నీతి ఆయోగ్
కలిసి పనిచేయనున్న అటల్ టింకరింగ్ ల్యాబ్స్ మరియు ఎంగేజ్ విత్ సైన్స్
ప్రకటించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు విజ్ఞాన్ ప్రసార్
Posted On:
23 NOV 2021 9:35AM by PIB Hyderabad
పరస్పర సహకారంతో కలిసి పనిచేయాలని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ మరియు ఎంగేజ్ విత్ సైన్స్ నిర్ణయించాయి. నీతి ఆయోగ్ ప్రాధాన్యతా కార్యక్రమంగా అమలు చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పనిచేస్తున్నాయి . శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలో స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా పనిచేస్తున్న విజ్ఞాన్ ప్రసార్ ఆధ్వర్యంలో ఎంగేజ్ విత్ సైన్స్ పనిచేస్తోంది. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తో ఎంగేజ్ విత్ సైన్స్ కుదుర్చుకున్న అవగాహనను అటల్ ఇన్నోవేషన్ మిషన్ సోమవారం ప్రకటించింది.
ఈ ఒప్పందం ప్రకారం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సౌకర్యం కలిగి ఉన్న 9200 కి పైగా పాఠశాలలు ఇకపై ఎంగేజ్ విత్ సైన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులకు ఎంగేజ్ విత్ సైన్స్ కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తుంది. గణితం, సాంకేతిక, ఇంజనీరింగ్, శాస్త్ర(స్టెమ్) అంశాలపై ఈ కార్యక్రమాలు అమలు జరుగుతాయి. కార్యక్రమాలు అమలులో చూపే ప్రతిభ ఆధారంగా మార్కులు ఇచ్చి సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుంది.
మారుతున్న అవసరాలకు అనుగుణంగా పది లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ 9200 పైగా పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ను నెలకొల్పింది. యువతలో ఉత్సుకత, సృజనాత్మకత మరియు ఊహాశక్తిని పెంపొందించడం, డిజైన్ మైండ్‌సెట్, కంప్యూటేషనల్ థింకింగ్, అడాప్టివ్ లెర్నింగ్, ఫిజికల్ కంప్యూటింగ్ మొదలైన రంగాల్లో నైపుణ్యాలు ఏకకాలంలో పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం అమలు జరుగుతోంది.
పనిచేసే స్థలంగా ఉండే అటల్ టింకరింగ్ ల్యాబ్యు లో వకులు తమ ఆలోచనలకు కార్యరూపం ఇస్తూ తమంతట తాము పని చేయడానికి అవసరమైన వాతావరణం ఉంటుంది. గణితం, సాంకేతిక, ఇంజనీరింగ్, శాస్త్ర(స్టెమ్) అంశాలను అర్థం చేసుకోవడానికి అవసరమైన సాధనాలు మరియు పరికరాలతో పని చేసే అవకాశాన్ని విద్యార్థులు పొందుతారు.
అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఎంగేజ్ విత్ సైన్స్ ల మధ్య కుదిరిన అవగాహన పట్ల అటల్ ఇన్నోవేషన్ మిషన్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఎంగేజ్ విత్ సైన్స్ ల మధ్య కుదిరిన అవగాహన వల్ల రెండు సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. విద్యా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాలను రూపొందించడానికి ఈ అవగాహన దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. గణితం, సాంకేతిక, ఇంజనీరింగ్, శాస్త్ర రంగంలో ఆవిష్కరణలు, వినూత్న అంశాలపై యువత దృష్టి సారించడానికి అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
సాంకేతిక పురోగతి. ఆవిష్కరణల సంస్కృతి పెంపొందించడంలో సమస్య-పరిష్కారంపై దృష్టి సారించి యువతకు అనుభవపూర్వక అభ్యాసం అందుబాటులోకి వస్తుందని డాక్టర్ చింతన్ వైష్ణవ్ అన్నారు.
ఇండియా సైన్స్ ఓటీటీ ఛానెల్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎంగేజ్ విత్ సైన్స్ కార్యక్రమం అమలు జరుగుతోంది. దేశ ఓటీటీ ఛానల్ అయిన ఇండియా సైన్స్ ( www.indiascience.in )లో గణితం, సాంకేతిక, ఇంజనీరింగ్, శాస్త్ర అంశాలకు చెందిన వీడియోలను ప్రసారం చేసి ఈ అంశాలకు ప్రాచుర్యం కల్పించాలన్న లక్ష్యంతో ఎంగేజ్ విత్ సైన్స్ పనిచేస్తోంది. ఎంగేజ్ విత్ సైన్స్ తో కలిసి ఇప్పటికే దేశంలో 10,000 పైగా పాఠశాలలు పనిచేస్తున్నాయి. విద్యార్థులు, అధ్యాపకులు, ప్రధాన అధ్యాపకులకు సంబంధించిన కార్యక్రమాలను ఎంగేజ్ విత్ సైన్స్ ప్రసారం చేస్తోంది. ఎంగేజ్ విత్ సైన్స్ కార్యక్రమాలు ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఇతర భారతీయ భాషల్లో కూడా కార్యక్రమాలను ప్రసారం చేసే అంశాన్ని ఎంగేజ్ విత్ సైన్స్ పరిశీలిస్తోంది.
ఈ సందర్భంగా మాట్లాడిన విజ్ఞాన్ ప్రసార్ డైరెక్టర్ డాక్టర్ నకుల్ పరాశర్ గణితం, సాంకేతిక, ఇంజనీరింగ్, శాస్త్ర అంశాలను అభ్యసిస్తున్న వారి మధ్య తరచు సమావేశాలు జరగాల్సి ఉంటుందని అన్నారు. ఇండియా సైన్స్ఓటీటీ దీనిని అందుబాటులోకి తెస్తుందని అన్నారు. భారతదేశపు మొట్టమొదటి ఇంటరాక్టివ్ ఓటీటీ ఛానెల్‌ని అందుబాటులోకి తీసుకుని రావడానికి విజ్ఞాన్ ప్రసార్ సిద్ధంగా ఉందని అన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌తో కుదిరిన సహకారం గణితం, సాంకేతిక, ఇంజనీరింగ్, శాస్త్ర అంశాల వినియోగం మరియు ఇంటరాక్టివిటీ అంశాలపై పాఠశాలలకు ప్రయోజనం కలిగిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమానికి ఎంగేజ్ విత్ సైన్స్ బ్రాండ్ అంబాసిడర్ శ్రీ శర్మాన్ జోషి, కూడా హాజరయ్యారు.
(Release ID: 1774217)
Visitor Counter : 201