మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గువహటిలో ఈశాన్య రాష్ట్రాల ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్‌ ని ప్రారంభించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


భారత్ లో స్థానిక భాష ఆధారిత విద్యకు అస్సాం ఒక ప్రయోగశాల వంటిది: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

మన వైవిధ్యాన్ని ఎన్ఈపి ఏకీకృతం చేసింది : ధర్మేంద్ర ప్రధాన్

నాడు పోస్టు చేయడమైనది: 20 NOV 2021 4:44PM by PIB Hyderabad

అస్సాం విద్యా శాఖ, శంకర్‌దేవ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎస్ఈఆర్ఎఫ్) ఆధ్వర్యంలో  గువహటి లోని గౌహతి మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ ఆడిటోరియంలో ఈశాన్య విద్యా సమ్మేళనాన్ని అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మతో కలిసి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. భారతదేశంలో విద్యారంగం అపూర్వమైన పరివర్తనను సంతరించుకుంటోందని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం 2020 యువతను భవిష్యత్తుకు సిద్ధంగా, సామాజిక అవగాహనతో, 21వ శతాబ్దపు ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అమలవుతోందని కేంద్ర మంత్రి అన్నారు. 

దేశంలోనే మొట్టమొదటి ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్‌ను నిర్వహించడానికి రాష్ట్ర విద్యా శాఖ మరియు శంకర్‌దేవ్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ ఫౌండేషన్ (ఎస్ఈఆర్ఎఫ్) చొరవ చూపినందుకు కేంద్ర విద్యా మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఎన్ఈపి 2020 అనేది దేశంలోని విద్యా రంగాన్ని మార్చడానికి ఒక దార్శనిక విధానం అని,  భారతదేశ విద్యారంగంలో ఒక నమూనా మార్పుకు నాంది పలుకుతోందని అన్నారు. ఎన్ఈపి దార్శనికతను వివరిస్తూ, ఎన్ఈపి కోరుకున్న అభ్యాస సామర్థ్యాలను పెంపొందించడం, 21వ శతాబ్దపు విజ్ఞానం మరియు నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడం మరియు మన యువతను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించిందని ఆయన అన్నారు.

నార్త్ ఈస్ట్ ఎడ్యుకేషన్  కాన్‌క్లేవ్‌, ఎన్ఈపి -2020 వివిధ అంశాలపై చర్చించడం లక్ష్యంగా పెట్టుకుంది, ఇది ఈశాన్య ప్రాంతం కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంలో మరియు దానిని విజయవంతంగా అమలు చేయడానికి వ్యూహాలను రూపొందించడంలో సహాయపడుతుంది.

ఈశాన్య ప్రాంతంలోని 180 భాషలు మాట్లాడే గిరిజనుల కంటే భాషల వైవిధ్యాన్ని మెరుగ్గా చూడలేమని ఆయన అన్నారు. ఎన్ఈపి -2020 మాతృభాష మరియు స్థానిక భాషలలో విద్యను అందించడంపై ఉద్ఘాటించింది. రాష్ట్రంలో భాషా వైవిధ్యం గురించి మాట్లాడుతూ, భారతదేశంలో స్థానిక భాషా ఆధారిత విద్యకు అస్సాం ప్రయోగశాలగా మారుతుందని అన్నారు.

అస్సాం విద్యా మంత్రి, డాక్టర్ రనోజ్ పెగు, సిఎస్ఎస్ విశ్వవిద్యాలయం, మీరట్, ఉపకులపతి ప్రొఫెసర్ నరేంద్ర కుమార్ తనేజా, , యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ డీ.పి.సింగ్, ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల విద్యా మంత్రులు, అస్సాం విద్యా సలహాదారు ప్రొఫెసర్ నాని కోపాల్ మహంత, విద్యావేత్తలు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

...…


(రిలీజ్ ఐడి: 1773742) సందర్శకుల సూచీ సంఖ్య : : 145
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri