నీతి ఆయోగ్
ఎస్.డి.జి. పట్టణ ప్రారంభ సూచిక, డ్యాష్ బోర్డు ఆవిష్కరణ!
ఇండో జర్మన్ సహకారంతో ప్రారంభించిన నీతీ ఆయోగ్
అభివృద్ధి సూచికలో అగ్రస్థానం సిమ్లాకు..
తర్వాతి స్థానాల్లో కోయంబత్తూరు, చండీగఢ్.
Posted On:
23 NOV 2021 3:07PM by PIB Hyderabad
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు (ఎస్.డి.జి.కి) సంబంధించిన 2021-22వ సంవత్సరపు
ప్రారంభ సూచికను, డ్యాష్ బోర్డును నీతీ ఆయోగ్ ఈ రోజు ప్రారంభించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు స్థానికతను జోడించడంలో, జాతీయ స్థాయిలోను, వివిధ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిలోను ఎస్.డి.జి. ప్రగతిపై పర్యవేక్షక వ్యవస్థను ఏర్పాటు చేయడంలో నీతీ ఆయోగ్ దీనితో మరో మైలురాయిని చేరుకుంది. ఈ సూచిక, డ్యాష్ బోర్డు అనేవి, నీతీ ఆయోగ్-జి.ఐ.జి, బి.ఎం.జి. సహకారంతో సాధించిన ఫలితాలు. ఇండో జర్మన్ అభివృద్ధి సహకార సంస్థ పరిధిలో మన నగరాల స్థానికతను సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు జోడించేందుకే ప్రాధాన్యమిస్తూ నీతీ ఆయోగ్-జి.ఐ.జి., బి.ఎం.జి. పరస్పర సహకారంతో ఉమ్మడిగా పనిచేశాయి.
దేశంలోని 56 పట్టణ, నగర ప్రాంతాలకు సంబంధించిన ర్యాంకులను ఎస్.డి.జి. పట్టణ సూచిక, డ్యాష్ బోర్డులు నిర్ధారించాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వ్యవస్థకు సంబంధించిన 46 అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ 77 ఎస్.డి.జి. సూచికల ప్రకారం ఈ ర్యాంకులను నిర్ణయించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్.). జాతీయ నేర పరిశోధనా రికార్డుల బోర్డు (ఎన్.సి.ఆర్.బి.), పాఠశాలల సమాచారానికి సంబంధించిన య-డైస్ సమాచార వ్యవస్థ, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వానికి చెందిన ఇతర పోర్టళ్లు, ఇతర సమాచార వనరులనుంచి సేకరించిన డేటా ప్రాతిపదికగా ఈ సూచికలను రూపొందించారు.
నీతీ ఆయోగ్ ఆవిష్కరించిన సూచికవల్ల, డ్యాష్ బోర్డు సహాయంతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు స్థానికతను జోడించే ప్రక్రియను బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై నగర స్థాయిలో పటిష్టమైన పర్యవేక్షణను ఏర్పాటు చేయడానికి వీలు కలుగుతుంది. ఇది పట్టణ స్థానిక పరిపాలనా సంస్థల సమాచారంలో బలాన్ని, అంతరాలను ప్రస్పుటంగా తెలియజేయడంతోపాటుగా, పర్యవేక్షక వ్యవస్థను, రిపోర్టింగ్ విధానాన్ని కూడా క్రమబద్ధం చేస్తుంది. ఈ సూచిక, డ్యాష్ బోర్డుల వంటి ఉపకరణాల ద్వారా భాగస్వామ్య వర్గాలవారంతా పూర్తి సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుంది. భారతదేశం అభివృద్ధిలో మన నగరాలు, పట్టణ ప్రాంతాల ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో వ్యవస్థలో ఎంతో పరివర్తనతో కూడిన ఇలాంటి మార్పులు చాలా అవసరం.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికను, డ్యాష్ బోర్డును నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్, జర్మనీ ప్రభుత్వానికి చెందిన బి.ఎం.జి. సంస్థ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ డాక్టర్ క్లాడియా వార్నింగ్ లాంఛనంగా ఆవిష్కరించారు. బి.ఎం.జి. దక్షిణాసియా డివిజన్ అధిపతి ఫిలిప్ క్నిల్, జి.ఐ.జి. ఇండియా కంట్రీ డైరెక్టర్ డాక్టర్ జూలీ రెవీరే, జి.ఐ.జి. ఇండియా స్మార్ట్ సిటీస్ ఎస్.డి.జి. విభాగం అధిపతి జార్జి జాన్.సేన్, నీతీ ఆయోగ్.లో ఎస్.డి.