గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మరియు ఉత్తరాఖండ్ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా ఉత్తరాఖండ్ గిరిజన ఉత్సవాలు ప్రారంభించిన శ్రీ అర్జున్ ముండా
Posted On:
12 NOV 2021 1:16PM by PIB Hyderabad
మూడు రోజుల పాటు ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో జరగనున్న ఉత్తరాఖండ్ గిరిజన ఉత్సవాలను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ దామి 2021 నవంబర్ 11న ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఉత్తరాఖండ్ గిరిజన ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 2021 నవంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనికి సన్నాహక కార్యక్రమంగా గిరిజన ఉత్సవాలను ఏర్పాటు చేశారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహకారంతో రాష్ట్ర గిరిజన పరిశోధన సాంస్కృతిక కేంద్రం ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. సంపూర్ణ ప్రభుత్వం, జన్-భాగీ దారి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ అమృత్ మహోత్సవ్ ను నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ సంస్కృతి, కళలు, సంప్రదాయాలు, హస్తకళలు, గిరిజన ఆహారాన్ని ప్రదర్శించేలా ఉత్తరాఖండ్ గిరిజన ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ లోని ప్రధాన గిరిజన తెగలైన జౌన్సారి, థారు, బోక్సా, భోటియా మరియు రాజీ లకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ అర్జున్ ముండా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని అన్నారు. 2021 నవంబర్ 15 ను “ జనజాతి గౌరవ్ దివస్” గా ప్రకటించినందుకు ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
గిరిజనుల అభివృద్ధికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన శ్రీ ముండా వీటిని అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని అభినందించారు. రాష్ట్రంలో రెండు ఏకలవ్య మోడల్ పాఠశాలలను , మ్యూజియం ను ప్రారంభించి గిరిజన విద్యార్థులకు 5000 టాబ్లెట్ లను అందించాలని శ్రీ ముండాకు రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో దీనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజన ఉత్సవాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులను వీటిలో ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజలను ఆయన అభినందించారు.
నీరు, అడవులు, భూమి కోసం పనిచేసి ప్రాణ త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ ముండాకు మంత్రి నివాళులు అర్పించారు.
భారత రాజ్యాంగంలోని 275 అధికరణం గిరిజనుల హక్కులను పరిరక్షిస్తుందని శ్రీ ముండా పేర్కొన్నారు. గిరిజనులకు మరింత సాధికారత కల్పించడానికి ఉపకరించే విధంగా ప్రతిపాదనలను సిద్ధం చేసి వాటిని గిరిజన మంత్రిత్వ శాఖకు పంపాలని ఆయన ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సూచించారు. విద్యారంగంలో అసాధారణమైన పనితీరును కనబరుస్తున్న కల్సి డెహ్రాడూన్‌లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులను మంత్రి అభినందించారు. ఉత్తమ విద్యా ప్రమాణాలలో పాఠశాల ఆదర్శనీయంగా ఉందని అన్నారు. అటవీ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అయన అన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి ట్రిఫెడ్ తో కలిసి కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు.
సమావేశంలో ప్రసంగించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ కేశరి చాంద్ జి కి నివాళులు అర్పించారు. ఉత్తరాఖండ్ కి చెందిన అనేక మంది స్వాతంత్ర్య సమర యుద్ధంలో పాల్గొన్నారని అన్నారు. రాష్ట్ర గిరిజన కళలు, సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు.
ఉత్సవాలలో రాష్ట్రానికి చెందిన ఐదు గిరిజన తెగలకు చెందిన విభిన్నమైన కళ సంస్కృతి పై ఏర్పాటైన ఝంకీ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
*****
(Release ID: 1771213)
Visitor Counter : 196