ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇంటర్నెట్ గవర్నెన్స్‌పై మార్గదర్శక ప్రణాళికను తయారు చేయడంలో ఐఐజీఎఫ్ పాత్రను ప్రధాని మోదీ అభినందించారు.


– ప్రజాస్వామ్య విలువలను, పౌర హక్కులను గౌరవించే ఓపెన్ సొసైటీల ద్వారా ఇంటర్నెట్ భవిష్యత్తును రూపొందించాలి: రాజీవ్ చంద్రశేఖర్

–ఇంటర్నెట్‌ను ఓపెన్, సురక్షితమైన & విశ్వసనీయంగా మార్చాలి. అందరికీ జవాబుదారీగా ఉండేలా మార్చాలి: ఐఐజీఎఫ్లో రాజీవ్ చంద్రశేఖర్

Posted On: 27 NOV 2021 4:48PM by PIB Hyderabad
ఇంటర్నెట్‌లో బహుళ భాగస్వామ్యం ముఖ్యమని నరేంద్ర మోదీ ప్రభుత్వం నమ్ముతుందని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. డిజిటల్ ఇండియా మిషన్ కింద ఇంటర్నెట్‌ పారదర్శకంగా, సురక్షితంగా & విశ్వసనీయంగా, జవాబుదారీగా ఉండేలా మార్చాలని  అన్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్,  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ) సంయుక్తంగా నిర్వహించిన ఇంటర్నెట్ గవర్నెన్స్‌పై 3 రోజుల ఆన్‌లైన్ ఈవెంట్ సందర్భంగా నిర్వహించారు. ఇక్కడ - మొట్టమొదటి ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (ఐఐజీఎఫ్) చివరి రోజున జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (నిక్సీ) మార్టెన్ బోటర్‌మాన్ (ఐకెన్ బోర్డ్ చైర్మన్), అజయ్ సాహ్నీ (సెక్రటరీ, మైటీ, కేంద్ర ప్రభుత్వం), అనిల్ జైన్ (సీఈఓ,నిక్సీ), బీకే సింఘాల్, అన్రియెట్ ఎస్టర్‌హ్యూసెన్ (ఛైర్, మ్యాగ్ ఐజీఎఫ్) వంటి  ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.  నవికా కుమార్ (గ్రూప్ ఎడిటర్, టైమ్స్ నెట్‌వర్క్ & ఎడిటర్-ఇన్-చీఫ్, టైమ్స్ నెట్‌వర్క్ నవభారత్) కూడా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటర్నెట్ పాలన కోసం మార్గదర్శక ప్రణాళికను తయారు చేయడంలో ఐఐజీఎఫ్ ప్రయత్నాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐసీఐఈఆర్/బీఐఎఫ్ ద్వారా “బిల్డింగ్ ఏ ఇన్‌క్లూసివ్ డిజిటల్ సొసైటీ ఫర్ రూరల్ ఇండియా” అనే పేరుతో తయారు చేసిన నివేదిక కూడా విడుదల అయింది. 
ఈ సందర్భంగా రాజీవ్ తన ఆలోచనలను పంచుకున్నారు. " 80 కోట్ల మంది నెట్ యూజర్లతో భారతదేశం అతిపెద్ద కనెక్టెడ్ నేషన్స్ లో ఒకటిగా అవతరిస్తోంది.  ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ ప్రోగ్రామ్‌ను,  త్వరలోనే అమలు చేస్తాం. దీనివల్ల 100 కోట్లకుపైగా భారతీయులకు నెట్ అందుతుంది.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 ప్రధాన లక్ష్యాలతో డిజిటల్ ఇండియా మిషన్‌ను 2015లో ప్రారంభించారు-. భారతీయుల జీవితాలను మార్చడం, డిజిటల్ వ్యవస్థాపకతతో ఆర్థిక అవకాశాలను విస్తరించడం  ఇంటర్నెట్‌తో సహా కొన్ని సాంకేతికతలలో వ్యూహాత్మక సామర్థ్యాలను మెరుగుపరచడం వీటిలో ముఖ్యమైనవి. తద్వారా ఇంటర్నెట్ భవిష్యత్తు    ప్రజాస్వామ్య విలువలను,  పౌర హక్కులను గౌరవించే దేశాల చేతుల్లోకి వచ్చింది. భారతదేశం బహుళ భాగస్వామ్యాన్నికి ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విశ్వాసం కలిగించే విషయం. బహుళ భాగస్వామ్యాన్ని ఒకే వేదిక మీదకు తీసుకురావడం, ఓపెన్, సురక్షితమైన & విశ్వసనీయ  జవాబుదారీ ఇంటర్నెట్ అందించడం ఐఐజీఎఫ్ లక్ష్యం" అని మంత్రి వివరించారు. చివరి రోజు అజయ్ డేటా (యూఏఎస్జీ చైర్మన్, datagroup.in) అధ్యక్షతన 'యూనివర్సల్ యాక్సెప్టెన్స్' పేరుతో వర్క్‌షాప్‌లలో బలమైన చర్చలు జరిగాయి; డాక్టర్ సంజయ్ బెహల్ (డైరెక్టర్ జనరల్, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్ఇన్)) అధ్యక్షతన 'సేఫ్ & ట్రస్టెడ్ ఇంటర్నెట్- సైబర్ సెక్యూరిటీ ఛాలెంజ్‌స్'పై సమాలోచనలు జరిగాయి. 