గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

రూ.53,175 కోట్ల విలువైన 3,131 స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు పూర్తి

Posted On: 29 NOV 2021 2:38PM by PIB Hyderabad

100 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం 25 జూన్ 2015న స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్‌సీఎం)ని ప్రారంభించింది. జనవరి 2016 నుండి జూన్ 2018 వరకు 4 రౌండ్లలో పోటీల ద్వారా నగరాల‌ను ఎంపిక చేశారు. 12 నవంబర్ 2021 నాటికి ఈ స్మార్ట్ సిటీలు రూ.1,84,998 కోట్ల విలువైన 6,452 ప్రాజెక్ట్‌లకు దాదాపు టెండర్ల‌ను ఆహ్వానించాయి; వీటిలో రూ. 1,56,571 కోట్ల విలువైన 5,809 ప్రాజెక్ట్‌లలో వర్క్ ఆర్డర్‌లు జారీ చేయబడ్డాయి. రూ.53,175 కోట్ల విలువైన వాటిలో మొత్తం 3,131 ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి.  12 నవంబర్ 2021 నాటికి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు వాటి స్మార్ట్ సిటీల కోసం రూ. 27,235 కోట్ల నిధుల‌ను విడుదల చేసింది. జనవరి, 2016లో రౌండ్-1లో ఎంపిక చేసిన 20 స్మార్ట్ సిటీలలోని ప్రాజెక్ట్‌ల స్థితి క్రింద ఇవ్వబడింది:

(రూ. కోటిలో మొత్తం)

స్మార్ట్ సిటీ

టెండర్ ద‌శ‌

వర్క్ ఆర్డర్ ద‌శ‌

పూర్తియిన  ప‌నులు

మొత్తం ప్రాజెక్ట్‌లు

మొత్తం సొమ్ము

మొత్తం ప్రాజెక్ట్‌లు

మొత్తం 

మొత్తం ప్రాజెక్ట్‌లు

మొత్తం సొమ్ము

మొత్తం ప్రాజెక్ట్‌లు

మొత్తం 

రౌండ్-1

(20 నగరాలు)

142

11,874

565

26,877

1,203

20,129

1,910

58,880

 

రౌండ్-1లో ఎంపిక చేసిన స్మార్ట్ సిటీల మొత్తం స్మార్ట్ సిటీ ప్రతిపాదనలలో (ఎస్‌సీజీలు) భాగమైన రూ.58,880 కోట్ల విలువైన 1,910 ప్రాజెక్ట్‌లలో రూ.47,006 కోట్ల (80 శాతం) విలువైన 1,768 ప్రాజెక్టులు (93 శాతం) పూర్తయ్యాయి లేదా అమలులో ఉన్నాయి. ఎస్‌సీఎం అమలు వ్యవధి జూన్ 2023 వరకు పొడిగించబడింది. అన్ని రౌండ్-I నగరాలు నిర్ణీత సమయంలో తమ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని భావిస్తున్నారు.

గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన‌ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియ‌జేశారు.


                                                                                                                                                 

*****



(Release ID: 1776271) Visitor Counter : 127


Read this release in: English , Marathi , Urdu