ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆర్థిక సంవత్సరం 2021-22: పెరుగుతున్న పారిశ్రామిక వృద్ధి, నియంత్రిత ద్రవ్యోల్బణం మరియు బలమైన సేవల పునరుద్ధరణ

Posted On: 15 NOV 2021 10:41AM by PIB Hyderabad

సెప్టెంబరు, 2021 నెలకు సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) శీఘ్ర అంచనాల విడుదల పారిశ్రామిక ఉత్పత్తిలో స్థిరమైన పెరుగుదలను చూపుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐఐపి, క్యూ1లో సగటున 121.3  నుండి క్యూ2లో 130.2 కి పెరిగింది. క్యూ2లో ఐఐపి ఇంకా ఎక్కువగానే ఉండేది, అయితే భారీ రుతుపవనాల కారణంగా మైనింగ్ కార్యకలాపాలకు ముఖ్యంగా బొగ్గుకు అంతరాయం కలిగింది, తత్ఫలితంగా విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడి  మొత్తం ఉత్పత్తి సూచిక వృద్ధిని తగ్గించేసింది. 

ఐఐపిలో ఉత్పాదక సూచిక స్థిరంగా ఉంది. అక్టోబర్, 2021లో తయారీ రంగం 55.9 కి చేరుకోవడం కోసం పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ)లో ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి ప్రతిబింబించేలా తదుపరి నెలల్లో పెరిగే అవకాశం ఉంది.

క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్‌లో 2021-22 ఆర్థిక సంవత్సరపు క్యూ1లో సగటున 74.0  నుంచి క్యూ2లో 91.7 కి పెట్టుబడిలో గణనీయమైన రికవరీని సాధించింది.  

2021-22 ఆర్థిక సంవత్సరంలో వినియోగం పెరగడం ద్వారా పెట్టుబడి ప్రేరేపితమయ్యే స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి, ఎందుకంటే వినియోగదారు డ్యూరబుల్స్ ఇండెక్స్ Q1లో 91.7 నుండి క్యూ2లో 121.2కి పెరిగింది, అయితే వినియోగదారు నాన్-డ్యూరబుల్స్ ఇండెక్స్ కూడా రెండు త్రైమాసికాల్లో 139.1 నుండి 146.9కి పెరిగింది.

అక్టోబరు 2021 నెల వినియోగదారుల ధరల సూచిక (సిపిఐ) సంఖ్యల విడుదల వార్షిక వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం తగ్గుదల ఇప్పుడు 2021-22 ఆర్థిక సంవత్సరంలో క్రమంగా సర్దుబాటయిందని సూచిస్తోంది. వార్షిక సిపిఐ ద్రవ్యోల్బణం క్యూ1లో 5.6 శాతం నుండి క్యూ2లో 5.1 శాతానికి తగ్గింది మరియు 2021-22 ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌లో 4.5 శాతానికి తగ్గింది.

అదేవిధంగా, వినియోగదారుల ఆహార ధరల ద్రవ్యోల్బణం (సిఎఫ్పిఐ) 2021-22 ఆర్థిక సంవత్సరపు క్యూ1లో 4.0 శాతం నుంచి క్యూ2లో 2.6 శాతానికి మరియు అక్టోబరులో 0.8 శాతానికి తగ్గింది.

ఈ-వే బిల్లులు, విద్యుత్ వినియోగం మరియు జిఎస్టి వసూళ్లతో సహా అనేక హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్‌ల తాజా స్థాయిలలో ప్రతిబింబించినట్లుగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో కార్యాచరణ స్థాయిలు క్రమంగా పెరుగుతున్నాయి. జిఎస్టి వసూళ్లు 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి చెంది, వృద్ధి పునరుద్ధరణ పటిష్టతను ప్రతిబింబిస్తూ, అక్టోబర్, 2021లో దాని రెండవ అత్యధిక నెలవారీ వసూళ్లైన రూ.1.3 లక్షల కోట్లకు చేరుకుంది. అక్టోబర్ 2021లో ట్రాక్టర్ విక్రయాలు రికార్డు స్థాయిలో 1,15,615 యూనిట్లకు చేరాయి, సెప్టెంబర్ 2021 వాల్యూమ్‌ల కంటే 25 % ఎక్కువ, ఇది వ్యవసాయ రంగంలో స్థిరమైన వృద్ధిని సూచిస్తుంది.

పిఎంఐ సేవలు అక్టోబర్, 2021లో దశాబ్దాల గరిష్ట స్థాయి 58.4కి చేరుకున్నాయి, మహమ్మారి బలహీనపడటంతో కాంటాక్ట్ ఆధారిత సేవల రంగంలో బలమైన పునరుద్ధరణను సూచిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరపు క్యూ1లో విశ్రాంతి గమ్యస్థానాలలో సగటు హోటల్ ఆక్యుపెన్సీ రేటు 55 శాతం నుండి క్యూ2లో 60 శాతానికి పైగా పెరగడం సేవా రంగం ఆశావాదాన్ని నొక్కి చెబుతోంది.
2021-22 ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌లో వరుసగా ఏడవ నెలలో 30 బిలియన్ డాలర్లు దాటిన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎగుమతులు వృద్ధి ఇంజిన్‌గా కనిపిస్తున్నాయి. సంచిత ప్రాతిపదికన, ఏప్రిల్-అక్టోబర్‌లో భారతదేశ సరుకుల ఎగుమతులు 232.58 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి, ఇది 2019లో ఇదే కాలంలో 54.5% పెరిగింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల బకాయి క్రెడిట్ క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా రిటైల్ క్రెడిట్ ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పటిష్టం చేసే సూచనగా గణనీయంగా పెరుగుతోంది. సిబిల్ ప్రకారం, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నందున 2021 ఫిబ్రవరి, అక్టోబర్ మధ్య విచారణ వాల్యూమ్‌లు 54 శాతం పెరిగాయి.

 

****



(Release ID: 1771879) Visitor Counter : 179