సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఉత్తరాఖండ్‌లోని గ్రామాలలో వలసల కారణంగా ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో సాగే


ప్రేమ , స్నేహానికి సంబంధించిన కథ 'సన్‌పత్': ఐఎఫ్ఎఫ్ఐ52లో దర్శకుడు రాహుల్ రావత్

పీబీఐ ముంబై, పోస్ట్ చేసిన తేదీ: 25 నవంబరు 2021 2:43 పీఎం

Posted On: 25 NOV 2021 2:43PM by PIB Hyderabad

సన్‌పత్ అంటే మనం అనుభవించే ఒంటరితనం.  ప్రకృతి,  పర్వతాలతోపాటు, చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ మన విడిచిపెట్టినప్పుడు అనుభవించే ఏకాంతం. పండుగ వేడుకలు ముగిసిన తర్వాత జనాలు ఆ స్థలాన్ని విడిచిపెట్టినప్పుడు మైదానం అంతా ఖాళీగా ఉంటుంది. తన గర్వాలీ చిత్రం సన్‌పత్‌లో దర్శకుడు రాహుల్ రావత్ ఉత్తరాఖండ్‌లోని నిర్మానుష్య గ్రామాలలోని ఈ శూన్యతను, ఖాళీని సంగ్రహించడానికి ప్రయత్నించాడు. జనమంతా ఉద్యోగాల కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లిపోవడంతో ఊళ్లన్నీ నిర్జీవంగా మిగిలిపోయాయి. “అవకాశాలు లేకపోవడం వల్ల ఉత్తరాఖండ్ ప్రజలు చాలా కాలంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వివిధ సామాజిక,-ఆర్థిక కారణాల వల్ల సంభవించిన ఈ వలసలు రాష్ట్రంలో సుమారు 1500 గ్రామాల్లో శూన్యాన్ని నింపాయి.  4000 కంటే ఎక్కువ గ్రామాలు అతి తక్కువ జనాభాతో ఉన్నాయి.  ఈ ప్రాంతాల సమాజం, సంస్కృతి  సంప్రదాయాలు ప్రమాదంలో పడ్డాయి. అందుకే నేను ఈ కథను చెప్పాలనుకుంటున్నాను. మా రాష్ట్రంలో వలసలు ఎలా విధ్వంసం సృష్టిస్తున్నాయో ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నాను’’ అని రావత్ వివరించారు.

ఈ ఘటనను సినిమా తీయడం గురించి తన అనుభవాన్ని పంచుకుంటూ, రాష్ట్రవ్యాప్తంగా తాము కలుసుకున్న,  ఇంటర్వ్యూ చేసిన నిజ జీవిత వ్యక్తులు చెప్పిన విషయాల ఆధానంగా తీసుకొని ఈ సినిమాను తయారు చేశామని చెప్పారు. నటీనటులను ఎంపిక చేశాక, కేవలం 20 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా డీఓపీగా పనిచేసిన వీరూ సింగ్ బఘెల్ తన షూటింగ్ అనుభవాన్ని వివరిస్తూ. “మేము తెల్లవారుజామునే లేచేవాళ్లం. పర్వతాలపై సూర్యుడు చాలా త్వరగా కదులుతున్నందున సూర్యరశ్మిని వెతకడానికి ఒక పర్వతం నుండి పర్వతానికి పరిగెత్తేవాళ్లం. సినిమాకు సంబంధించిన నటులందరూ మా సిబ్బంది పరికరాలను మార్చడంలో సహాయపడేవారు. నేను రెండు ఎల్‌ఈడీ లైట్లపై సినిమా మొత్తం షూట్ చేశాను. ఇది మొత్తం మీద అద్భుతమైన అనుభవం ” అని పేర్కొన్నారు. ఈ సమావేశానికి హాజరైన చిత్ర సహ నిర్మాత రోహిత్ రావత్ మాట్లాడుతూ సన్పత్ను రూపొందించడంలో తన అనుభవాలను ప్రతినిధులతో,  మీడియాతో పంచుకున్నారు.  గోవాలో నిర్వహిస్తున్న 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా .. ఇండియన్ పనోరమా నాన్-ఫీచర్ ఫిల్మ్ విభాగంలో సన్పత్ను ప్రదర్శించారు.  ఇది ఐఎఫ్ఎఫ్ఐలో చోటు దక్కించుకున్న మొదటి ఉత్తరాఖండ్ సినిమా.

సినిమా గురించి

దర్శకుడు రాహుల్ రావత్ రూపొందించిన ఇండియన్ పనోరమా నాన్-ఫీచర్ ఫిల్మ్ సన్‌పత్ అనేది పన్నెండేళ్ల అనూజ్, ఆయన స్నేహితుడు భార్తూ  కథ. అనూజ్ ఒకప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడితే, అతనిని ఏ మాత్రం పట్టించుకోలేదు.  ఆమెకు  ప్రపోజ్ చేయడానికి మార్గాలను వెతుకుతున్నప్పుడు, వారి ప్రస్థానం మొదలువుతుంది. ఉత్తరాఖండ్‌లోని చాలా గ్రామాలు దీర్ఘకాలంగా సాగుతున్న సామాజిక ఆర్థిక వలసల కారణంగా ఎదుర్కొంటున్న మానసిక క్షోభను మనం చూస్తాం. నిస్సహాయ సమయంలో చిగురించే ప్రేమ, స్నేహాల కథే ‘సన్‌పత్‌’.

 రాహుల్ రావత్ గురించి

దర్శకుడు & నిర్మాత: రాహుల్ రావత్ పెర్సెప్ట్ పిక్చర్స్లో రచయిత,- దర్శకుడిగా చేరడానికి ముందు ప్రఖ్యాత యాడ్-ఫిల్మ్ డైరెక్టర్ల దగ్గర పనిచేశాడు.  ప్రజల జీవితాన్ని మార్చగల శక్తి సినిమాలకు ఉంటుందని గ్రహించి ప్రకటనల రంగం నుంచి సినీరంగానికి మారాడు. రాహుల్ రావత్ ఇంతకుముందు అమిత్ శర్మ (బధాయి హో దర్శకుడు)తో కలిసి పనిచేశాడు. రచయిత, దర్శకుడు, సహ నిర్మాత , స్క్రీన్‌ప్లే రచయిత,  ఎడిటర్‌గా సన్‌పత్ ఇతని మొదటి చిత్రం.

***



(Release ID: 1775476) Visitor Counter : 144