ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

115.79 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 51.59 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

98.29 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 10,302 కొత్త కేసులు నమోదు

క్రియాశీల కేసుల సంఖ్య 1,24,868

వారపు పాజిటివిటీ రేటు ( 0.93 శాతం ) గత 57 రోజులుగా 2 శాతం కంటే తక్కువ

Posted On: 20 NOV 2021 9:39AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 51,59,931 డోసులతో కలిపి, 115.79 కోట్ల డోసులను ( 1,15,79,69,274 ) టీకా కార్యక్రమం అధిగమించింది. 1,19,13,371 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,82,038

రెండో డోసు

93,89,728

 

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,75,620

రెండో డోసు

1,62,86,345

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

44,03,91,026

రెండో డోసు

18,67,51,559

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

18,01,84,542

రెండో డోసు

10,97,56,295

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

11,28,73,841

రెండో డోసు

7,35,78,280

మొత్తం

1,15,79,69,274

 

గత 24 గంటల్లో 11,787 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,38,97,921 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.29 శాతానికి చేరింది.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 146వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 10,302 కొత్త కేసులు నమోదయ్యాయి.

క్రియాశీల కేసులు 2 లక్షల కంటే తక్కువగా, 1,24,868 వద్ద ఉన్నాయి. పాజిటివ్ కేసుల శాతం కూడా (0.36) 2020 మార్చి నుంచి కనిష్ట స్థాయి.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 10,72,863 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 63.05 కోట్లకు పైగా ( 63,05,75,279 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.93 శాతంగా ఉంది. గత 57 రోజులుగా 2 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.96 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 47 రోజులుగా 2 శాతం కంటే తక్కువగా, 82 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

 

 

****


(Release ID: 1773437) Visitor Counter : 147