కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు ఐఐటీ గౌహతి సందర్శించారు. నానోటెక్నాలజీ అత్యాధునిక కేంద్రం (సీఎన్టీ) సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (సీఐకేఎస్)తోపాటు ఇన్‌స్టిట్యూట్‌లో రెండు హాస్టళ్లను ప్రారంభించారు. ఇన్స్టిట్యూట్‌లో ఎన్ఈపీ 2020 అమలపై ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. అస్సాం విద్యా మంత్రి డాక్టర్ రనోజ్, ఎంపీ క్వీన్ ఓజా కూడా హాజరయ్యారు.
ఐఐటీ గౌహతిలో మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవం
https://t.co/MzOyBx18Hs
– ధర్మేంద్ర ప్రధాన్ (@dpradhanbjp) నవంబర్ 21, 2021
ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ, వివిధ అంతర్జాతీయ, జాతీయ ర్యాంకింగ్ వ్యవస్థల నుంచి అద్భుతమైన ర్యాంకింగ్‌లు సాధించినందుకు ఐఐటీ గౌహతిని అభినందించారు. విద్య, పరిశోధన కోసం పర్యావరణ వ్యవస్థను సృష్టించడంతోపాటు ఈశాన్య ప్రాంతం సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించడానికి ఐఐటీ గౌహతి చేస్తున్న కృషిని అభినందించారు. విపత్తు నిర్వహణ, జీవవైవిధ్య ఆధారిత పరిశోధన, గ్రీన్ ఎనర్జీ డెవలప్‌మెంట్, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం , విద్యార్థుల్లో వ్యవస్థాపకతను పెంపొందించడం వంటి రంగాలలో ఐఐటి గౌహతి ముఖ్యమైన పాత్ర పోషించాలని ఆయన అన్నారు. పరిష్కారాల ఆధారిత ఆవిష్కరణలు, శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి సాంకేతికత జ్ఞానాన్ని సమీకృతం చేయాలని ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులకు, అధ్యాపకులకు కూడా పిలుపునిచ్చారు.
ఇంటర్‌కనెక్టడ్ ప్రపంచంలోని ఈ యుగంలో, ఐఐటీ గౌహతిలోని నానోటెక్నాలజీ కేంద్రం ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగాలలో, బహుళ-క్రమశిక్షణా పరిశోధన, విద్యలో పురోగతి కోసం అనేక సీఓఈలు, ఇంక్యుబేటర్లు అత్యాధునిక పరిశోధనా ప్రయోగశాలలను నిర్వహిస్తుందని ఆయన అన్నారు. ఫలితంగా నానో-బయో-మెటీరియల్స్, మైక్రో/నానో ఎలక్ట్రానిక్స్ , ఎనర్జీలో ఎన్నో ఆవిష్కరణలు సాధ్యమవుతాయని చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2020లో జరిగిన కాన్వొకేషన్ సందర్భంగా మాట్లాడుతూ ఐఐటీ గౌహతిలో సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారని ఆయన అన్నారు. పురాతన & సాంప్రదాయ భారతీయ విజ్ఞానాన్ని సంరక్షించడం, పత్రబద్ధం చేయడం, వీటిని పంచుకోవడం కోసం దీనిని వేగంగా ఏర్పాటు చేశారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
శ్రీమంత్ శంకర్‌దేవ్ గొప్ప పండితుడు అని, నాగరికతకు, మానవత్వానికి కొత్త ఆలోచనను, ఆకృతిని ఇచ్చారని ప్రధాన్ అన్నారు. మహిమాన్వితమైన అహోం సంస్కృతి, శక్తివంతమైన బ్రహ్మపుత్ర, కామాఖ్యమాత ఆశీర్వాదం అసోంకు ఉన్నాయని చెప్పారు. లచిత్ బోర్ఫుకాన్ వంటి గొప్ప వ్యక్తులు ఐఐటీ గౌహతిలో విద్యార్థులకు స్ఫూర్తిని అందించాలని ఆయన అన్నారు.
కోవిడ్-19 సమయంలో, ఇన్నోవేషన్, టెక్నాలజీలు పీపీటీ కిట్‌ల తయారీలో ఐఐటీలు తమకు ఎంతో సహాయం చేశాయని మంత్రి చెప్పారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం, ఉత్పత్తి చేయడంలో తమకు సహాయపడ్డాయని చెప్పారు. ఈ దేశం స్థితిస్థాపకతకు ఐఐటీ–జీ ప్రాతినిధ్యం వహిస్తుందని మంత్రి వివరించారు. ఐఐటీ గౌహతి వంటి సంస్థలు సమాజ హితం కోసం ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. సీఓపీ 26 సమావేశం సందర్భంగా వాతావరణ మార్పులపై పోరాడేందుకు పంచామృత దార్శనికతను ప్రధాని మోదీ వివరించారని ఆయన అన్నారు. ఐఐటీ గౌహతి కీలక పాత్ర పోషించడం ద్వారా మన ఈశాన్య రాష్ట్రాలు గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి కేంద్రంగా మార్చవచ్చని ఆయన తెలిపారు.
