వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

2021 నవంబర్ 15 నుంచి 21 వరకు 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమం నిర్వహించనున్న ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ పంట సేకరణ,నిల్వ, చెరకు సాగు అంశాలపై రైతులతో నేరుగా చర్చలు


కర్ణాటకలో హుబ్లీలో డివిజనల్ ఆఫీసు, తంజావూరు, చెన్నైలలో ఫుడ్ సెక్యూరిటీ మ్యూజియంలను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో బలవర్థకమైన బియ్యం ప్రాముఖ్యతపై అంగన్‌వాడీ పిల్లలు మరియు మహిళలకు అవగాహనా కార్యక్రమాలు

అస్సాంలోని చాంగ్సారిలో ఆధునిక భవనం, హర్యానాలోని గురుగ్రామ్‌లో అనలిటికల్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ కు ప్రారంభోత్సవం

Posted On: 14 NOV 2021 11:28AM by PIB Hyderabad

75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతావని సాధించిన  ప్రగతి, దేశ ఘన చరిత్రను  స్మరించు కోవడానికి నిర్వహిస్తున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్వేడుకలో భాగంగా  ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ వచ్చే వారం ప్రత్యేక కార్యక్రమాలు మరియు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలు నవంబర్ 15 వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయి. 

 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్వేడుకలో భాగంగా ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ దేశం వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు,  సదస్సులు, వెబినార్ లు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించింది. 

పోషక ఆహార సమస్యను అధిగమించేందుకు వరి బియ్యం దోహదపడుతుందని తన  స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసంలో  సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వరి బియ్యం ప్రయోజనాలను వివరించి ప్రజలలో అవగాహన కల్పించి వినియోగం ఎక్కువ చేయడానికి ఆహార, ప్రజా పంపిణీ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. 

కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆహార భద్రత కల్పించడానికి అమలు చేసిన చర్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థ లో ప్రవేశ పెట్టిన సాంకేతిక అంశాల  ప్రాముఖ్యత, కోవిడ్ సమయంలో వీటి వల్ల కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ వేడుకల ప్రారంభ రోజున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.  దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రస్థానాన్ని వివరించే విధంగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. 

కర్ణాటకలో హుబ్లీలో  డివిజనల్ కార్యాలయాన్ని , తంజావూరు, చెన్నైలలో ఫుడ్ సెక్యూరిటీ మ్యూజియంలను వర్చువల్ విధానంలో  వాణిజ్యంపరిశ్రమలువినియోగదారుల వ్యవహారాలుఆహారం మరియు ప్రజా పంపిణీ జౌళి శాఖ మంత్రి  శ్రీ పీయూష్ గోయల్ వేడుకల్లో భాగంగా ప్రారంభిస్తారు. ఒక ఫోటో ప్రదర్శనను కూడా మంత్రి ప్రారంభిస్తారు. 

వ్యవసాయ  శాస్త్రాన్ని అభ్యసిస్తున్న  విద్యార్థులకు  ఆహార భద్రత గురించి అవగాహన కల్పించేందుకు ఐజీఎంఆర్ఐ, హాపూర్  ప్రత్యేక  కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది .

రెండో రోజున ఆహార ధాన్యాల సేకరణ, డిబిటి పై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి, వీటిపై రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రదర్శిస్తారు. సేకరణ కేంద్రాల వద్ద రైతులు, లబ్ధిదారులతో  సమావేశాలు  నిర్వహించడం జరుగుతుంది. కాన్పూర్ లో ఉన్న నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్ 50వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తారు.

