బొగ్గు మంత్రిత్వ శాఖ

మెరుగైన జీవన పరిస్థితులతో పురూలియా గ్రామాలు!


పశ్చిమ బెంగాల్.లో కోల్ ఇండియా కృషి..
రూ. 27కోట్ల వ్యయంతో విభిన్న సదుపాయాలు

Posted On: 25 NOV 2021 4:41PM by PIB Hyderabad

   భారతీయ ఇంధన భద్రతలో వెన్నెముకగా పేర్కొనదగిన కోల్ ఇండియా లిమిటెడ్ (సి.ఐ.ఎల్.) సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్.డి.జి.లను) స్థిరీకరణలో కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తూ వస్తోంది.  దేశంలోని అనేక వెనుకబడిన, మారుమూల గ్రామాల్లో జీవన పరిస్థితులను, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కోల్ ఇండియాతో పాటుగా దాని అనుబంధ సంస్థలు కూడా నిమగ్నమయ్యాయి. కోల్ ఇండియాకు బలమైన అనుబంధ సంస్థ అయిన ఈస్టర్న్ కోల్.ఫీల్డ్స్ లిమిటెడ్ (ఇ.సి.ఎల్.) ఈ విషయంలో తన మాతృసంస్థకు గట్టి మద్దతును అందిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతమైన పురూలియా జిల్లాలోని పలు మారుమూల గ్రామాలకు సౌరశక్తి సరఫరా,  పర్యావరణ హితమైన సదుపాయాలు, నాణ్యమైన విద్యవంటి అవకాశాలను అందించడంలో ఇ.సి.ఎల్. ఎంతో కృషి చేస్తోంది.

“సౌరశక్తి సహాయంతో మాకు ఇపుడు నిర్విరామంగా విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంటోంది. దీంతో నేను రాత్రి పూట కూడా చదువుకోగలుగుతున్నా. ఇదివరకంటే నాకు మంచి మార్కులు వస్తున్నాయి, అంటూ రోషిణీ హెంబ్రమ్ అనే విద్యార్థి చెప్పింది. ఆమె కళ్లలో ఆనందం తొణికిసలాడింది. ఆమె 11వ తరగతి చదువుకుంటోంది. వెనుకబడిన పురూలియాజిల్లాలోని బొగ్గుక్షేత్రం పరిసరాల్లో, నెతూరియా బ్లాక్ పరిధిలోని ఒక మారుమూల గ్రామంలో రోషిణి చదువుకొంటోంది. ఉపాధ్యాయురాలు కావాలన్నది ఆమె ఆశయం. ఇపుడు ఆమె జీవితం క్రమంగా మారుతోంది. దీనితో,..12వ తరగతిలో తాను మంచి స్కోరుతో ఉత్తీర్ణత సాధించగలనని, టీచర్ ఉద్యోగం సాధించగలనని ఆమెలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. అలాగే,..లాల్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు శబరాని మోండల్ కూడా ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. “విద్యుత్ సరఫరా ఆగిపోయినా మాకు విద్యాబోధనలో ఎలాంటి ఇబ్బందులూ లేవు. ఎందుకంటే, ప్రత్యామ్నాయంగా మాకు సౌరశక్తి ఉంది. మా స్కూల్లో సోలార్ పవర్ యూనిట్ కూడా ఏర్పాటు చేశారు.” అంటూ ఆయన ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. నెతూరియా బ్లాకు పరిధిలోని పలు గ్రామాల ప్రజల జీవన స్థితిగతుల్లో ఇలాంటి మార్పులు ఎన్నో కనిపించాయి. కోల్ ఇండియా తన అనుబంధ సంస్థ అయిన ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ సహాయంతో ఎంతో చిత్తశుద్ధితో చేస్తున్న కృషే ఇందుకు కారణం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే కార్యక్రమంలో భాగంగా కోల్ ఇండియా ఈ కృషి చేస్తోంది.

