ఆర్థిక మంత్రిత్వ శాఖ
40వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో కస్టమ్స్, జీఎస్టీ పెవిలియన్ ను ప్రారంభించిన సిబిఐసి చైర్మన్
प्रविष्टि तिथि:
15 NOV 2021 8:11PM by PIB Hyderabad
న్యూ ఢిల్లీ ప్రగతి మైదాన్ లో హాల్ నెంబర్ 12లో కస్టమ్స్, జిఎస్టీ పెవిలియన్ ను సిబిఐసి చైర్మన్ శ్రీ ఎం. అజిత్ కుమార్ ఈరోజు ప్రారంభించారు.40 వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో కస్టమ్స్, జిఎస్టీ పెవిలియన్ ను సిబిఐసి ఏర్పాటు చేసింది. కస్టమ్స్, జిఎస్టీ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించి, పాటించవలసిన నిబంధనలను వివరించి, శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలియజేయడానికి 2012 నుంచి అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనల్లో సిబిఐసి పెవిలియన్ ను ఏర్పాటు చేస్తోంది.
ఆత్మ నిర్భర్ భారత్ సాధన కోసం సాగుతున్న ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తూ శాఖ కార్యక్రమాలను రూపొందించి పెవిలియన్ లో ప్రదర్శనలను నిర్వహించడం జరుగుతుంది. ' మేక్ ఇన్ ఇండియా ' కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్న ఉత్పత్తి తో ముడి పెట్టిన ప్రోత్సాహకాల పథకం, గిడ్డంగుల రంగంలో ఉత్పత్తి లాంటి కార్యక్రమాలకు ఇస్తున్న ప్రోత్సాహం, రాయితీ రేట్లపై వస్తువులను దిగుమతి చేసుకోవడానికి అమలు చేస్తున్న నిబంధనలు లాంటి అంశాలపై కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కస్టమ్స్, జిఎస్టీ రంగాలలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ఈ కామర్స్, కస్టమ్స్ లో ప్రవేశ పెట్టిన సులభతర విధానాలు లాంటి అంశాలపై ప్రదర్శనలను ఏర్పాటు చేసి సమావేశాలను నిర్వహించడానికి సిబిఐసి ప్రణాళిక రూపొందించింది. ఇన్వెస్ట్ ఇండియా, సీఐఐ, ఈఐసిఐ, ఎఫ్ఐఈఓ లాంటి పారిశ్రామిక సంస్థలు కార్యక్రమాల నిర్వహణలో సిబిఐసికి సహకరిస్తున్నాయి.
పెవిలియన్ లో జిఎస్టీ, కస్టమ్స్, జిఎస్టీఎన్, ఏఈఓ పథకం పై వివరాలను అందించడానికి ఆరు హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో పన్ను చెల్లింపుదారులు, సందర్శకుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను చూపడానికి సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటారు. క్విజ్ పోటీలు, నాటికలు, చర్చలను నిర్వహించి పన్నుల విధానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. శాఖలో పనిచేస్తూ జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన క్రీడాకారులను కలుసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.
కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ కస్టమ్స్, జిఎస్టీ పెవిలియన్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
***
(रिलीज़ आईडी: 1772164)
आगंतुक पटल : 220