పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ సౌర కూటమి లో 101వ సభ్య దేశంగా అవతరించిన - అమెరికా


ఈ చర్య ఐ.ఎస్.ఏ. ని బలోపేతం చేస్తుంది, ప్రపంచానికి స్వచ్ఛమైన ఇంధన వనరులను అందించడంపై భవిష్యత్తు చర్యను ప్రోత్సహిస్తుంది : శ్రీ భూపేందర్ యాదవ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమిలో చేరడం మాకు సంతోషంగా ఉంది : శ్రీ జాన్ కెర్రీ

Posted On: 10 NOV 2021 7:07PM by PIB Hyderabad

సౌరశక్తిని ప్రపంచవ్యాప్త స్వీకరణను వేగవంతం చేయడానికి ఒక పెద్ద ప్రోత్సాహంలో భాగంగా,  అంతర్జాతీయ సౌర కూటమి (ఐ.ఎస్.ఏ) లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు (యు.ఎస్.ఏ) సభ్య దేశంగా చేరినట్లు, వాతావరణానికి సంబంధించిన అమెరికా ప్రత్యేక అధ్యక్ష రాయబారి, జాన్ కెర్రీ, ఈ రోజు యు.ఎన్.ఎఫ్.సి.సి.సి. సి.ఓ.పి-26 లో ప్రకటించారు.  సౌర ఆధారిత విధానం ద్వారా ప్రపంచ ఇంధన పరివర్తనను ఉత్ప్రేరక పరచడానికి ఐ.ఎస్.ఏ. యొక్క ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేసిన 101వ దేశంగా అమెరికా నిలిచింది. 

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, ఐ.ఎస్.ఏ. లో 101వ సభ్య దేశంగా అమెరికా ను స్వాగతించారు. ఈ చర్య ఐ.ఎస్.ఏ. ని మరింత బలపరుస్తుందనీ, ప్రపంచానికి స్వచ్ఛమైన ఇంధన వనరులను అందించడంలో భవిష్యత్తు చర్యను ప్రోత్సహిస్తుందనీ, ఆయన పేర్కొన్నారు. 

వాతావరణానికి సంబంధించిన అమెరికా ప్రత్యేక అధ్యక్ష రాయబారి, జాన్ కెర్రీ, ఫ్రేమ్‌ వర్క్ ఒప్పందంపై సంతకం చేసిన అనంతరం మాట్లాడుతూ,  "ఇది చాలా కాలంగా వస్తోంది, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వం వహించిన అంతర్జాతీయ సౌర కూటమిలో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము వివరాలు రూపొందించాము.  ఈ ప్రక్రియలో భాగమైనందుకు మేము సంతోషిస్తున్నాము.  ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తిని మరింత వేగంగా విస్తరింప చేయడానికి ఇది ఒక ముఖ్యమైన సహకారాన్ని అందిస్తుంది.  అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది చాలా ముఖ్యమైనది." అని పేర్కొన్నారు. 

ఐ.ఎస్.ఏ. డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్ మాట్లాడుతూ, "ఐ.ఎస్.ఏ. ఫ్రేమ్‌ వర్క్ మరియు విధానాలు అమెరికా ఆమోదం పొందడం ఒక హృదయపూర్వక పరిణామం. ముఖ్యంగా మన 101వ సభ్య దేశంగా, ఇది ఒక ముఖ్యమైన మైలురాయి సంఘటన. అలాగే ప్రపంచ శక్తి పరివర్తనకు ఉత్ప్రేరకంగా ఈ శక్తి వనరు యొక్క సంభావ్యత తో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు సౌరశక్తి యొక్క ఆర్థిక, వాతావరణ ఉపశమన విలువలను గుర్తిస్తున్నాయన్న విషయాన్ని ఇది నిరూపిస్తోంది." అని పేర్కొన్నారు. 

