ఆయుష్

ఆయుర్వేద ఆధారిత నూతన ఆహార ఉత్పత్తుల కోసం ట్రేడ్ ఫెయిర్

ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో–2021లో స్టాల్‌ను ఏర్పాటు చేయనున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ

Posted On: 13 NOV 2021 6:27PM by PIB Hyderabad

ఈ సంవత్సరం ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో హాల్నంబర్ 10లోని ఆయుశ్ మంత్రిత్వశాఖ యొక్క స్టాల్ ప్రధాన ఆకర్షణగా నిలువబోతోంది. మధుమేహం, స్థూలకాయం, దీర్ఘకాలిక నొప్పులు మరియు రక్తహీనతతో ఇబ్బంది రోగులకు అవసరమైన ఆహార మద్దతును అందించడానికి వండటానికి సిద్ధంగా ఉన్న(రెడీ టు కుక్) న్యూట్రాస్యూటికల్ ఆధారిత వస్తువులతో కూడిన  సెట్ను స్టాల్లో అందుబాటులో ఉంచబోతున్నారు.  
న్యూట్రాస్యూటికల్స్ ఎక్కువగా ఆహార వనరుల నుండి తీసుకోబడిన ఉత్పత్తులు.  వాటిలో కనిపించే ప్రాథమిక పోషక విలువలతో పాటు అదనపు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. పౌడర్ రూపంలో ప్యాక్ చేయబడిన ఈ వంటకాలను.. సంస్థ యొక్క ప్రతిపాదిత ఫుడ్ స్టార్టప్ అయిన మహాభైషజ్య ఆధ్వర్యంలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) పరిశోధనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఏఐఐఏ అనేది ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక పరిశోధనా సంస్థ.

“ఔషధాలతో పాటు మనం ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మన ప్రాచీన గ్రంథాలలో కూడా అలాంటి వంటకాలు ఉన్నాయి” అని ఈ సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఈ రెడీ టు కుక్ సెట్లో  క్యాండీ, ఎపిటైజర్, పిండి, లడ్డు తదితర వస్తువులున్నాయి.  వంటను తయారుచేసుకునే విధానంతోపాటు ఆ ఆహార పదార్థాల  వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్యాకెట్పై ముద్రించారు.

ఆయుర్వేద ఆహార నిపుణుల సూచనల మేరకు తయారుచేసిన కొత్త వంటకాలతోపాటు పోషకాలు కలిగి ఉన్న రుచికరమైన ఆహార పదార్థాలతోపాటు ఆయుష్ హెల్త్ ప్రాక్టిషనర్స్, యోగా శిక్షకులు ఈ స్టాల్లో అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా భారతీయ సంప్రదాయ ఔషధ వ్యవస్థల ఆధారంగా రూపొందించిన ఆసక్తికరమైన ప్రశ్నలకు సరైన సమాధానమిచ్చిన యువతకు ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వడం ఆయుష్ మంత్రిత్వశాఖ స్టాల్ అదనపు ఆకర్షణలు. హల్వా ఘీవార్, ఆమ్లా మురబ్బా, గుల్కంద్ మరియు యునాని హెర్బల్ టీ వంటి వివిధ ఆయుష్ ఆహారపదార్ధాల రుచిని కూడా సందర్శకులు ఆస్వాధించవచ్చు.

 వాణిజ్యం మరియు పెట్టుబడిని ప్రోత్సహించడానికి మరియు తయారీదారులు, వ్యాపారులు, ఎగుమతిదారులు మరియు దిగుమతిదారులకు ఓ ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయడానికి ప్రతి సంవత్సరం నిర్వహించబడే ఒక మెగా ఈవెంటే ఈ ట్రేడ్ ఫెయిర్. ఈ ఈవెంట్ యొక్క మొదటి ఐదు రోజులు.. అంటే నవంబర్ 14 నుండి 18 వరకు, వ్యాపారులు మరియు పెట్టుబడిదారుల కోసం కేటాయించగా.. నవంబర్ 19 న సాధారణ ప్రజల కోసం ట్రేడ్ ఫెయిర్ తెరవబడుతుంది.

భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75వ సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకొని 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మరింత  ప్రచారం కల్పించే లక్ష్యంతో  నిర్వహిస్తున్న ఐఐటీఎఫ్-2021కు.. ఈ సంవత్సరం 'ఆత్మనిర్భర్ భారత్' ఇతివృత్తంగా నిర్ణయించారు.

మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హోమియోపతి, ఆయుర్వేదం, సిద్ధ, యునాని, యోగా మరియు నేచురోపతి వంటి వివిధ ఆయుష్  శాఖల కింద ఆహార ఉత్పత్తులు మరియు మందుల గురించి ప్రచారం చేయడానికి ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. ఆయా శాఖల ఆరోగ్య శిక్షకులు ఉచిత ఓపీడీ కన్సల్టేషన్‌ను కూడా అందిస్తారు. సందర్శకులు నిపుణులైన యోగా శిక్షకుల నుండి యోగా నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. వై-బ్రేక్ మొబైల్ అప్లికేషన్‌లో ఇవ్వబడిన యోగా ప్రోటోకాల్ యొక్క లైవ్ డెమో కూడా ఉంటుంది. ఇది కార్యాలయ పనులు వారి కార్యాలయాలలో కేవలం ఐదు నిమిషాల్లో పునరుత్తేజితం మరియు పునరుజ్జీవనం పొందడంలో సహాయపడుతుంది.(Release ID: 1772155) Visitor Counter : 32