https://ci6.googleusercontent.com/proxy/G2p6bkrDgAKQrASY7PpXkNIR8VAZGiyv4KtBxHfU3tyq2PuowGT4xaZ4s3rSA4miIDYqJbpq847DHuAceG6ZdpzxEe67I3RzmCRzH-pzxhm7iSvkyQUAspejfQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0016TT6.jpg

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన పురూలియాలో బొగ్గు గనులను ఇ.సి.ఎల్. నిర్వహిస్తూ వస్తోంది. స్థానిక ప్రజలు ఎక్కువగా బొగ్గుక్షేత్రాల్లోనో లేదా వ్యవసాయ పనుల్లోనో ఉపాధి పొందుతూ ఉంటారు. అయితే, ఈ ప్రాంతంలో వర్షాభావం కారణంగా దుర్భిక్షం ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది. ఇక్కడి చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా వర్షాధార పంటలు, అంటే ఒకే పంటపై ఆధారపడుతూ ఉంటారు. దీనితో పంటల ఉత్పాదన కూడా తక్కువై,  వారు ఎక్కువగా పేదరికంలో ఉంటున్నారు. ఎక్కువ ఇళ్లలో కలపనే వంటచెరకుగా వాడుతూ ఉంటారు. కిరోసిన్ వాడకం కూడా ఎక్కువగానే ఉంది. చాలా వరకు ఇళ్లకు మరుగుదొడ్ల సదుపాయం కూడా లేదు కాబట్టి మలమూత్ర విసర్జనకు ఆరుబయటకే వెళ్తుంటారు. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధనా సదుపాయం లేదు. స్థానిక పరిపాలనా సంస్థలు కొంత కృషి చేసినప్పటికీ, బొగ్గు గనుల ప్రాంతంలో, పరిసర గ్రామాల్లో మాత్రం సరైన సదుపాయాలు లేవు. నిర్విరామంగా విద్యుత్ సరఫరా, వంటకోసం సరైన ఇంధనం, రహదారులు, సరైన పాఠశాల విద్య, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి మౌలిక సదుపాయాలు వారికి అందుబాటులో లేవు.

  బొగ్గు గనుల ప్రాంతంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబందించి తాను నిర్వహించాల్సిన పాత్రపై అవగాహన కలిగిన కోల్ ఇండియా, ఈ గ్రామాల్లో స్థానిక సమస్యల పరిష్కారాన్ని సవాలుగా తీసుకుంది. నెతూరియా బ్లాక్ పరిధిలోని 38 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా మార్చాలని నిర్ణయించింది. తాను చేపట్టే కార్యక్రమాలకోసం లబ్ధిదారుల ఇళ్ల సంఖ్యను తెలుసుకునేందుకు మొదట ఒక సర్వే నిర్వహించింది. సామాజిక రంగంపై అధ్యయనంలో ప్రఖ్యాతి గాంచిన విద్యాసంస్థ,. ముంబైకి చెందిన.టాటా ఇన్.స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టి.ఐ.ఎస్.ఎస్.-టిస్) ఈ సర్వే నిర్వహించింది. పర్యావరణం, సుస్థిర అభివృద్ధి వంటి అంశాల్లో ప్రముఖంగా పనిచేసే న్యూఢిల్లీకి చెందిన ఇంధన, వనరుల అధ్యయన సంస్థ (టి.ఇ.ఆర్.ఐ.)కు ఈ బాధ్యతను అప్పగించారు.

 

https://ci4.googleusercontent.com/proxy/JJmkLPtnGXyzaEkB5x2RKM5wZT26vpzHWcR5RgM8EWpUTbP7LzWH2m_Kz-x3pOSXkYImK1FZ2_Kyun0veyGwIO2O8hzm0_Fk8OyJlfbgTD2INvSvCtXeN4ymBQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0025AHH.jpg