అంతర్జాతీయ సౌర కూటమి (ఐ.ఎస్.ఏ) ని ప్రారంభిస్తున్నట్లు, ఫ్రాన్స్‌ లోని పారిస్‌ లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశం (సి.ఓ.పి-21) 21వ సదస్సులో, భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు గౌరవనీయులు ఫ్రాంకోయిస్ హోలాండ్, 2015 నవంబర్, 30వ తేదీన ప్రకటించారు.  ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ తో పాటు,  దాదాపు 120 దేశాల అధిపతులు పాల్గొని, సౌరశక్తిని ప్రోత్సహించే ప్రయత్నాలను అంకితం చేసేందుకు కూటమిలో తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించారు.

దేశాల మద్దతు కోసం, ఈ ఫ్రేమ్‌ వర్క్ ను మొదటిసారిగా 2016 లో పంపిణీ చేయడం జరిగింది. లక్ష్య విఫణిలో సౌర సాంకేతికతలను ప్రోత్సహించడం, విస్తరించడం సులభతరం చేయడానికి ప్రమాదాన్ని తగ్గించడం, వినూత్న ఆర్ధిక సదుపాయాలను అందించే సాధనాలను అందుబాటులో ఉంచడం,  ఐ.ఎస్.ఏ. యొక్క ముఖ్య జోక్యాలతో సంసిద్ధత మరియు కార్యకలాపాలను ప్రారంభించడంతో పాటు, పరస్పర సహకారం ద్వారా అన్ని దేశాలకు ప్రపంచ ఔచిత్యం మరియు స్థానిక ప్రయోజనాలను అందించడాన్ని ఈ ఫ్రేమ్‌-వర్క్ నొక్కి చెప్పింది. 

ఫ్రేమ్‌-వర్క్‌లో వివరించిన విధానం మరియు పద్ధతులు ఇప్పటికే ఫలితాలను అందించాయి.  దాదాపు 5 జి.డబ్ల్యూ. స్థాపిత సామర్థ్యం కలిగిన సౌర ప్రాజెక్టును ఐ.ఎస్.ఏ. నిర్మిస్తోంది.   ఈ ఫ్రేమ్‌-వర్క్‌లో వివరించిన విధానం ఇంటర్‌ కనెక్టడ్ గ్లోబల్ గ్రిడ్‌ ల కోసం ఒక దార్శనిక దృష్టితో ముగుస్తుంది. అంతర్జాతీయ సౌర కూటమి (ఐ.ఎస్.ఏ) కి చెందిన భారత అధ్యక్షడు, సి.ఓ.పి-26 కి చెందిన యు.కె. అధ్యక్షుడు ద్వారా, 2021 నవంబర్, 2వ తేదీన గ్లాస్గో లో సి.ఓ.పి-26 ప్రపంచ నాయకుల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, ఇది 'గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ - వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్' (జి.జి.ఐ.-ఓ.ఎస్.ఓ.డబ్ల్యూ.ఓ.జి) గా అధికారికంగా, సంయుక్తంగా ప్రారంభించబడింది.

అంతకు ముందు సి.ఓ.పి-26 సదస్సులో, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, భారతదేశం తో కూడిన 5 మంది సభ్యులతో కూడిన జి.జి.ఐ.-ఓ.ఎస్.ఓ.డబ్ల్యూ.ఓ.జి. యొక్క క్రియాశీలక కమిటీ లో, అమెరికా కూడా చేరి, 80 దేశాలతో పాటు "వన్-సన్-డిక్లరేషన్‌" ను ఆమోదించింది.  అమెరికా విద్యుత్ శాఖ కార్యదర్శి, జెన్నిఫర్ గ్రాన్‌హోమ్ మాట్లాడుతూ, "గ్రిడ్-సన్ కలయిక గ్రహాన్ని కాపాడుతుంది.  పజిల్‌ లోని రెండు ముఖ్యమైన భాగాలపై జి.జి.ఐ.-ఓ.ఎస్.ఓ.డబ్ల్యూ.ఓ.జి. దృష్టి సారిస్తోంది. అమెరికా విద్యుత్ శాఖ లో ఉన్న మేమంతా, జి.జి.ఐ.-ఓ.ఎస్.ఓ.డబ్ల్యూ.ఓ.జి. తో భాగస్వామిగా ఉన్నందుకు సంతోషిస్తున్నాము." అని పేర్కొన్నారు. 

