వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సంబంధిత శాఖల సీనియర్ ప్రభుత్వ అధికారులతో సామర్థ్య నిర్మాణ వ్యాయామాలను నిర్వహిస్తున్న - ప్రధానమంత్రి గతి శక్తి-బి.ఐ.ఎస్.ఏ.జి-ఎన్. బృందం
కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖల డేటాను నవీకరించడం నెలాఖరులోగా పూర్తవుతుందని భావిస్తున్నారు
అన్ని రాష్ట్రాలకు సామర్థ్య నిర్మాణ వ్యాయామాలను చేపట్టడానికి రాబోయే రెండు నెలల్లో 6 జోనల్ సమావేశాలను నిర్వహించనున్న - డి.పి.ఐ.ఐ.టి.
వ్యయ సామర్థ్యాలు, పోటీతత్వాన్ని తీసుకురావడంతో పాటు, సరకు రవాణా వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచనున్న - ప్రధానమంత్రి గతిశక్తి
Posted On:
24 NOV 2021 7:11PM by PIB Hyderabad
ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ను బి.ఐ.ఎస్.ఏ.జి-ఎన్ (భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియోఇన్ఫర్మేటిక్స్) సంస్థ, డైనమిక్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జి.ఐ.ఎస్) ప్లాట్‌ఫారమ్ లో అభివృద్ధి చేసింది. ఇందులో అన్ని మంత్రిత్వ శాఖలు / విభాగాల నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక కు సంబంధించిన సమాచారాన్ని సమగ్ర డేటా బేస్ లో పొందుపరచడం జరుగుతోంది. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సాధనాలు, డైనమిక్ డ్యాష్ బోర్డులు, ఎం.ఐ.ఎస్. నివేదికలను తయారు చేయడం వంటి వాటితో డిజిటల్ మాస్టర్ ప్లానింగ్ సాధనంగా ఈ వ్యవస్థ మరింత అభివృద్ధి చేయడం జరుగుతుంది.
ప్రస్తుత / ప్రణాళికాబద్ధమైన ప్రాజెక్టులపై సమాచారాన్ని ఒకే ప్లాట్‌ఫారమ్ ద్వారా ఏకీకృతం చేసి, సమకాలీకరించాలనే లక్ష్యంతో, ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, బి.ఐ.ఎస్.ఏ.జి.-ఎన్. బృందం, భారత ప్రభుత్వం లోని సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాల సీనియర్-స్థాయి అధికారుల తో సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నౌకాశ్రయాలు, రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ, జౌళి మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్ శాఖ మొదలైన వాటి కోసం చేపట్టిన ఈ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది.
ఈ సమగ్ర ప్రక్రియ జాతీయ మాస్టర్ ప్లాన్ యొక్క నవీకరణ కోసం సంబంధిత విభాగాలు మరియు బి.ఐ.ఎస్.ఏ.జి.-ఎన్. మధ్య సమాచార మార్పిడి ని సూచిస్తుంది. జి.ఐ.ఎస్. సాధనం గురించి మరింత మెరుగ్గా తెలుసుకునేందుకు డిపార్ట్‌మెంట్ లకు ఈ కసరత్తు సహకరించడంతో పాటు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో సమన్వయంతో ఆ ప్రాజెక్టుల పనితీరుకు ప్రాధాన్యత ఇవ్వడానికి, తదనుగుణంగా ప్రణాళిక తయారు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ యొక్క మెరుగైన పోటీతత్వానికి దారితీసే సరకు రవాణా వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.
నేషనల్ మాస్టర్ ప్లాన్ పోర్టల్ లో ఇప్పటికే ఉన్న మరియు ప్రతిపాదిత మౌలిక సదుపాయాలను నవీకరించడానికి మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలు భరోసా ఇస్తున్నాయి. అదేవిధంగా, దేశంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక మండలాలను ఆర్థిక మంత్రిత్వ శాఖలు నవీకరిస్తున్నాయి.
మౌలిక సదుపాయాలలో అంతరాలను గుర్తించి, ఆర్థిక మండలాల అవసరాన్ని గుర్తించడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుంది. ఈ విధంగా గుర్తించిన అంతరాల విశ్లేషణను నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ పరిశీలిస్తుంది. మౌలిక సదుపాయాలలోని సిఫార్సు చేసిన అంతరాలను పరిష్కరించే అంశాన్ని సంబంధిత మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలు ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపడతాయి. తద్వారా లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. కొత్త ఆర్థిక మండలాలను గుర్తించే క్రమంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలు నిర్ణయం తీసుకోవడానికి, మౌలిక సదుపాయాల నవీకరణ సహాయపడుతుంది.
అటువంటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు వీలుగా మౌలిక సదుపాయాల అంతరాలను గుర్తించేందుకు తగిన కృషి చేయాలని, అన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖలకు సూచించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, తమ సమాచారాన్ని నవీకరించే పనిని ఈ నెలాఖరులోగా పూర్తిచేస్తాయని భావిస్తున్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ విధమైన కృషి చేపట్టేందుకు వీలుగా, వచ్చే రెండు నెలల్లో ఆరు ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని, పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య విభాగం (డి.పి.ఐ.ఐ.టి) నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం మౌలిక సదుపాయాలతో పాటు, ఆర్థిక మండలాలను నవీకరించడంతో, మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖలకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే సాధనంగా, ఈ జాతీయ మాస్టర్ ప్లాన్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇది వ్యయ సామర్థ్యాలు, పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది. తద్వారా దేశంలో మొత్తం సరకు రవాణా వ్యవస్థ సామర్థ్యం మెరుగుపడుతుంది.
*****
(Release ID: 1774855)
Visitor Counter : 130