ఆయుష్

హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్వహించబడుతున్న ASU&H ఔషధాల నియంత్రణదారులు మరియు తయారీదారుల శిక్షణా సమావేశం

Posted On: 26 NOV 2021 12:29PM by PIB Hyderabad

ఆయుర్వేదం, సిద్ధ, యునానీ మరియు హోమియోపతీ (ASU&H) ఔషధాల అమలె మరియు తయారీ సమస్యలకు సంబంధించిన ఆచరణాత్మక అంశాలతో నియంత్రణదారులు మరియు తయారీదారులకు అవగాహన కల్పించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ గురువారం రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది.

మంత్రిత్వ శాఖలో డ్రగ్ పాలసీ విభాగం మూడు నెలల వ్యవధిలో నిర్వహించనున్న ఐదు శిక్షణా సమావేశాల్లో ఇది మొదటిది. ఉత్తర జోన్‌లోని హిమాచల్ ప్రదేశ్‌లోని మండి వద్ద ఉన్న ప్రాంతీయ ఆయుర్వే పరిశోధనా సంస్థలో జరిగిన ఈ శిక్షణా సమావేశానికి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్, జమ్మూ కశ్మీర్ మరియు హర్యానా నుంచి దాదాపు 40 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

ఇప్పటికే ఉన్న నియంత్రణ నిబంధనలు, GMP, WHO-GMP, DTL, ASU&H జౌషధాల పరీక్ష, పరిశ్రమ మరియు రాష్ట్ర ఔషధ నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ నిమిత్తం గల పథకాలను ఈ కార్యక్రమం కవర్ చేస్తుంది. నాణ్యమైన ఆయుష్ ఔషధాలు అందించడమే లక్ష్యంగా చేస్తున్న పనిని ప్రోత్సహించడం మరియు స్టాక్ హోల్డర్లను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర వాటాదారులు ఓ చోట కలిసి పరస్పరం చర్చించుకునే కార్యక్రమం ఇది.

మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం, శిక్షణా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ASU&H ఔషధ రెగ్యులేటర్లు మరియు ASU&H ఔషధ పరిశ్రమ సిబ్బంది మధ్య ఒక ఉమ్మడి వేదిక ద్వారా నిబంధనల గురించి మరింత స్పష్టత తీసుకురావడం. ఆయుష్ ఔషధ నియంత్రణదారులు, పరిశ్రమ ఇబ్బంది మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన వాటాదారులతో జరిగే ఈ సమావేశానికి ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం నుంచి వారి ప్రతినిధులను నామినేట్ చేస్తుంది.

ఆయుర్వేద శాస్త్రంలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ మరియు వివిధ జాతీయ సంస్థల సహకారంతో మంత్రిత్వ శాఖలోని ఔషధ పాలసీ విభాగం ఈ శిక్షణా సమావేశాలను నిర్వహిస్తోంది.

***



(Release ID: 1775626) Visitor Counter : 112