'సైబర్ స్పేస్ రెగ్యులేషన్స్ - లీగల్ 'ఫ్రేమ్‌వర్క్'పై చర్చా కార్యక్రం డాక్టర్ రాజేంద్ర కుమార్ అధ్యక్షతన (అదనపు సెక్రటరీ, మైటీ) జరిగింది. 'ఓపెన్, సేఫ్, ట్రస్టెడ్  అకౌంటబుల్ ఇంటర్నెట్ - యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ'పై చర్చకు డాక్టర్ గుల్షన్ రాయ్ (భారత ప్రభుత్వం, ఎఫ్ఎం ఇంటర్నెట్) అధ్యక్షత వహించారు.
"భారతదేశం ఇప్పుడు గ్లోబల్ ఇంటర్నెట్ ఎకోసిస్టమ్‌లో ముఖ్యమైన భాగం. మనకు ఇప్పటికే 80 కోట్ల మంది భారతీయులు ఆన్‌లైన్‌లో ఉన్నారు. మరో 40 కోట్ల మందిని కనెక్ట్ చేయడం మన ముందున్న సవాల్. అపారమైన అవకాశాలను అందించే  బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌తో మనం వారి దగ్గరకు వెళ్లాలి. ఇంటర్నెట్ గ్లోబల్ మార్కెట్తోపాటు  తిరిగి సమాజానికి కూడా మేలు చేసేలా చూడాలి. ఇంటర్నెట్‌ను ఓపెన్‌గా, సురక్షితంగా & విశ్వసనీయంగా  అందరికీ జవాబుదారీగా మార్చే లక్ష్యం కోసం ఇంటర్నెట్ గవర్నెన్స్ దృష్టి కేంద్రీకరించడం కూడా చాలా ముఖ్యం. భారతదేశం బహుళ భాగస్వామ్యానికి గట్టిగా మద్దతు ఇస్తుంది," అని మైటీ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్నీ స్పష్టం చేశారు.  మూడు -రోజులపాటు ఆన్‌లైన్లో నిర్వహించిన ఈవెంట్ “ఇంటర్నెట్ శక్తి ద్వారా భారతదేశాన్ని సాధికారపరచడం” అనే థీమ్ చుట్టూ కేంద్రీకృతమై ఉంది.  డిజిటలైజేషన్ కోసం మార్గదర్శక ప్రణాళికపై చర్చించడానికి  ప్రపంచవ్యాప్తంగా అవసరమైన భాగస్వామికి భారతదేశం మద్దతు ఇస్తుందని నిర్ధారించడానికి  ఇంటర్నెట్ గవర్నెన్స్‌లోని వాటాదారులను ఒకచోట చేర్చింది.
నవంబర్ 25–-27 మధ్య జరిగిన ఈ కార్యక్రమం ఇంటర్నెట్ గవర్నెన్స్‌పై అంతర్జాతీయ విధాన అభివృద్ధిలో డిజిటలైజేషన్ పాత్ర  ప్రాముఖ్యతను కూడా నొక్కిచెప్పింది. ఐకెన్ బోర్డు ఛైర్మన్ మార్టెన్ బోటర్‌మాన్ మాట్లాడుతూ, “ఇంటర్నెట్ పౌరుల కోసం పని చేస్తుందని  ఇతర పబ్లిక్ స్పేస్‌ల మాదిరిగానే సురక్షితంగా ఉంటుందని  నిర్ధారణ కావాలి. కరోనా మహమ్మారి ఇంటర్నెట్ ఎంత కీలకమో మాకు నేర్పింది.  ఇది ప్రజలకు అసాధారణ రీతిలో సేవ చేయగలిగింది. ఇంటర్నెట్ గవర్నెన్స్  సాంకేతిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.  ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందనే దానిపై స్పష్టమైన అవగాహన ఉండేలా చేయాలి. మనం ఈ ఏకైక ఇంటరాపరబుల్ ప్రపంచం  భద్రత  స్థితిస్థాపకతను కాపాడుకోవాలి.  వందల కోట్ల మంది కోసం ఇంటర్నెట్‌ను నిర్మించాలి. ఇందులో భారతదేశం ప్రముఖ పాత్ర పోషించాలి”అని ఆయన అన్నారు. 
ఈ సందర్భంగా జరిగిన మూడు ప్లీనరీ సెషన్లు ముఖ్యమైన అంశాల (థీమ్) పై జరిగాయి. అవి: 'ఇండియా & ఇంటర్నెట్- ఇండియాస్ డిజిటల్ జర్నీ & హర్ గ్లోబల్ రోల్' రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర మంత్రి (మైటీ), 'కనెక్టింగ్ ఆల్ ఇండియన్స్' అధ్యక్షతన సెక్రటరీ (మైటీ),  'సురక్షిత భవిష్యత్తు కోసం ఇంటర్నెట్‌ను భద్రపరచడం' సెక్రటరీ, (డాటా) కె. రాజారామన్ అధ్యక్షతన జరిగాయి.
 
"భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ.  అత్యాధునిక ఆవిష్కరణల వల్ల  డిజిటల్ అసమానతలను పెంచడం వంటి సవాళ్లు ఉన్నాయి. పరికరాలు,  మౌలిక సదుపాయాలు అందరికీ సమానంగా అందేలా చూడాలి. నమ్మకం,  భద్రత కూడా ముఖ్యమైనవి. బలమైన సంస్థలను  నిర్మించడంలో ప్రభావవంతమైనవి.  ప్రభుత్వం,  ప్రభుత్వ రంగాల వద్ద పౌరులకు సంబంధించిన  భారీ డేటా ఉంది.  అది సురక్షితంగా ఉందని  నిర్ధారణ కావాలి.  ప్రజల భాగస్వామ్యం,  జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి  ప్రాంతీయంగా, జాతీయంగా  ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పాలన కోసం సహకరించాలి, ”అని మ్యాగ్ చైర్మన్ అన్రియెట్ ఎస్టర్‌హ్యూసెన్ అన్నారు.  “సమాజానికి చేరువ కావడానికి మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరమయ్యే ఏఐ వంటి అనేక కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. విధానాలు  నిబంధనలలో ఇప్పటికే ఉన్న అడ్డంకులను తొలగించగలిగితే, మన ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా దార్శనికత  తదుపరి స్థాయిని మనం సాధించగలుగుతాం ”అని బికె సింఘాల్ అన్నారు. భారతదేశంలో 100శాతం జనాభాను ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లోకి తీసుకురావడానికి భారతదేశంలో డిజిటల్ డ్రైవ్ పూర్తిస్థాయిలో నడుస్తోంది. ఈ ఈవెంట్ భారతదేశంలోని డిజిటలైజేషన్ రోడ్‌మ్యాప్, అవకాశాలు,  సవాళ్లపై దృష్టి సారిస్తోంది. బహిరంగ  సమ్మిళిత ప్రక్రియ ద్వారా, ఐఐజీఎఫ్, ప్రభుత్వం, పరిశ్రమ, పౌర సమాజం, విద్యాసంస్థలతో సహా గ్లోబల్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఎకోసిస్టమ్‌లోని అందరు వాటాదారులను –  ఇంటర్నెట్ గవర్నెన్స్ పై చర్చలో భాగస్వాములను చేస్తోంది.
“ప్రజల ప్రయోజనం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్చడాన్ని భారతదేశం సమర్థిస్తుంది. అంతేకాదు కాదు,  మా విధానాలను ఆచరణలో కూడా పెడుతున్నాం. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కనెక్టెడ్ కంట్రీ. ఓపెన్, సురక్షితమైన & విశ్వసనీయ  జవాబుదారీ ఇంటర్నెట్  సాధనకు బహుళ భాగస్వామ్యం కోసం దాని పాత్ర గురించి చర్చించడం ప్రపంచస్థాయిలో చాలా ముఖ్యం” అని నిక్సీ సీఈఓ అనిల్ జైన్ అన్నారు. ఇండియా ఇంటర్నెట్ గవర్నమెంట్ ఫోరమ్.. ఐరాస ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (యూఎన్ఐజీఎఫ్)తో అనుసంధానమైన కార్యక్రమం. ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (ఐజీఎఫ్).. ఇంటర్నెట్‌కి సంబంధించిన పబ్లిక్ పాలసీ సమస్యలను చర్చించడానికి వివిధ సమూహాల నుండి ప్రతినిధులను ఒకచోట చేర్చే బహుళ భాగస్వామ్య వేదిక
***

(Release ID: 1776026) Visitor Counter : 146