జి. వ్యవహారాల సలహాదారు కుమారి సంయుక్తా సమద్దర్, ఇంకా ఉభయ సంస్థల సీనియర్ అధికారుల సమక్షంలో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, నగరాలు అతివేగంగా ప్రగతి ఛోదకంగా మారుతున్నాయని అన్నారు. “నీతీ ఆయోగ్, జి.ఐ.జి. మధ్య సృజనాత్మక భాగస్వామ్యం కారణంగా రూపుదాల్చిన ఎస్.డి.జి. పట్టణ సూచిక, డ్యాష్ బోర్డులు,.. మన నగరాల్లో ఎస్.డి.జి. పర్యవేక్షక వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఎంతో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు స్థానికతను జోడించే మన ప్రయత్నంలో ఇది చెప్పుకోదగిన మలుపుగానే భావించాలి.” అని ఆయన అన్నారు.
సుస్థిర అభివృద్ధిపై 2030వ సంవత్సరపు అజెండా సాధించే దిశగా ఇంకా మూడువంతుల ప్రయాణం మనం సాగించవలసి ఉన్న నేపథ్యంలో, పట్టణ ప్రాంతాల్లో ఎస్.డి.జి.ని లెక్కగట్టడం చాలా కీలకం అవుతుంది. ఈ సందర్భంగా ఎస్.డి.జి. నోడల్ అధికారి హోదాలో సంయుక్త సమద్దర్ మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిర్ణయం తీసుకునే కీలకమైన ప్రక్రియలో స్థానిక పరిపాలనా యంత్రాగానికి తగిన అధికారాలు కల్పించవలసిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. “సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు స్థానికతను జోడించడంలో ఎస్.డి.జి. పట్టణ సూచిక అనేది మరో ముందడుగు” అని ఆమె అన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల విషయంలో ఇండియా, జర్మనీ భాగస్వామ్యంపై బి.ఎం.జి. సంస్థ డైరెక్టర్ జనరల్ ప్రొపెసర్ డాక్టర్ క్లాడియా వార్నింగ్ మాట్లాడుతూ, “ఎస్.డి.జి.లను స్థానిక అవసరాలకు, పర్యవేక్షణకు తగినట్టుగా మార్పు చేసుకోవడంపై దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంది. అలాగే,..జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సమాచార వ్యవస్థలో అంతరాలను తొలగించుకోవలసిన అవసరం ఉంది. ఎస్.డి.జి.లపై సామర్థ్యాల నిర్మాణం లక్ష్యంగా నీతీ ఆయోగ్ సంస్థతో భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకునేందుకు మేం వేచి చూస్తున్నాం.” అని అన్నారు.
పద్ధతి
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పట్టణ సూచికను ప్రపంచ దేశాలకు ఆమోదయోగ్యమైన పద్ధతిలో రూపొందించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పరిష్కార వ్యవస్థ (ఎస్.డి.ఎస్.ఎన్.) ఈ పద్ధతికి రూపకల్పన చేసింది. ఎస్.డి.జి. ఇండియా సూచికతో పాటుగా, ఈశాన్య ప్రాతపు జిల్లాల ఎస్.డి.జి. సూచికను కూడా ఖరారు చేశారు. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖతో సునిశిత చర్చల అనంతరం ఈ సూచిక ఖరారైంది. 15 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లోని 46 ప్రపంచ స్థాయి అంశాలకు వర్తింపజేస్తూ సమగ్రమైన 77 సూచికలను ఈ కొత్త సూచిక రూపకల్పనలో వినియోగించారు. నీటి అంతర్భాగంలో జీవుల మనుగడ అనే 14వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని ఈ జాబితాలో చేర్చలేదు. ఎందుకంటే ఈ లక్ష్యం కేవలం సముద్ర తీర ప్రాంతాలకు మాత్రమే, అంటే, కేవలం కొన్ని కొన్ని తీరప్రాంతపు నగరాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇక 17వ ఎస్.డి.జి. (లక్ష్యాలకోసం భాగస్వామ్యాలు)ని కూడా జాబితానుంచి మినహాయించారు. ఎందుకంటే, ఈ లక్ష్యాల ప్రగతిని జాతీయ స్థాయిలో పర్యవేక్షిస్తారు. భూమిపై జీవులకు సంబంధించిన 15వ ఎస్.డి.జి.ని రెండు సూచికలను వినియోగించడం ద్వారా లెక్కగట్టారు. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖకు సంబంధించిన జాతీయ సూచికా వ్యవస్థతో ఈ సూచికలను విలీనం చేశారు.
