ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
నేశనల్ అప్రెంటిస్శిప్ ట్రైనింగ్ స్కీము ను రాబోయే అయిదు సంవత్సరాల పాటు కొనసాగించడానికి ఆమోదంతెలిపిన మంత్రిమండలి
నేశనల్ అప్రెంటిస్శిప్ ట్రైనింగ్ స్కీము లో భాగం గా అప్రెంటిస్ శిప్ ట్రైనింగ్ ను పొందే అప్రెంటిస్లకు 3,054 కోట్ల రూపాయల మేరకు విద్యార్థివేతనం (స్టయిపెండ్) రూపం లో సాయాన్నిఅందించడం జరుగుతుంది
పరిశ్రమ, వాణిజ్య సంస్థల ద్వారా రమారమి 9 లక్షల మంది అప్రెంటిస్ లకు శిక్షణ ను ఇవ్వడం జరుగుతుంది
Posted On:
24 NOV 2021 3:23PM by PIB Hyderabad
విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని నేశనల్ అప్రెంటిస్ శిప్ ట్రైనింగ్ స్కీమ్ (ఎన్ఎటిఎస్) లో భాగం గా 2021-22 నుంచి 2025-26 వరకు ( 2026 మార్చి 31 వ తేదీ వరకు) అప్రెంటిస్ శిప్ ట్రైనింగ్ ను పొందే అప్రెంటిస్ లకు 3,054 కోట్ల రూపాయల మేరకు విద్యార్థివేతనం (స్టయిపెండ్) రూపేణా సాయాన్ని అందించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) సమావేశం ఈ రోజు న సమ్మతి ని తెలిపింది.
పరిశ్రమ ద్వారాను, వాణిజ్య సంస్థల ద్వారాను సుమారు గా 9 లక్షల మంది అప్రెంటిస్ లకు శిక్షణ ను ఇ్వవడం జరుగుతుంది. ఎన్ఎటిఎస్ అనేది భారత ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న ఒక ప్రముఖమైన పథకం గా ఉంది. ఈ పథకం అప్రెంటిస్ శిప్ ట్రైనింగ్ ను విజయవంతం గా ముగించిన విద్యార్థుల లో ఉద్యోగ సామర్థ్యాన్ని పెంపొందింప చేయడం లో తోడ్పాటు ను అందించింది.
ఇంజినీరింగ్, మానవ విజ్ఞానశాస్త్రాలు, విజ్ఞానశాస్త్రం, ఇంకా వాణిజ్యం లలో గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా ప్రోగ్రాము ను పూర్తి చేసిన అప్రెంటిస్ లకు క్రమానుగతం గా 9,000 రూపాయలు మరియు 8,000 రూపాయల వంతు న ప్రతి నెల విద్యార్థివేతనాన్ని (స్టయిపెండ్ ను) ఇవ్వడం జరుగుతుంది.
రాబోయే అయిదు సంవత్సరాల కాలం లో 3,000 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు చేయడాని కి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది వెనుకటి అయిదు సంవత్సరాల కాలం లో చేసినటువంటి వ్యయం కంటే దాదాపు గా నాలుగున్నర రెట్లు ఎక్కువ గా ఉంది. అప్రెంటిస్ శిప్ కు సంబంధించినటువంటి ఈ వ్యయం లో పెంపుదల అనేది అప్రెంటిస్ శిప్ కు ‘జాతీయ విద్య విధానం-2020’ లో కట్టబెట్టిన ప్రాధాన్యానికి అనుగుణం గా ఉన్నది.
"సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ - సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’’ అంశం పై ప్రభుత్వం వహిస్తున్న శ్రద్ధ కు తగినట్లు గా ఎన్ఎటిఎస్ తాలూకు పరిధి ని విస్తరించి, ఇంజినీరింగ్ స్ట్రీమ్ తాలూకు విద్యార్థుల కు అదనం గా మానవ విజ్ఞానశాస్త్రాలు, సైన్స్, ఇంకా వాణిజ్యశాస్త్ర విద్యార్థుల ను కూడా కలుపుకోవడానికి గాను ఈ పథకం యొక్క పరిధి ని మరింత గా విస్తరించడం జరిగింది. కౌశలం సంబంధి ఇకో సిస్టమ్ ను పటిష్టపరుస్తూ నైపుణ్యం స్థాయి యొక్క ప్రమాణాల ను పెంచాలనేది ఈ పథకం యొక్క ఉద్దేశ్యం గా ఉంది. తత్ఫలితం గా ఈ స్కీము రాబోయే అయిదు సంవత్సరాల లో సుమారు గా 7 లక్షల మంది యువతీ యువకుల కు ఉపాధి ని కల్పించగలుగుతుంది.
‘ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకం’ (పిఎల్ఐ) లో భాగం గా మొబైల్ మేన్యుఫాక్చరింగ్, చికిత్స ఉపకరణాల తయారీ, ఔషధ నిర్మాణ సంబంధి రంగం, ఎలక్ట్రానిక్స్/సాంకేతిక విజ్ఞాన సంబంధి ఉత్పత్తులు, ఆటోమొబైల్ రంగం వంటి ప్రవర్ధమాన రంగాల లో అప్రెంటిస్ శిప్ ను ఎన్ఎటిఎస్ అందిస్తుంది. ఈ పథకం ‘గతిశక్తి’ లో భాగం గా గుర్తించినటువంటి కనెక్టివిటీ/లాజిస్టిక్స్ పరిశ్రమ రంగాల కోసం నైపుణ్యం కలిగిన మానవ శక్తి ని కూడా తయారు చేస్తుంది.
***
(Release ID: 1774744)
Visitor Counter : 189
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada