ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఏడు సంస్థల ప్రమేయం ఉన్న సుమారు రూ.34 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసాన్ని గుర్తించిన సీజీఎస్‌టీ అధికారులు
Posted On:
14 NOV 2021 2:41PM by PIB Hyderabad
నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఆధారంగా.. 'సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్' (సీజీఎస్‌టీ) ఢిల్లీ (ఈస్ట్) కమిసనరేట్‌కు చెందిన యాంటీ ఎవేషన్ శాఖ అధికారులు బూటకపు జీఎస్‌టీ ఇన్‌వాయిస్‌లను ఉపయోగింది అనుమతించలేని ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందడం/ఉపయోగించడం, పాస్ చేయడానికి సంబంధించిన మోసాన్ని గుర్తించారు. వాస్తవంగా ఎలాంటి సరుకు తరలింపు లేకుండానే దాదాపు రూ.34 కోట్ల (సుమారు) అసలు సరుకు తరలింపు జరిపినట్టుగా చేసిన మోసాన్ని గుర్తించారు. సరుకుల అసలు తరలింపు లేకుండా, ప్రభుత్వానికి అసలు జీఎస్‌టీ చెల్లించకుండా మోసపూరిత ఐటీసీని పాస్ చేసే ఉద్దేశ్యంతో బోగస్ జీఎస్‌టీ ఇన్‌వాయిస్‌లను రూపొందించడానికిగాను ఏడు సంస్థలు సృష్టించబడ్డాయి. ఈ సంస్థలు ఎలాంటి వస్తువులు లేని దాదాపు రూ. 220 కోట్లు జీఎస్‌టీ ఇన్‌వాయిస్‌లను సృష్టించాయి. మొత్తం ఈ సంస్థలు రూ.34 కోట్ల (సుమారుగా) విలువైన ఆమోదించబడని ఐటీసీని పాస్ చేశాయి. బోగస్ సంస్థలను సృష్టించడం మరియు బోగస్ జీఎస్‌టీ ఇన్‌వాయిస్‌లను ఉత్పత్తి చేయడం/అమ్మడం వంటి ఈ రాకెట్‌ను నడపడం వెనుక రిషబ్ జైన్ ప్రధాన సూత్రధారిగా గుర్తిచండమైంది. కార్యనిర్వహణలో అనుమతించబడని క్రెడిట్‌ను పొందడం/ఉపయోగించడం & పాస్ చేయడం వంటి ఉద్దేశ్యంతో బహుళ సంస్థలను సృష్టించడం జరుగుతుంది. మెస్సర్స్ బ్లూ ఓషన్, మెస్సర్స్ హైజాక్ మార్కెటింగ్, మెస్సర్స్ కన్హా ఎంటర్‌ప్రైజెస్, మెస్సర్స్ ఎస్ఎస్ ట్రేడర్స్, మెస్సర్స్ ఎవర్నెస్ట్ ఎంటర్‌ప్రైజెస్, మెస్సర్స్ జ్ఞాన్ ఓవర్సీస్ & మెస్సర్స్ విహార్ష్ ఎక్స్‌పోర్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థలు ఈ నెట్‌వర్క్‌లో పాలుపంచుకున్నాయి. రిషబ్ జైన్ తన నేరాన్ని అంగీకరిస్తూ స్వచ్ఛంద ప్రకటన చేశాడు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాకు చెల్లించనందున, వ్యాపార ప్రాంగణాన్ని బ్యాంకర్లు సీలు చేశారని అతను అంగీకరించాడు.
ఆ తర్వాత ఎలాంటి సరుకుల తరలింపు లేకుండా బోగస్ జీఎస్‌టీ ఇన్‌వాయిస్‌లను జారీ చేయడంలో రిషభ్ మునిగిపోయాడు.
శ్రీ రిషబ్ జైన్ సీజీఎస్‌టీ చట్టం, 2017లోని సెక్షన్ 132(1)(b) కింద ఉద్దేశపూర్వకంగా ఈ నేరాలకు పాల్పడ్డాడు. ఇది సెక్షన్ 132 (5)లోని నిబంధనల ప్రకారం గుర్తించదగిన మరియు నాన్-బెయిలబుల్ నేరారం. ఇది యాక్ట్‌లోని సెక్షన్ 132 సబ్ సెక్షన్ (1) క్లాజ్ (i) ప్రకారం శిక్షార్హమైన నేరం. దీని ప్రకారం శ్రీ రిషబ్ జైన్‌ను 13.11.2021న సీజీఎస్‌టీ చట్టంలోని సెక్షన్ 132 కింద అరెస్టు చేశారు. విధినిర్వహణలో ఉన్న మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆయనను 26.11.2021వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
తదుపరి విచారణ కొనసాగుతోంది.
****
(Release ID: 1771789)
Visitor Counter : 212