ప్రధాన మంత్రి కార్యాలయం

2021 వసంవత్సరం లో పార్లమెంట్ శీతకాలపు సమావేశాలు ఆరంభం కావడాని కంటే ముందు ప్రసారమాధ్యమాల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రకటన పాఠం 

Posted On: 29 NOV 2021 11:47AM by PIB Hyderabad

మిత్రులారా నమస్కారం,

పార్లమెంటు ప్రస్తుత సమావేశకాలం చాలా ముఖ్యమైనటువంటిది. దేశం స్వాతంత్ర్యం యొక్క ‘అమృత్ మహోత్సవ్’ ను జరుపుకొంటున్నది. భారతదేశ వ్యాప్తం గా గల సామాన్య పౌరులు స్వాతంత్ర్యం తాలూకు అమృత్ మహోత్సవ్ కాలం లో అనేక కార్యక్రమాల ను నిర్వహిస్తూ వారి వంతు తోడ్పాటు ను అందిస్తున్నారు. అంతేకాక, స్వాతంత్ర్య సమర యోధులు కన్న కలల ను నెరవేర్చడం కోసం సర్వజన హితం ముడిపడ్డ, దేశ హితం జతపడ్డ అనేక చర్యల ను కూడా వారు చేపడుతున్నారు. ఈ కబురు లు వాటంతట అవి భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు కు శుభ సంకేతంగా నిలుస్తున్నాయి.

ఇటీవల, యావత్తు దేశం రాజ్యాంగ దినం సంబంధి ఉత్సవం నాడు రాజ్యాంగ స్ఫూర్తి ని నెరవేర్చడానికి ఒక కొత్త సంకల్పాన్ని చెప్పుకొంది. ఈ సందర్భం లో, దేశ హితం కోసం చర్చల ను జరిపేందుకు, స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తి కి, స్వాతంత్ర్యం తాలూకు అమృత్ మహోత్సవ్ స్ఫూర్తి కి అనుగుణం గా పార్లమెంట్ తాజా సమావేశకాలం తో పాటు తదుపరి సమావేశ కాలాల్లో కూడా చర్చలను జరపాలని, దేశం అభివృద్ధి చెందేందుకు కొత్త మార్గాల ను కనుగొనాలని మనతో పాటు దేశం లోని ప్రతి ఒక్కరు కోరుకొంటున్నాం. ఈ సమావేశకాలం లో ఆలోచనలు వెల్లువెత్తాలి మరి సకారాత్మకమైన చర్చ లు జరిగి అవి దూరగామి ప్రభావాన్ని ప్రసరించేవి గా ఉండాలి. పార్లమెంటు ను ఎవరు బలవంతంగా అడ్డుకొన్నారు అనే విషయాని కంటే కూడా పార్లమెంటు ఏ విధంగా పనిచేస్తున్నది, మరి పార్లమెంటు తాలూకు ప్రముఖ తోడ్పాటు లు ఏమేమిటి ఉన్నాయి అనే అంశాల పరం గా తుల తూచాలి అని నేను ఆశపడుతున్నాను. ఇది ఒక కొలమానం కాకూడదు. కొలమానాలు గా ఏవి కావాలి అంటే అవి.. పార్లమెంటు ఎన్ని గంటల పాటు పని చేసింది, ఎంత సకారాత్మకమైన కార్యాలను పూర్తి చేసింది.. అనేవే. ప్రతి అంశాన్ని దాపరికం లేకుండా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం గా ఉంది. ప్రతి ప్రశ్న కు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధం గా ఉంది. పార్లమెంటు లో ప్రశ్నలను అడగాలి, పార్లమెంటు లో శాంతి కూడా ఉండాలి అని మేం కోరుకొంటున్నాం.

ప్రభుత్వం యొక్క విధానాల కు వ్యతిరేకం గా గొంతుక లు బలం గా వినిపించాలి, అయితే పార్లమెంటు గౌరవాన్ని, అలాగే సభాధ్యక్ష స్థానం యొక్క గౌరవాన్ని కూడాను నిలబెట్టాలి. మనం యువ తరాల కు ప్రేరణాత్మకం అయ్యే నడవడిక ను ఆచరించుకోవాలి. గడచిన సమావేశకాలం నాటి నుంచి, దేశం 100 కోట్ల కు పైగా కోవిడ్ టీకామందు డోజుల ను ప్రజల కు ఇప్పించింది మరి మనం ప్రస్తుతం 150 కోట్ల సంఖ్య వైపు వేగం గా సాగుతున్నాం. మనం కొత్త రకం పట్ల అప్రమత్తం గా ఉండాలి. ఈ సంకట కాలం లో ప్రతి ఒక్కరి ఆరోగ్యం మన ప్రాథమ్యం కాబట్టి, పార్లమెంటు సభ్యులందరిని, ఇంకా మిమ్మల్ని కూడాను అప్రమత్తం గా ఉండవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను.

దేశం లో 80 కోట్ల మందికి పైగా పౌరులు ఈ కరోనా కాలం లో ఇక్కట్టు ల పాలు కాకుండా ఉండాలని ఆహార ధాన్యాల ను ఉచితం గా అందించడం కోసం ఒక పథకాన్ని ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ లో భాగం గా

కొనసాగించడం జరుగుతున్నది. ఇప్పుడు దానిని 2022వ సంవత్సరం మార్చి నెల వరకు పొడిగించడమైంది. దాదాపు గా 2.60 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న ఈ పథకం దేశం లో 80 కోట్ల మంది కి పైగా పేదల వంటిళ్ల లో పొయ్యి మండుతూనే ఉండేందుకు తోడ్పడుతున్నది. ఈ సమావేశకాలం లో దేశ హితం కోసం మనం కలసికట్టుగా వేగవంతమైనటువంటి నిర్ణయాల ను తీసుకోగలుగుతామని, మరి సామాన్య మానవుని ఆశల ను, అపేక్షల ను నెరవేర్చగలుగుతామని నేను ఆశ పడుతున్నాను. ఇదే నా అపేక్ష గా ఉన్నది. మీకు అందరికి చాలా చాలా ధన్యవాదాలు.

అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి రమారమి అనువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.

 

 

***



(Release ID: 1776303) Visitor Counter : 150