గ్రీన్‌-హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో ఐ.ఎస్.ఏ. కీలకమని, ప్రపంచంలోని అత్యంత బలమైన సూర్యకాంతితో ఆశీర్వదించబడిన సభ్య దేశాల తో సౌర వృద్ధిని వేగవంతం చేసే అవకాశం ఉందని, వాతావరణం కోసం అమెరికా ప్రత్యేక అధ్యక్ష ప్రతినిధి జాన్ కెర్రీ, 2021 అక్టోబర్ లో ఐ.ఎస్.ఏ. నాల్గవ జనరల్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను అనుసరించి, అమెరికా ఐ.ఎస్.ఏ. ఫ్రేమ్‌-వర్క్ యొక్క ఆమోదం తెలిపింది.  "అత్యవసర వాతావరణ చర్యకు సౌర శక్తి గుండె వంటిది." అని, శ్రీ కెర్రీ పేర్కొంటూ, 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదలతో, మధ్య శతాబ్దపు నికర శూన్య ఉద్గారాల లక్ష్యాలను చేరుకునేలా, నాటకీయ చర్యలు తీసుకోవాలని, దేశాలను కోరారు.

అంతర్జాతీయ సౌర కూటమి గురించి :

ఐ.ఎస్.ఏ. అనేది సౌర విద్యుత్తు కోసం ఆర్ధిక, సాంకేతికత ఖర్చును తగ్గించడంలో సహాయం చేయడం ద్వారా ప్రపంచ సౌర వృద్ధిని ఉత్ప్రేరకపరచడానికి ప్రపంచ ఆదేశాన్ని కలిగి ఉన్న అంతర్ ప్రభుత్వ ఒప్పందం-ఆధారిత అంతర్జాతీయ సంస్థ.  ఈ ఆదేశాన్ని నెరవేర్చడంలో, భాగస్వామ్య పరిష్కారంగా సౌరశక్తిని స్థాపించడానికి ఐ.ఎస్.ఏ. కట్టుబడి ఉంది.  ఇది భౌగోళిక ప్రాంతాల్లో వాతావరణం, శక్తి, ఆర్థిక ప్రాధాన్యతలను ఏకకాలంలో పరిష్కరించడంతో పాటు,  ప్రపంచ స్థాయిలో విద్యుత్ పరివర్తనను సులభతరం చేస్తుంది.  జాతీయ స్థాయిలో ఇంధన భద్రతను,  స్థానిక స్థాయిలో విద్యుత్తు అందుబాటును కూడా నిర్ధారిస్తుంది.  అంతర్జాతీయ కట్టుబాట్లను పరిరక్షించడానికి పెద్ద దేశాలకు ఐ.ఎస్.ఏ. సహాయం చేస్తోంది,  తద్వారా తగ్గిన కర్బన ఉద్గారాల కోసం భూగ్రహం అవసరాలను తీర్చడంతో పాటు, ఆర్థికంగా మరింత బలహీనమైన దేశాలకు స్వీయ-నిరంతర ఇంధన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడంలో సహాయపడేటప్పుడు, ఇది వాణిజ్య పరంగా ఆధారపడటాన్ని తగ్గిస్తుంది, ఉద్యోగ సృష్టిని ప్రోత్సహిస్తుంది. సాంఘిక-ఆర్థిక వర్గాలలో సార్వత్రిక, సరసమైన, విశ్వసనీయమైన, మారుమూల ప్రదేశాలకు సైతం విద్యుత్తును అనుసంధానించి, ఆర్థికాభివృద్ధి, పర్యావరణ ప్రభావాన్ని సులభతరం చేయడంతో పాటు, ఈ సంయుక్త ప్రయత్నాల లక్ష్యాల ప్రత్యక్ష ఫలితాలను సాధించడంలో కూడా ఇది సహాయ పడుతుంది. 

*****(Release ID: 1770841) Visitor Counter : 429


Read this release in: English , Urdu , Marathi , Hindi