సూచికలో 56 పట్టణ ప్రాంతాలకు ర్యాంకులు కేటాయించగా, వాటిలో 44 ప్రాంతాల్లో పదిలక్షల మందికి మించిన జనాభా ఉంది. 12 ప్రాంతాలు మాత్రం పదిలక్షలకంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల రాజధాని నగరాలు. కొన్ని సూచికల ప్రకారం పట్టణ ప్రాంతాలు అంటే పట్టణ స్థానిక పరిపాలనా సంస్థల పరిధిలోని ప్రాంతాలు. కొన్ని సందర్భాల్లో సంబంధిత జిల్లాలోని పట్టణ ప్రాంతాలన్నింటికీ ఉమ్మడిగా ఈ పదం వర్తిస్తుంది. విభిన్నమైన పట్టణ పరిపాలనా విభాగాల స్థాయిల్లో అందుబాటులో ఉన్న విభిన్నమైన సమాచారాన్ని వినియోగించడంతో వచ్చిన వ్యత్యాసమిది. అయితే,..సూచిక ఏదైనా సరే, అన్ని పట్టణ ప్రాంతాల విషయంలోనూ ఒకే నిర్వచనాన్ని వినియోగించారు.
ప్రతి సుస్థిర అభివృద్ధి లక్ష్యానికి సంబంధించి అభివృద్ధి ప్రాతిపదికగా వివిధ పట్టణ ప్రాంతాలకు 0 నుంచి100 వరకూ ర్యాంకులను కేటాయించారు. వంద ర్యాంకు అంటే, సంబంధిత పట్టణ ప్రాంతం 2030వ సంవత్సరపు అభివృద్ధి లక్ష్యాలన్నింటినీ సాధించినట్టే లెక్క. ర్యాంకు స్కోరు సున్నా (0) అయితే, ఎంపిక చేసిన పట్టణాలు, అవి సాధించాల్సిన లక్ష్యాలకు ఎంతో దూరంలో ఉన్నట్టు పరిగణిస్తారు. మొత్తమ్మీద అభివృద్ధి లక్ష్యాలపై పట్టణ ప్రాంతాల ఉమ్మడి స్కోరును లక్ష్యాలవారీగా తెక్కగడతారు. సంబంధిత పట్టణ ప్రాంతం సాధించిన సగటు ఫలితాలను ఈ పద్ధతిలో లెక్కిస్తారు.