మూడవ రోజున పంటలను నిల్వ చేయడంపంటల నాణ్యతపై  ఐజీఎంఆర్ఐ, హాపూర్ అవగాహనా సదస్సులు నిర్వహిస్తుంది. వివిధ ఆహార ధాన్యాలు,   బలవర్ధక వరి బియ్యం ప్రాముఖ్యతపై మరొక అవగాహన కార్యక్రమాన్ని కూడా సంస్థ ఏర్పాటు చేస్తుంది. 75 ఏళ్లలో ఆహార భద్రతను కల్పించే అంశంలో  ఆహార  ప్రజా పంపిణీ శాఖ అమలు చేసిన చర్యలు మరియు 'వరి బియ్యం ప్రాముఖ్యత'పై ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుంది.

నాలుగో రోజున  చెరకు రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.  'చెరకు సాగులో ఉత్తమ పద్ధతులు' అనే అంశంపై రైతులుస్వయం సహాయక బృందాలతో చర్చలు నిర్వహించబడతాయి. లక్నో,కాన్పూర్‌లోని సంబంధిత సంస్థలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్నాటక మరియు పంజాబ్‌లకు చెందిన  చక్కెర కర్మాగారాలతో చెరకు సాగులో ఉత్తమ పద్ధతులపై సమావేశాలు జరుగుతాయి.

అస్సాంలో అయిదవ రోజు కార్యక్రమాలు జరుగుతాయి. కారక్రమంలో భాగంగా వాణిజ్యంపరిశ్రమలువినియోగదారుల వ్యవహారాలుఆహారం మరియు ప్రజా పంపిణీ జౌళి శాఖ మంత్రి  శ్రీ పీయూష్ గోయల్ అస్సాంలోని చాంగ్సారిలో ఆధునిక భవనాన్ని ప్రారంభించి, స్టోరేజ్ ఆపరేషన్స్‌పై షార్ట్ ఫిల్మ్‌ను ఆవిష్కరిస్తారు. ఇదే రోజున ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో పోషకాహారానికి సంబంధించిన సమాచారం మరియు బలవర్థకమైన బియ్యం ప్రాముఖ్యతను తెలియజేయడానికి అంగన్‌వాడీ పిల్లలు మరియు తల్లులతో బహిరంగ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

ఆరవ రోజు, గురుగ్రామ్‌లోని ఐఎఫ్‌ఎస్‌లో అనలిటికల్ క్వాలిటీ కంట్రోల్ లాబొరేటరీని ప్రారంభించనున్నారు.  ప్లాస్టిక్ బియ్యంపై రూపొందించిన లఘు చిత్రాన్ని, ప్రచార కార్యక్రమాల   ప్యాకేజీ (రేడియో జింగిల్స్, సోషల్ మీడియా)ని, వరి  బియ్యంపై రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రారంభిస్తారు. వారి బియ్యంపై 

సిడబ్ల్యుసి సహకారంతో వరి బియ్యంపై రూపొందించిన వీధి నాటకాలను ప్రదర్శిస్తారు.  వరి బియ్యం ఉపయోగించి వివిధ వంటకాలను తయారు చేయడంపై ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరుగుతుంది.  ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ లలో   ప్రపంచ ఆహార కార్యక్రమంలో భాగంగా వరి బియ్యం వినియోగంపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. 

 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వారోత్సవాల కార్యక్రమం ముగింపు రోజున విభిన్న కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఆహార ధాన్యాల నిల్వగిడ్డంగుల అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 200 ఉత్పత్తిదారుల సంస్థలు పాల్గొంటాయి. 

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రులు  శ్రీ అశ్విని కుమార్ చౌబే మరియు సాధ్వి నిరంజన్ జ్యోతి ఈ వేడుకల్లో పాల్గొంటారు. 

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా , స్టోరేజ్, షుగర్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ , వేర్‌హౌసింగ్ డెవలప్‌మెంట్ రెగ్యులేటరీ అథారిటీ , సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ , ఇండియన్ గ్రెయిన్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తో సహాఆహార,ప్రజా పంపిణీ శాఖకు చెందిన అన్ని విభాగాలు మరియు ఇతరులు కార్యక్రమాల నిర్వహణ లో పాల్గొంటాయి.

 



(Release ID: 1771754) Visitor Counter : 119