ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇన్ ఫినిటీ- ఫోరమ్ ను డిసెంబర్ 3వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


‘బియాండ్’ అనేఇతివృత్తం పై దృష్టి ని కేంద్రీకరించనున్న ఫోరమ్; దీనిలో ‘ఫిన్- టెక్బియాండ్ బౌండ్రీజ్’, ‘ఫిన్- టెక్ బియాండ్ ఫైనాన్స్’ లతోపాటు ‘ఫిన్- టెక్బియాండ్ నెక్స్ ట్’ వంటి అంశాలు సహా అనేక ఉప ఇతివృత్తాలు చేరిఉంటాయి

Posted On: 30 NOV 2021 10:28AM by PIB Hyderabad

ఇన్ ఫినిటీ- ఫోరమ్ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 3న ఉదయం 10 గంటల వేళ లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఇన్ ఫినిటీ ఫోరమ్ అనేది ఫిన్- టెక్అంశం పై మేధోమథనం జరిపేటటువంటి ఒక నాయకత్వ వేదిక గా ఉంది.

ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఆధ్వర్యం లో జిఐఎఫ్ టి సిటీ (గుజరాత్ ఇంటర్ నేశనల్ ఫైనాన్స్ టెక్- సిటీ) మరియు బ్లూమ్ బర్గ్ ల సహకారం తో 2021 డిసెంబర్ 3 , 4 వ తేదీల లో ఇంటర్ నేశనల్ ఫైనాన్శియల్ సర్వీసెజ్ సెంటర్స్ ఆథారిటి (ఐఎఫ్ఎస్ సిఎ) నిర్వహించనుంది. ఈ ఫోరమ్ ఒకటో సంచిక లో ఇండోనేశియా, దక్షిణ ఆఫ్రికా లతో పాటు యుకె భాగస్వామ్య దేశాలు గా వ్యవహరిస్తాయి.

మానవాళి కి సేవ చేయడం కోసం, వృద్ధి ఫలాల ను అందరికీ అందించడం కోసం ఫిన్- టెక్ పరిశ్రమ లో సాంకేతిక విజ్ఞానాన్ని, నూతన ఆవిష్కరణల ను ఏ విధం గా ఉపయోగించుకోవచ్చు అనే విషయం పై ఆలోచనల ను మధించి, ఒక ఆచరణాత్మకమైనటువంటి ప్రణాళిక ను సిద్ధం చేయడానికి విధానం, వ్యాపారం, సాంకేతిక విజ్ఞానం రంగాల లో ప్రపంచం లోని అగ్రగామి ప్రతిభల ను ఇన్ ఫినిటీ- ఫోరమ్ ద్వారా ఒక చోటు కు రానున్నాయి.

బియాండ్అనే ఇతివృత్తం పై శ్రద్ధ ను వహిస్తూ, పలు చర్చనీయాంశాల ను ఫోరమ్ లో భాగం గా చేపట్టనున్నారు. దీనిలో భాగం గా .. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థ లు ఆర్థిక సేవల ను అన్ని వర్గాల కు అందించడాన్ని ప్రోత్సహించడం కోసం భౌగోళిక సరిహద్దుల కు అతీతం గా దృష్టి ని సారించే ‘ఫిన్ - టెక్ బియాండ్ బౌండ్రీజ్’, సుస్థిర అభివృద్ధి సాధన కోసం స్పేస్- టెక్, గ్రీన్- టెక్, ఇంకా ఎగ్రీ- టెక్ ల వంటి ప్రవర్ధమాన రంగాల లో ఏకరూపత ను సాధించగలగాలనే ఉద్దేశ్యం తో ‘ఫిన్ టెక్ బియాండ్ ఫైనాన్స్’, భావి కాలపు ఫిన్- టెక్ ఇండస్ట్రీ ని, నూతన అవకాశాల ను ప్రోత్సహించడం కోసం క్వాంటమ్ కంప్యూటింగ్ ఏ విధం గా ప్రభావాన్ని ప్రసరింప చేయగలుగుతుందో అనే విషయం పై ధ్యాస పెట్టడం కోసం ‘ఫిన్ టెక్ బియాండ్ నెక్స్ ట్’ సహా విభిన్నమైనటువంటి ఉప ఇతివృత్తాలు.. ఉండబోతున్నాయి.

ఈ ఫోరమ్ లో 70 కి పైగా దేశాలు పాలుపంచుకోనున్నాయి. ముఖ్య వక్తల లో మలేశియా ఆర్థిక మంత్రి శ్రీ తెంగ్ కూ జఫరుల్- అజీజ్, ఇండోనేశియా ఆర్థిక మంత్రి మూల్యానీ ఇంద్రావతి గారు, ఇండోనేశియా కే చెందిన మినిస్టర్ ఆఫ్ క్రియేటివ్ ఇకానమి శ్రీ శాండియాగా ఎస్ ఊనో, రిలయన్స్ ఇండస్ట్రీజ్ చైర్ మన్, ఇంకా ఎమ్ డి శ్రీ ముఖేశ్ అంబానీ, సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్ప్ చైర్ మన్, సిఇఒ శ్రీ మాసాయోశీ సూన్, ఐబిఎమ్ కార్ పొరేశన్ చైర్ మన్ మరియు సిఇఒ శ్రీ అరవింద కృష్ణ, కోటక్ మహింద్రా బ్యాంక్ లిమిటెడ్ ఎమ్ డి మరియు సిఇఒ శ్రీ ఉదయ్ కోటక్ తదితర ఉన్నతాధికారులు కలసి ఉంటారు. ఈ సంవత్సరం లో నిర్వహిస్తున్న ఫోరమ్ లో నీతి ఆయోగ్, ఇన్ వెస్ట్ ఇండియా, ఎఫ్ఐసిసిఐ (‘ఫిక్కి’), ఇంకా ఎన్ఎఎస్ఎస్ సిఒఎమ్ (‘నాస్ కామ్’)లు ముఖ్య భాగస్వాములలో ఉండబోతున్నాయి.

ఐఎఫ్ఎస్ సిఎ గురించి

ద ఇంటర్ నేశనల్ ఫైనాన్శియల్ సర్వీసెజ్ సెంటర్స్ ఆథారిటి (ఐఎఫ్ఎస్ సిఎ) ప్రధాన కేంద్రం గుజరాత్ లోని గాంధీనగర్ లో నెలకొంది. దీనిని ఇంటర్ నేశనల్ ఫైనాన్శియల్ సర్వీసెజ్ సెంటర్స్ ఆథారిటి యాక్ట్, 2019 లో భాగం గా స్థాపించడం జరిగింది. ఈ సంస్థ భారతదేశం లో ఆర్థిక ఉత్పాదన లు, ఆర్థిక సేవలు, ఇంకా ఆర్థిక సంస్థ ల నియంత్రణ కు, అభివృద్ధి కి సంబంధించిన ఒక ఏకీకృతమైనటువంటి అధికార సంస్థ వలె పని చేస్తుంది. ప్రస్తుతం జిఐఎఫ్ టి- ఐఎఫ్ఎస్ సి అనేది భారతదేశం లో నడుస్తున్న తొలి అంతర్జాతీయ ఆర్థిక సేవ ల కేంద్రం గా ఉంది.

***


(Release ID: 1776459) Visitor Counter : 196