యయం
|
CCRUM
|
159.54
|
180.08
|
164.05
|
165.40
|
NIUM
|
47.27
|
47.27
|
173.75
|
173.75
|
CCRS
|
33.00
|
31.96
|
35.30
|
34.99
|
NIS
|
51.81
|
51.81
|
47.58
|
47.58
|
|
|
ఆయుష్ శాఖ మంత్రి శ్రీ శర్వానంద్ సోనోవాల్ రాజ్యసభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం తెలిపారు.
***
(Release ID: 1776723)
Visitor Counter : 156