రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

10,000 కిలోమీట‌ర్ల ను పూర్తి చేసిన ఇండియా@75 బిఆర్ ఒ మోటార్ సైకిల్ యాత్ర

Posted On: 28 NOV 2021 9:23AM by PIB Hyderabad

ముఖ్యాంశాలు
ఇండియా @75 బిఆర్ ఒ మోటార్ సైకిల్ యాత్ర ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ లో భాగంగా  దేశం నలు మూల‌ల నుంచి యాత్ర‌ను చేప‌ట్టింది. దీని ద్వారా జాతీయ స‌మైక్య‌త‌, జాతి నిర్మాణం, రోడ్డు భ‌ద్ర‌తా అవ‌గాహ‌న‌ను యాత్ర‌పొడ‌వునా క‌ల్పిస్తున్నారు.

ఈ యాత్ర‌ను ఢిల్లీనుంచి ప్రారంభించారు. దీనిని ర‌క్ష‌ణ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ 2021 అక్ఠోబ‌ర్ 14న జెండా ఊపి ప్రారంభించారు. 2021 న‌వంబ‌ర్ 27న ఈ యాత్ర కోల్ క‌తా చేరుకోవ‌డంతో దీని నాలుగోద‌శ పూర్తి అయింది.  44 రోజుల నిర్విరామ‌ ప్ర‌యాణంలో ఇది 10 వేల కిలోమీట‌ర్ల‌కు పైగా పూర్తి చేసింది.  త‌దుప‌రియాత్ర క‌న్యాకుమారి వైపు సాగుతుంది.

ఇండియా @75 బిఆర్ ఒ మోటార్ సైకిల్ యాత్ర 12 రోజుల‌లో నాలుగో విడ‌త‌లో 3200 కిలోమీట‌ర్ల దూరాన్ని పూర్తి చేసిది. 2021 న‌వంబ‌ర్ 27న కోల్ క‌తా చేర‌డానికి ముందు  ఇది ఆరు రాష్ట్రాల‌లో యాత్ర‌ను నిర్వ‌హించింది.ఈ బృందం అస్సాం, నాగాలాండ్‌, మ‌ణిపూర్ , మిజోరం మేఘాల‌య రాష్ట్రాల‌లోని కొండ ప్రాంతాల‌న దాటుకుంటూ తూర్పు కోస్తాలోని కోల్‌క‌తాను చేరింది. ఈ బృందం జోర్హాట్‌, దిమాపూర్‌, ఇంఫాల్‌,  సిల్చార్‌, ఐజ్వాల్‌, షిల్లాంగ్‌, అలిపుర్‌దువార్‌,మాల్దాల మీదుగా కోల్‌క‌తా చేరుకుంది..
 ఈ యాత్ర‌ను ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2021 అక్టోబ‌ర్ 14న కొత్త‌ఢిల్లీనుంచి ప్రారంభించారు. ఈ బృందం ఎత్తైన ప‌ర్వ‌త ప్రాంతాలు, మంచుతో నిండిన హిమాచ‌ల్‌, లెహ్, ల‌ద్దాక్‌, జ‌మ్ముకాశ్మీర్ వంటి ప్రాంతాల మీదుగా ప్ర‌యాణించింది. రెండో యాత్ర‌లో ఇది పంజాబ్‌, ఉత్త‌రాఖండ్ కొండ ప్రాంతాలు, ఇండో గంగా మైదాన ప్రాంత‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, ప‌శ్చిమ‌బెంగాల్ మీదుగా సిలుగురికి చేరింది. మూడో ద‌శలో ఈ యాత్ర నాథూలా, గాంగ్ ట‌క్‌,కాలింపాగ్‌, హ‌షిమ‌రా, గువ‌హ‌టి , తేజ్‌పూర్‌, ఇటాన‌గ‌ర్‌, పాసిఘాట్‌, మీదుగా అస్సామ్‌లోని దూమ్ దూమా చేరి అక్క‌డి నుంచి కోల్‌క‌తా కు చేరుకుంది.