అస్సాం విద్యా మంత్రి డాక్టర్ రనోజ్ పెగు మాట్లాడుతూ ఐఐటీ గౌహతి ప్రాజెక్టులను అభినందించారు. వ్యవస్థాపకతపై దృష్టి పెట్టాలని, ఉద్యోగాలను సృష్టించడమేగాక మాత్రమే కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిని ఉత్పత్తి చేయాలని అన్నారు. ఐఐటీ గౌహతి వంటి సంస్థలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కొత్త వ్యవసాయ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఐఐటీ గౌహతి ప్రాంతంలోని ఇతర విద్యా సంస్థలకు మార్గదర్శకత్వం వహించాలని, ఉపాధ్యాయుల శిక్షణ కోసం మాడ్యూల్స్‌ను అభివృద్ధి చేయాలని మంత్రి అభ్యర్థించారు. ఎంపీ క్వీన్ ఓజా మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతంలో ఇటువంటి అధునాతన పరిశోధనా సౌకర్యాలను అందుబాటులోకి రావడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఐఐటీ గౌహతి ఈశాన్య ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని ఆశించారు.
సెంటర్ ఫర్ నానోటెక్నాలజీ (సీఎన్టీ) భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడం నానోటెక్నాలజీ అభివృద్ధి కోసం పరిశ్రమతో విద్యా భాగస్వామ్యాన్ని పెంపొందించడాన్ని ఐఐటీ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రానికి ప్రధాన నిధులు, ఈ సెంటర్ భవనం కోసం విద్య మంత్రిత్వ శాఖ (ఎంఓఈ) భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (మైటీ) నుండి రూ.37 కోట్లు అందుకుంది. మల్టీ-డిసిప్లినరీ, సైంటిఫిక్ ట్రాన్స్‌లేషన్ రీసెర్చ్‌లో పురోగతిపై దృష్టి సారించే 25 అధునాతన లేబొరేటరీలను ఇది నిర్వహిస్తుంది. అత్యాధునిక ఫాబ్రికేషన్, క్యారెక్టరైజేషన్ టెస్టింగ్ లేబొరేటరీలతో అనుసంధామై ఉండే క్లాస్-100 క్లీన్ రూమ్ సౌకర్యాలను ఏర్పాటు చేసింది. సీఎన్టీ ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మైటీ) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) స్పాన్సర్ చేసిన రెండు సెంటర్స్ ఫర్-ఎక్సలెన్స్‌తో పాటు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిరాక్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ స్పాన్సర్ చేసి ఇంక్యుబేటర్ బయోనెస్ట్‌ను నిర్వహిస్తోంది. కేంద్రం ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయానికి సీఎన్టీ ఒక మంచి ఉదాహరణ. సెంటర్ ఫర్ నానోటెక్నాలజీ నుండి ఆశించిన కీలక ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిలో నానో-ఎనేబుల్డ్ హెల్త్‌కేర్, ఎనర్జీ హార్వెస్టింగ్ ఎల్ఈడీ ప్రోటోటైప్, పరికరాలు, సాంకేతికత, స్టార్ట్-అప్/ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్, హై-ఎండ్ ఆర్ అండ్ డీ అవుట్‌పుట్‌లు, నానో ఫ్యాబ్రికేషన్, నానోఎలక్ట్రానిక్స్ రంగంలో అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరుల సామర్థ్యం పెంపుదల ముఖ్యమైనవి.
సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (సీఐకేఎస్) భారతదేశానికే ప్రత్యేకమైన జ్ఞానాన్ని సంరక్షించడం, డాక్యుమెంట్ చేయడం కొనసాగించడంపై దృష్టి పెడుతుంది. భారతీయ శాస్త్రీయ సంగీతం, యోగా, సంస్కృతం, సాంప్రదాయ ఔషధాలు, ఆలయ నిర్మాణం, సిరామిక్ సంప్రదాయం, ఈశాన్య భారతదేశంలోని ప్రత్యేక వ్యవసాయ పద్ధతులు, ఆరోగ్య ఆహారంగా ఈశాన్యప్రాంత మూలికలు, అస్సాం లోహపు నైపుణ్యం వంటి వాటిపై ఇది దృష్టి పెడుతుంది. కొత్త సీఐకేఎస్ ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లలో పాల్గొనడానికి విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన నిపుణులను ప్రోత్సహిస్తుంది. ఫలితంగా స్థిరమైన వృద్ధి, అభివృద్ధి కోసం వివిధ రంగాలలో అభ్యాసాలను, సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు వీలు కలుగుతుంది.
ఐఐటీ గౌహతిలోని దిసాంగ్ హాస్టల్ ప్రస్తుత కెపాసిటీకి మరో 1000 గదులను చేర్చింది. డిఖో హాస్టల్ క్యాంపస్‌లో ప్రత్యేకంగా ప్రాజెక్ట్ సిబ్బంది వసతి కోసం మొదటి హాస్టలును మొత్తం రూ.కోటితో నిర్మించారు. మొత్తం నిర్మాణవ్యయం రూ. 132 కోట్లు. ఈ హాస్టళ్లు ఐఐటీ గౌహతి సామర్థ్యాన్ని పెంచడంలో మరింత సహాయపడతాయి. ఐఐటీ, గౌహతి డైరెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి ఇతర కార్యక్రమాల ద్వారా, ఇన్‌స్టిట్యూట్ చురుగ్గా అత్యున్నత స్థాయి పరిశోధనలను కొనసాగిస్తోందని ఈ ప్రాంతం ఆకాంక్షలను నెరవేరుస్తూనే “ఆత్మనిర్భర్ భారత్” దృక్పథానికి కృషి చేస్తోందని అన్నారు. ,జాతీయ విధానాలకు అనుగుణంగా, ముఖ్యంగా ఎన్ఈపీ 2020ని అమలు చేస్తూ పరిశోధన, సాంకేతికత అభివృద్ధిలో ప్రపంచస్థాయి సంస్థలతో పోటీపడుతుందని వివరించారు.
***