  దీనితో కేవలం కొన్నేళ్ల వ్యవధిలోనే ఈ గ్రామాల్లో జీవన పరిస్థితులను గణనీయంగా మార్చేందుకు, గ్రామాలన్నింటినీ ప్రధాన ప్రగతిజీవన స్రవంతిలోకి తెచ్చేందుకు భారీగా కృషి జరిగింది. గ్రామాల్లోని ఇళ్లకు అవసరమైన విద్యుత్తుకోసం సౌరశక్తి ఆధారిత పరిష్కారాలను కల్పించేందుకు కృషి జరిగింది. సమగ్రమైన సొంత ఇంధన వ్యవస్థను (ఐ.డి.ఇ.ఎస్.),..ఎంపిక చేసిన ప్రతి ఇంటిలోనూ ఏర్పాటు చేశారు. సౌరశక్తితో పనిచేసే విద్యుద్దీప వ్యవస్థను ఐ.డి.ఇ.స్.లో అంతర్భాగంగా పొందుపరిచారు. ఒక ఎల్.ఇ.డి. బల్బుకు, ఒక మొబైల్ చార్జింగ్ సాకెట్.కు విద్యుత్తును అందించే సదుపాయాన్ని, వంట చెరకును తక్కువ పొగతో సమర్థవంతంగా మండించేందుకు వీలు కలిగించే సౌరశక్తి ఫ్యాన్.తో మెరుగైన వంట స్టవ్.ను కూడా ఇందులో అమర్చారు. సోలార్ పవర్ ప్యానెల్, బ్యాటరీ ప్యాక్.తో ఈ వ్యవస్థను రూపొందించారు. దీనికి తోడుగా 110 సౌర విద్యుత్ వీధి దీపాలను కూడా అమర్చారు. ఐ.డిఇ.ఎస్., వీధి దీపాల నిర్వహణను కూడా ఈ పథకంలో అంతర్భాగంగా చేర్చారు. ఏదైనా సమస్య వస్తే, సదరు ఫిర్యాదులను సిబ్బంది ఇళ్లవద్దకే వచ్చి పరిష్కరించేందుకు వీలుగా లబ్ధిదారులందరికీ సర్వీస్ ప్రొవైడర్ కాంటాక్ట్ నంబరును అందుబాటులో ఉంచారు. మొత్తం 9వేల ఇళ్లకు ఈ ప్రాజెక్టును వర్తింపజేశారు.

   ఇక వ్యవసాయం, పరిసరాలను మెరుగుపరుచుకోవడం, సామర్థ్యాల నిర్మాణం వంటి అంశాల్లో స్థానిక రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. పది గ్రామాలకు చెందిన 1,250మంది లబ్ధిదారులను ఇందుకోసం ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లోని మట్టి నమూనాల విశ్లేషణ చేయటం, బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, రాంచీలోని అటవీ ఉత్పాదనా సంస్థకు రైతులను సందర్శనకు తీసుకెళ్లడం వంటి చర్యల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. రైతులకు మెరుగైన వ్యవసాయ ఉపకరణాలను పంపిణీ చేయడం, పండ్ల మెక్కలను నాటడం, గొర్రెలను పంపణీ చేయడం తదితర చర్యలు కూడా తీసుకున్నారు. వరిసాగులో దిగుబడిని పెంచుకోవడం, వెదురుతో హస్తకళా ఖండాలను తయారు చేయడం, మత్స్య పరిశ్రమ కార్యకలాపాల్లో, పుట్టగొడుగుల సాగులో, ఇతర వ్యవసాయ సంబంధమైన మెలకువల్లో ఈ రైతులకు పటిష్టమైన శిక్షణ అందించారు. స్థానిక రైతుల జీవన స్థితిగతులపై గుణాత్మక ప్రభావాన్ని చూపడంలో ఇవన్నీ ఎంతో కీలకపాత్ర పోషించాయి. సంపూర్ణంగా మారిన పరిస్థితుల్లో, కొత్త వ్యవస్థ సాయంతో వారు వ్యవసాయం సాగించారు. వారిలో రవిలాల్ హెంబ్రమ్ అనే రైతు ఎంతో సంతోషంతో తన నూతన అనుభవాన్ని వివరించారు. “సంప్రదాయపరమైన వ్యవసాయ ఉపకరణాలు వాడటంతో నాకు తరచూ వెన్నునొప్పి వచ్చేది. కానీ ఇపుడు సాగుకోసం నాకు కొత్త ఉపకరణాలను కోల్ ఇండియా సంస్థ అందించింది. వాటితో నేను నా పొలంలో ఎంతో సౌకర్యంగా, సులభంగా పనిచేసుకుంటున్నాను.” అని రవిలాల్ ఆనందంగా చెప్పాడు.

