ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రభుత్వ సెలవు దినాలు, ఆదివారం తో సహా వారంలో ఏడు రోజులు పనిచేసే కస్టమ్స్ క్లియరెన్స్ ఢిల్లీ కస్టమ్స్ పరిధిలోని సోనేపట్, గర్హి హర్సరు మరియు తుగ్లకాబాద్ ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోలలో ప్రారంభం

Posted On: 14 NOV 2021 4:42PM by PIB Hyderabad

  ప్రభుత్వ సెలవు దినాలుఆదివారం తో సహా వారంలో ఏడు రోజులు పనిచేసే కస్టమ్స్ క్లియరెన్స్ సౌకర్యాన్ని  ఢిల్లీ కస్టమ్స్ పరిధిలోని  సోనేపట్గర్హి హర్సరు ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోలో ఢిల్లీ కస్టమ్స్ జోన్ చీఫ్ కమీషనర్  శ్రీ సుర్జిత్ భుజబల్ ఈ రోజు ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి ఢిల్లీ కస్టమ్స్ జోన్ సీనియర్ అధికారులు,  జీఆర్‌ఎఫ్‌ఎల్ సీఈఓ కస్టోడియన్ఢిల్లీ కస్టమ్స్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్, జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీల్ లిమిటెడ్, హీరో మోటోకార్ప్ లిమిటెడ్, సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (పి) లిమిటెడ్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (పి) లిమిటెడ్, రికో ఆటో ఇండస్ట్రీస్, రికో ఆటో ఇండస్ట్రీస్, కార్స్ ఇండియా లిమిటెడ్, ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్, మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఇండియా లిమిటెడ్, పానాసోనిక్ ఇండియా (పి) లిమిటెడ్, ఓరియంట్ క్రాఫ్ట్ లిమిటెడ్, గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌  వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సహా ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కస్టమ్స్ చీఫ్ కమిషనర్ మూడు  ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోలలో వారంలో అన్ని రోజులు పనిచేసే విధంగా కస్టమ్స్ క్లియరెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ప్రభుత్వ సెలవు దినాలు, ఆదివారాలలో కూడా కస్టమ్స్ క్లియరెన్స్ పనిచేస్తుందని అన్నారు.  సోనేపట్గర్హి హర్సరు మరియు తుగ్లకాబాద్ లలో ఉన్న మూడు ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోలలో ఈ సౌకర్యాన్ని  అందుబాటులోకి తెచ్చామని వివరించారు. దీనివల్ల వ్యాపార రంగానికి మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. కస్టమ్స్ బ్రోకర్లతో మరింత సమన్వయంతో పనిచేసి వ్యాపారులు షిప్పింగ్ సంస్థల నుంచి డెలివరీ ఆర్డర్లను, ప్రభుత్వ సంస్థల నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్లను ముందుగానే తెచ్చుకోవాలని ఆయన సూచించారు. ఎగుమతి, దిగుమతిదారులకు ఈ సౌకర్యం వల్ల ప్రయోజనం కలుగుతుందని అన్నారు. దీనివల్ల సరుకుల రవాణాకు త్వరితగతిన అనుమతులు లభిస్తాయని, సమయం, వ్యయం ఆదా అవుతాయని అన్నారు. 

  కస్టమ్స్ క్లియరెన్స్‌ ఇవ్వడానికి పడుతున్న సమయాన్ని తగ్గించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ సౌకర్యాన్ని ప్రారంభించామని కస్టమ్స్ కమీషనర్ శ్రీ మనీష్ సక్సేనా తెలిపారు. కస్టమ్స్ ఢిల్లీ జోన్ అమలు చేస్తున్న ఈ సౌకర్యం వర్తక వాణిజ్య వర్గాలకు ప్రయోజనం కలిగిస్తుందని అన్నారు.

 వాణిజ్య సౌలభ్యం కోసం ఢిల్లీ కస్టమ్స్ జోన్ ఇటీవల అమలులోకి తెచ్చిన  వివిధ చర్యలను కస్టోడియన్, వాణిజ్యం మరియు ఇతర వాటాదారుల ప్రతినిధులు ప్రశంసించారు.  సెలవు రోజులతో సహా వారంలో ఏడు రోజులు అందుబాటులోకి వచ్చే కస్టమ్స్  క్లియరెన్స్   భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉందని దీనివల్ల  నిరంతరాయంగా ఉత్పత్తి సాగుతుందని   వినియోగదారుల అవసరాలను తాము తీర్చగలుగుతామని  పేర్కొన్నారు. 

***



(Release ID: 1771784) Visitor Counter : 141


Read this release in: English , Urdu , Hindi , Tamil