ఉక్కు మంత్రిత్వ శాఖ
మేకిన్ ఇండియా, గతిశక్తి పథకాలు ఉక్కు రంగం వృద్ధిలో కీలక చోదకాలుగా ఉండనున్నాయన్న ఉక్కు మంత్రి
గుజరాత్‌లోని నర్మద జిల్లా, కేవడియాలో ఉక్కు మంత్రిత్వ శాఖకు అనుబంధ పార్లమెంటరీ సలహా మండలి సమావేశం
Posted On:
15 NOV 2021 4:01PM by PIB Hyderabad
ఉక్కు వినియోగం అన్న అంశంపై గుజరాత్ లోని నర్మద జిల్లా, కేవడియాలో ఉక్కు మంత్రిత్వ శాఖకు పార్లమెంటు సభ్యులతో కూడిన సలహా మండలి (కన్సల్టేటివ్ కమిటీ) సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ అధ్యక్షత వహించారు.
మౌలిక సదుపాయాలు, నిర్మాణం, ఇంజినీరింగ్, ప్యాకేజింగ్, ఆటోమొబైల్, రక్షణ వంటి కీలక రంగాలలో ఉక్కు ప్రధాన సాధకమైనందున భారతదేశ పారిశ్రామికాభివృద్ధిలో ఉక్కు విశేష పాత్రను పోషిస్తోందని మంత్రి తన స్వాగతోపన్యాసంలో పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు, వినియోగదారుగా అవతరించింది. ఆర్థిక సంవత్సరం 2020-21లో, మొత్తం తయారు అయిన (ఫినిష్డ్) ఉక్కు వినియోగం 96.2 మిలియన్ టన్నులు కాగా, 2024-25 నాటికి అది 160 మిలియన్ టన్నులను, 2030-31నాటికి 250 ఎంటీలను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దేశీయంగా ఉక్కు ఉత్పాదన సామర్ధ్యాన్ని పెంచేందుకు, అదే సమయంలో దేశీయ డిమాండ్‌ను, ఉక్కు వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోంది. నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాలే భారీ స్థాయిలో ఉక్కును వినియోగిస్తూ, ఉక్కు వినియోగాన్ని పెంచేందుకు నిరంతర చోదకంగా ఉంటాయి. రానున్న ఐదు సంవత్సరాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికకు పూరకంగా ప్రభుత్వం ఇటీవలే గతిశక్తి మాస్టర్ ప్రణాళికను ప్రకటించింది. ఇది దేశంలో ఉక్కు వినియోగాన్ని మరింత ప్రోత్సహించనుంది.
పార్లమెంటు సభ్యులు ఉక్కు రంగానికి సంబంధించి ముఖ్యమైన సూచనలు చేయడమే కాకుండా, దేశంలో ఉక్కు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చొరవల గురించి ప్రస్తావించారు. పార్లమెంటు సభ్యులు - జనార్దన్ సింగ్ సిగ్రివాల్, బిద్యుత్ బరన్ మహతో, సతీష్ చంద్ర దూబే, అఖిలేష్ ప్రసాద్ సింగ్, చంద్ర ప్రకాష్ చౌదరి, సప్తగిరి శంకర్ ఉలాక, ప్రతాపరావ్ గోవింద్ రావ్ పాటిల్ చిఖలేకర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1772001)