పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
వందే భారత్ మిషన్ కింద 2,17,000 విమానాలు నడిచాయి
అక్టోబర్ 2021వరకు దాదాపు 1.83 కోట్ల మంది ప్రయాణీకులకు సదుపాయం
Posted On:
29 NOV 2021 2:59PM by PIB Hyderabad
ప్రపంచాన్ని కోవిడ్ -19 మహమ్మారి పట్టి పీడిస్తున్న కాలంలో భారత జాతీయులను స్వదేశానికి తీసుకురావడానికి, భారత్, ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య యాత్రికుల ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు ప్రభుత్వం వందే భారత్ మిషన్‌ను చేపట్టింది.
వందే భారత్ మిషన్ కింద 31.10. 2021 వరకు 2,17,000 విమానాలను నడిపి, 1.83 కోట్ల మంది ప్రయాణీకులకు సదుపాయం కల్పించారు. అనెక్చర్-ఎలో స్వదేశానికి వచ్చిన, విదేశాలకు వెళ్ళిన ప్రయాణీకుల వివరాలను రాష్ట్రాల వారీగా ఇవ్వడం జరిగింది. వందే భారత్ మిషన్ కింద చేపట్టిన కార్యకలాపాలు వైమానిక సంస్థలు వాణిజ్య కార్యకలాపాలు చేపట్టాయి. ఇందుకు విమాన ప్రయాణ ఛార్జీలను ప్రయాణీకులు చెల్లించారు. వందే భారత్ మిషన్‌కు పౌర విమానయాన శాఖ ఎటువంటి రాయితీ/ గ్రాంట్‌ను అందించలేదు.
అనెక్చర్ -ఎ
వందే భారత్ మిషన్ లో ప్రయాణించిన (విదేశాలకు వెళ్ళిన, స్వదేశానికి వచ్చిన) ప్రయాణీకుల వివరాలు-
రాష్ట్రాలు/
కేంద్రపాలిత ప్రాంతాలు 01..04. 2020 నుంచి 31.10.2021 వరకు
విదేశాలకు స్వదేశానికి మొత్తం
అండమాన్& నికోబార్ 13 13 26
ఆంధ్రప్రదేశ్ 1922 94244 96166
అస్సాం 35 349 384
బీహార్ 1162 11914 13076
చండీగఢ్ 4138 11617 15755
ఢిల్లీ 2943325 2760000 5703325
గోవా 28752 36798 65550
గుజరాత్ 183053 210417 393470
కర్నాటక 558673 593321 1151994
కేరళ 2067447 2399688 4467135
మహారాష్ట్ర 1298689 1009619 2308308
మణిపూర్ 12 19 31
మధ్యప్రదేశ్ 1504 1393 2897
ఒడిషా 723 5425 6148
పంజాబ్ 169878 151064 320942
రాజస్థాన్ 71123 111370 182493
తెలంగాణ 496173 638225 1134398
తమిళనాడు 670368 905845 1576213
ఉత్తర్ ప్రదేశ్ 185601 487682 673283
పశ్చిమ బెంగాల్ 114743 133567 248310
సంపూర్ణ మొత్తం 8797334 9562570 18359904
ఈ సమాచారాన్ని సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు పౌర విమాన యాన శాఖ సహాయ మంత్రి (జనరల్- డా|| వి.కె సింగ్ (రిటైర్డ్) లిఖిత పూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు.
***
(Release ID: 1776266)
Visitor Counter : 150