వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బెంగళూరు-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ (బిఎంఐసీ) ప్రాజెక్ట్ కింద కర్ణాటకలోని ధార్వాడ్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి

Posted On: 26 NOV 2021 1:00PM by PIB Hyderabad

దేశ జిడిపీలో తయారీ వాటాను పెంచడానికి మరియు క్రమబద్ధమైన మరియు ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణను నిర్ధారించడానికి, భారత ప్రభుత్వం (జిఓఐ) రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కీలకమైన రవాణా కనెక్టివిటీ మౌలిక సదుపాయాలపై సమగ్ర పారిశ్రామిక కారిడార్‌లను అభివృద్ధి చేసే వ్యూహాన్ని అనుసరించింది.

ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రామ్ కింద పరిశ్రమలకు నాణ్యమైన, నమ్మదగిన, స్థిరమైన మరియు స్థితిస్థాపకమైన మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా దేశంలోకి తయారీ పెట్టుబడులను సులభతరం చేయడానికి స్థిరమైన 'ప్లగ్ ఎన్ ప్లే' ఐసిటీ ఎనేబుల్ యుటిలిటీలతో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ పారిశ్రామిక నగరాలను సృష్టించడం లక్ష్యం. ఈ మేరకు 4 దశల్లో అభివృద్ధి చేయడానికి 32 ప్రాజెక్ట్‌లతో కూడిన 11 పారిశ్రామిక కారిడార్‌లను భారత ప్రభుత్వం ఆమోదించింది.

ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ (డిఎంఐసీ)లో భాగంగా గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్‌లలో 04 గ్రీన్‌ఫీల్డ్ పారిశ్రామిక స్మార్ట్ సిటీలు/నోడ్‌లు అభివృద్ధి చేయబడుతున్నాయి. ఈ పారిశ్రామిక నగరాలు/నోడ్‌లలో 138 ప్లాట్‌లతో (754 ఎకరాలు) ప్రధాన ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తయ్యాయి. వీటిపై కంపెనీల పెట్టుబడి రూ. 16,750 కోట్లు. ఈ నగరాలు/నోడ్‌లలోని యాంకర్ పెట్టుబడిదారులలో హ్యోసంగ్ (దక్షిణ కొరియా), ఎన్‌ఎల్‌ఎంకె (రష్యా), హయ్యర్ (చైనా), టాటా కెమికల్స్ మరియు అముల్‌ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇతర ఇండస్ట్రియల్ కారిడార్‌లలోని 23 నోడ్‌లు/ప్రాజెక్ట్‌లు ప్రణాళిక మరియు అభివృద్ధికి చెందిన వివిధ దశల్లో ఉన్నాయి.

బెంగళూరు-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ (బిఎంఐసీ) కర్ణాటక మరియు మహారాష్ట్ర రెండు రాష్ట్రాలలో బాగా ప్రణాళికాబద్ధమైన మరియు వనరుల-సమర్థవంతమైన పారిశ్రామిక స్థావరాన్ని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడింది. మొత్తం కారిడార్ కోసం పర్ స్పెక్టివ్ ప్లాన్ తయారు చేయబడింది మరియు ధార్వాడ్ (కర్ణాటక) మరియు సతారా (మహారాష్ట్ర) ప్రాధాన్యతా నోడ్‌లుగా గుర్తించబడ్డాయి.

బెంగళూరు-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ (బిఎంఐసీ) కింద కర్నాటక రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి మరియు ప్రాంతీయ పరిశ్రమల సముదాయాన్ని సాధించడానికి ధార్వాడ్ నోడ్లను అభివృద్ధి చేయాలని భావించారు. ఈ ప్రాజెక్ట్ 6,000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అలాగే హుబ్బల్లి-ధార్వాడ్ జంట నగరానికి (కర్ణాటక రాష్ట్రంలో రెండవ అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్) సమీపంలో ఉంది. ఇది కర్ణాటకలో తదుపరి పారిశ్రామిక విప్లవానికి జెండా బేరర్‌గా నిలిచింది. ఈ ప్రదేశం రోడ్ల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది (ఎన్‌హెచ్‌ 48 & 67), ఇది మెట్రో నగరాలు ముంబై, బెంగళూరు మరియు గోవాలతో పాటు ఇతర ప్రధాన పట్టణ కేంద్రాలను కలుపుతుంది. ధార్వాడ్‌లో ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్ 25 కి.మీ దూరంలో ఉంది మరియు ప్రతిపాదిత ధార్వాడ్-బెల్గావి రైలు మార్గం సైట్‌కు ఆనుకుని ఉంది. హుబ్బలి విమానాశ్రయం 30 కి.మీ దూరంలో ఉండగా, సమీప ఓడరేవులు కార్వార్ (170 కి.మీ) మరియు గోవా (180 కి.మీ) వద్ద ఉన్నాయి.

ధార్వాడ్‌లో ప్రతిపాదిత పారిశ్రామిక అభివృద్ధి ప్రస్తుత పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందిస్తుంది మరియు ధార్వాడ్‌లో పెద్ద స్థాయి ప్రాంతీయ ట్రంక్ మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా వివిధ వర్గాల పరిశ్రమలకు పెట్టుబడి గమ్యాన్ని సృష్టిస్తుంది.  ఇప్పటికే ఉన్న రహదారి/రైలు సరుకు రవాణా (బిఎంఐసీలో వ్యూహాత్మక స్థానం) యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. బెంగుళూరు మరియు ముంబై నుండి ~500 కిమీ సమాన దూరంలో ఉన్న కారిడార్). ఐఐటీ, ఐఐఐటీ, యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, హైకోర్టు మొదలైన వివిధ ప్రసిద్ధ సంస్థాగత సంస్థలు సమీపంలో ఉన్నాయి. బేలూర్ మరియు ముమ్మిగట్టి సమీపంలోని పారిశ్రామిక ప్రాంతాలు ఈ ప్రాంతానికి పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో సహాయపడతాయి.

మల్టీమోడల్ కనెక్టివిటీని అందించడానికి నేషనల్ మాస్టర్ ప్లాన్ అయిన పిఎం గతిశక్తి కింద ధార్వాడ్ నోడ్‌కు అవసరమైన ఏవైనా మౌలిక సదుపాయాల ఖాళీలను పరిశీలించి, ఆర్థిక మండలాలను సమగ్రంగా ఏకీకృతం చేయడం కోసం అభివృద్ధి చేయడానికి తీసుకోబడుతుంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్‌ఐసిడిఐటి) మరియు కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డ్ (కెఐఎడిబి) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నాయి. ప్రాజెక్ట్ కోసం మాస్టర్ ప్లానింగ్ మరియు ప్రిలిమినరీ ఇంజినీరింగ్ కోసం కన్సల్టెంట్‌ని నియమించారు. దీనికి సంబంధించి నవంబర్ 24న ఎన్‌ఐసిడిసి, కిఐఏడిబి మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో ఎసీఎస్‌, కామర్స్ మరియు ఇండస్ట్రీస్ అధికారులతో కలిసి కిక్-ఆఫ్ సమావేశం జరిగింది.

***(Release ID: 1775306) Visitor Counter : 67


Read this release in: English , Hindi , Tamil , Kannada