పట్టణ ప్రాంతాలను అవి సాధించిన ఉమ్మడి స్కోరు ప్రాతిపదికగా ఈ కింది విధంగా వర్గీకరించారు:
- ఆశావహం: 0–49
- ఫలితాల సాధన దిశగా పనితీరు: 50–64
- అగ్రశ్రేణి: 65–99
- పూర్తి విజయం సాధన: 100
ఈ కింది 56 పట్ణణ ప్రాంతాలపై మధింపును నిర్వహించగా,..44 ప్రాంతాల్లో పదిలక్షల మందికి మించి జనాభా ఉంది. 12 ప్రాంతాలేమో పదిలక్షల జనాభాకంటే తక్కువ ఉన్న వివిధ రాష్ట్రాల రాజధానులు:
అగర్తలా
|
గ్వాలియర్
|
నాసిగ్
|
ఆగ్రా
|
హైదరాబాద్
|
పణజి
|
అహ్మదాబాద్
|
ఇంఫాల్
|
పాట్నా
|
ఐజ్వాల్
|
ఇండోర్
|
ప్రయాగ్ రాజ్
|
అమృత్సర్
|
ఇటానగర్
|
పుణె
|
ఔరంగాబాద్
|
జబల్పూర్
|
రాయ్.పూర్
|
బెంగుళూరు
|
జైపూర్
|
రాజ్.కోట్
|
భోపాల్
|
జోధ్.పూర్
|
రాంఛీ
|
భువనేశ్వర్
|
కాన్పూర్
|
షిల్లాంగ్
|
చండీగఢ్
|
కొచ్చి
|
సిమ్లా
|
చెన్నై
|
కోహిమా
|
శ్రీనగర్
|
కోయంబత్తూరు
|
కోల్కతా
|
సూరత్
|
డెహ్రాడూన్
|
కోట
|
తిరుచిరాపల్లి
|
ఢిల్లీ
|
లక్నో
|
తిరువనంతపురం
|
ధన్.బాద్
|
లూధియానా
|
వడోదర
|
ఫరీదాబాద్
|
మదురై
|
వారణాసి
|
గ్యాంగ్టక్
|
మీరట్
|
విజయవాడ
|
ఘజియాబాద్
|
ముంబై
|
విశాఖపట్నం
|
గువాహటిi
|
నాగపూర్
|
|
ఫలితాలు
10 అగ్రశ్రేణి పట్టణ ప్రాంతాలు
పట్టణ ప్రాంతం
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
ఉమ్మడి స్కోరు
|
సిమ్లా
|
హిమాచల్ ప్రదేశ్
|
75.50
|
కోయంబత్తూరు
|
తమిళనాడు
|
73.29
|
చండీగఢ్
|
చండీగఢ్
|
72.36
|
తిరువనంతపురం
|
కేరళ
|
72.36
|
కొచ్చి
|
కేరళ
|
72.29
|
పణజి
|
గోవా
|
71.86
|
పుణె
|
మహారాష్ట్ర
|
71.21
|
తిరుచిరాపల్లి
|
తమిళనాడు
|
70.00
|
అహ్మదాబాద్
|
గుజరాత్
|
69.79
|
నాగపూర్
|
మహారాష్ట్ర
|
69.79
|
దిగువ శ్రేణిలోని 10 పట్టణ ప్రాంతాలు
పట్టణ ప్రాంతం
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
ఉమ్మడి స్కోరు
|
ఫరీదాబాద్
|
హర్యానా
|
58.57
|
కోల్కతా
|
పశ్చిమ బెంగాల్
|
58.5
|
ఆగ్రా
|
ఉత్తరప్రదేశ్
|
58.21
|
కోహిమా
|
నాగాలాండ్
|
58.07
|
జోధ్.పూర్
|
రాజస్థాన్
|
58
|
పాట్నా
|
బీహార్
|
57.29
|
గువాహటి
|
అస్సాం
|
55.79
|
ఇటానగర్
|
అరుణాచల్ ప్రదేశ్
|
55.29
|
మీరట్
|
ఉత్తరప్రదేశ్
|
54.64
|
ధన్.బాద్
|
జార్ఖండ్
|
52.43
|
మంచి ఫలితాలు చూపించిన పట్టణ ప్రాంతాలు.. లక్ష్యాలవారీగా...
మంచి ఫలతాల కేటగిరీలోని పట్టణ ప్రాంతాల శాతం
పట్టణ ప్రాంతాల ఉమ్మడి ఫలితాల తీరు (భౌగోళికపరంగా పంపిణీ)
2021-22వ సంవత్సరపు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పట్టణ సూచిక స్నాప్ షాట్
ఇంటరాక్టివ్ డ్యాష్ బోర్డును ఈ లింకు ద్వారా చూడవచ్చు: http://sdgindiaindex.niti.gov.in/urban
డ్యాష్ బోర్డు కోసం ఈ Q.R. కోడ్.ను స్కాన్ చేయండి
****
(Release ID: 1774372)
Visitor Counter : 276