ఈ ప‌ర్య‌ట‌న‌లో బృంద స‌భ్యులు మోటివేష‌న‌ల్ ఉప‌న్యాసాలు ఇస్తూ యువ‌త‌తో మ‌మేక‌మ‌వుతూ వ‌చ్చారు. పాఠ‌శాల విద్యార్థులు, కాలేజ్ విద్యార్ధులు, ఎన్ సిసి కేడెట్ లతో జోర్హాట్‌, దిమాపూర్‌, ఇంఫాల్‌, సిల్చార్ ఐజ్వాల్‌, షిల్లాంగ్‌, అలిపుర్దుయార్‌, మాల్డా, కోల్‌క‌తాల‌లో మ‌మేక‌మయ్యారు. జాతినిర్మాణంలో వారు ఎలా మ‌మేకం కావ‌చ్చో తెలియ‌జేస్తూ లోతైన చ‌ర్చ‌ను జ‌రిపారు. బి.ఆర్.ఒలో,సైన్యంలో చేర‌డానికి యువ‌త చూపిన ఆస‌క్తి, యువ‌త వేసిన ప్ర‌శ్న‌లు బృంద స‌భ్యుల‌ను సంతోషానికి గురిచేశాయ‌. రోడ్డు భ‌ద్ర‌త‌కు సంబంధించి కూడా బృంద స‌భ్యులు త‌మ యాత్ర లో ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పించారు. ఇందుకు సంబంధించి ప‌లు క్విజ్‌లు, అన్ని వ‌య‌సుల‌వారితో స‌మావేశాలు దారిపొడ‌వునా నిర్వ‌హించారు. స్థానికుల‌తో మాట్లాడ‌డం, అనాధ‌శ‌ర‌ణాల‌యాలు, వృద్ధాశ్ర‌మాల‌ను సంద‌ర్శించి వారు అక్క‌డ కొంత సేపు గ‌డిపారు. వివిధ ప్రాంతాల‌లో ప్ర‌ముఖుల‌ను వారు క‌లిశారు.

 ఈ బృందానికి ప్ర‌తిచోటా ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింఇ. వారు త‌మ యాత్ర లో మాజీ అంత‌ర్జాతీయ బాక్స‌ర్‌, రాజీవ్ గాంధీ ఖేల్ ర‌త్న అవార్డు విజేత శ్రీమ‌తి స‌రితా దేవిని,  భార‌త బాక్సింగ్ కోచ్‌, ద్రోణాచార్య అవార్డు పొందిన శ్రీ లిబోంచా సింగ్‌ను వారు క‌లుసుకున్నారు. ప‌లు చోట్ల ఆయా రాష్ట్రాల‌కు చెందిన కీల‌క ప్ర‌ముఖులు వారి యాత్ర‌ను జెండా ఊపి ప్రారంభించారు. మ‌ణిపూర్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఎల్‌.ఎ. గ‌ణేశ‌న్ యాత్ర‌లో పాల్గొన్న బృంద సభ్యుల‌తో మాట్లాడారు. ఈశాన్యంలో బిఆర్ ఒ చేప‌ట్టిన రోడ్ మౌలిక స‌దుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల‌ను ఆయ‌న కొనియాడారు.  మిజోరం యువ‌జ‌న‌, క్రీడ‌ల శాఖ మంత్రి శ్రీ పు రాబ‌ర్ట్ రొమావియా రాయ‌త్ త‌న మోట‌ర్ సైకిల్ న‌డుపుకుంటూ యాత్ర‌లో పాల్గొని ఐజ్వాల్ శివారులో వారికి వీడ్కోలు ప‌లికారు.

ఇండియా @75 బిఆర్ ఒ మోటార్ సైకిల్ యాత్ర ఇప్ప‌టివ‌ర‌కు 10 వేలకు పైగా కిలోమీట‌ర్ల దూరాన్ని పూర్తి చేసింది. దాదాపు గా ఇది త‌మ యాత్ర మ‌ధ్య‌లో ఉంది. బృంద స‌భ్యులు ఈ యాత్ర‌లో మ‌ర‌పురాని మ‌ధుర‌మైన జ్ఞాప‌కాల‌ను మూట‌గ‌ట్టుకున్నారు. జీవిత ప‌ర్యంతం మిగిలిపోయే అనుబంధాల‌ను సంపాదించుకున్నారు. ప్ర‌జ‌ల‌తో పెద్ద ఎత్తున మ‌మేక‌మ‌య్యారు. ముఖ్యంగా రోడ్డు భ‌ద్ర‌త‌పై ప్ర‌జ‌ల‌లో విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించ‌గ‌లిగారు. ఈ యాత్ర త‌దుప‌రి గ‌మ్య‌స్థాన‌మైన క‌న్యాకుమారి వైపు సాగుతోంది.

 

 


(Release ID: 1776025) Visitor Counter : 132