ఆయుష్
మధుమేహానికి విరుగుడు ఆయుర్వేద ఔషధం బిజిఆర్-34
Posted On:
30 NOV 2021 3:49PM by PIB Hyderabad
బిజిఆర్-34 ఔషధం 2015 నుండి దేశంలోని అందుబాటులో ఉంది. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్బిఆర్ఐ), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ (సిఐఎంఏపి) ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసి పరిశోధన చేశాయి. ఈ సంస్థలు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) కింద పనిచేస్తున్నాయి. పరీక్షలలో ముఖ్యంగా ప్రామాణికత, ఆధునిక శాస్త్రీయ పారామితుల ఆధారంగా ఉత్పత్తి ధ్రువీకరణ, యాంటీఆక్సిడెంట్ కార్యాచరణ నిర్ణయం, ఉత్తమ కార్యాచరణ కోసం మూలికా భాగాల ఆప్టిమైజేషన్, యాంటీ-డయాబెటిక్ కార్యకలాపాల అంచనా మరియు భద్రతా అధ్యయనాలు మొదలైనవి ఉన్నాయి.
దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలలో ఆయుర్వేద ఔషధం బిజిఆర్-34 లభ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం/పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (పిఎస్యులు)/కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సిజిహెచ్ఎస్)/మున్సిపాలిటీలు/ఉద్యోగుల (ఉద్యోగుల రాష్ట్ర బీమా) సేకరణ ఏజెన్సీల పరిధిలోకి వస్తుంది.
బిజిఆర్-34 ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ కేటగిరీ క్రింద లైసెన్స్ పొందింది. టెండర్ల ద్వారా మాత్రమే దాని లభ్యత సాధ్యమవుతుంది. బిజిఆర్-34 ఔషధాన్ని టెండర్‌లో చేర్చడం అనేది సంబంధిత ప్రొక్యూర్‌మెంట్ ఏజెన్సీ సేకరణ నిబంధనల కోసం ప్రతిస్పందించే బిడ్, ధర మరియు క్వాలిఫైయింగ్ ఆమోదించిన ప్రామాణిక ఆపరేటివ్ విధానం (ఎస్ఓపి)పై ఆధారపడి ఉంటుంది.
ఎన్ఎండిసి, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ నివాసి కోసం ఔషధాన్ని అందుబాటులో ఉంచుతాయి. ఈఎస్ఐ లో ఔషధం లభ్యత అనేది వ్యక్తి, వారి కుటుంబం చెల్లుబాటు అయ్యే ఈఎస్ఐ హెల్త్ కార్డ్‌ని కలిగి ఉండాలి. సిజిహెచ్ఎస్లో ఔషధం టెండర్ ద్వారా రానందున స్థానిక కెమిస్ట్ ద్వారా ఆ లబ్ధిదారునికి అందుబాటులో ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సిలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సిహెచ్‌సిలు) మరియు జిల్లా ఆసుపత్రుల (డిహెచ్‌లు) వద్ద ఆయుష్ సౌకర్యాల కో-లొకేషన్ గ ఉంచింది. తద్వారా రోగులకు ఒకే గవాక్షం ద్వారా వివిధ రకాల మందులను ఎంపిక చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది.
ఈ సమాచారాన్ని ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1776628)
Visitor Counter : 154