ఇక పారిశుద్ధ్య సదుపాయాల కల్పనకోసం కూడా గణనీయమైన కృషి జరిగింది. ఇళ్లకు అనుబంధంగా మరుగుదొడ్లను నిర్మించేందుకు ఆయా గ్రామాల్లో మొత్తం 5,660 ఇళ్లను గుర్తించారు. అందుబాటులో ఉన్న స్థలం, ఇప్పటికే అందుబాటులో ఉన్న మరుగుదొడ్డి, బ్లాక్ స్థాయి పరిపాలనా యంత్రాంగం అందించిన ఇళ్ల జాబితా...వంటి అనేక అంశాల ప్రాతిపదికగా మరుగుదొడ్ల నిర్మించాల్సిన ఇళ్లను ఎంపిక చేశారు. మరుగుదొడ్ల నిర్మాణంలో కొత్త తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఏదైనా ఒక ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించే ముందు, సంబంధిత ఇంటిలోని కుటుంబాల సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. మరుగుదొడ్డిని తప్పక వాడితీరతామన్న ప్రతిజ్ఞను వారితో చేయించారు. మరుగుదొడ్డి సదుపాయంపై లబ్ధిదారుల్లో ఒకరైన మామోనీ బౌరీ ఎంతో సంతోషం వ్యక్తంచేశారు. “మరుగుదొడ్డి కట్టారు కాబట్టి మాకు కష్టాలు తొలగిపోయాయి. మలవిసర్జనకు నేను ఇక బయటికి పోవలసిన అవసరం లేదు. ఇది నాకు చాలా సౌకర్యంగా ఉంది.” అని మామోనీ బౌరీ అన్నారు.

https://ci3.googleusercontent.com/proxy/5YhBVI-tcFVsBvHqjQnQ4N24RZ8T1Dg3DRZaqSqs_kjBGwiKMsuzt4mMP4RUBIf-E6T4Vv2LUmKhfyx29-W9IebHXVTaxvx37J1M5NnIZbpOh24ySUlRHCRGtQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0034YG7.jpg

   ఇక స్థానిక పాఠశాలల స్థాయిని నవీకరించేందుకు కూడా కోల్ ఇండియా చొరవతో అనేక చర్యలు తీసుకున్నారు. ఒక్కో పాఠశాలకు ఒక కంప్యూటర్ చొప్పన 40 ప్రభుత్వ పాఠశాలలకు పవర్ బ్యాకప్ సదుపాయంతో కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు తగిన శిక్షణ అందించేందుకు కంప్యూటర్ ట్రెయినర్.ను, కంప్యూటర్.ను వినియోగించేందుకు శాశ్వత ప్రాతిపదికపై ఉపాధ్యాయులను కూడా నియమించారు. హిందీ, ఇంగ్లీష్, బెంగాళీ భాషల్లో ప్రధానమైన పుస్తకాలతో ప్రతి పాఠశాలకు ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాలలను అభివృద్ధిచేసేందుకు కోల్ ఇండియా తీసుకున్న చర్యల్లో ఇది ఎంతో ముఖ్యమైనది.

  రూ. 27కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకం, కోల్ ఇండియా నిర్వహించిన గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టుల్లో ఎంతో ప్రభావవంతమైనదిగా చెప్పవచ్చు. బొగ్గు గనుల తవ్వకంతోపాటుగా, మెరుగైన సామాజిక వాతావరణాన్ని కల్పించాలన్న చిత్తశుద్ధితో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా కోల్ ఇండియా ఈ కార్యక్రమాలన్నింటినీ చేపట్టింది.

 

*****



(Release ID: 1775282) Visitor Counter : 131