నీతి ఆయోగ్

సి.ఓ.పి-26 సదస్సులో రవాణా దినోత్సవాన్ని జరుపుకున్న - భారతదేశం

Posted On: 10 NOV 2021 7:45PM by PIB Hyderabad

నీతీ ఆయోగ్ ప్రాతినిధ్యం వహించిన సి.ఓ.పి-26 సదస్సులో భాగంగా రవాణా దినోత్సవం రోజున, ఉద్గారాలు లేని వాహనాల కు మార్పుపై రాజకీయ సహకారాన్ని పెంపొందించడం కోసం అంతర్జాతీయ వేదిక గా నిలిచిన జీరో-ఎమిషన్ వెహికల్ ట్రాన్సిషన్ కౌన్సిల్ (జెడ్.ఈ.వి.టి.సి) నిర్వహించిన, నాల్గవ మంత్రివర్గ స్థాయి సదస్సులో భారతదేశం పాల్గొంది.  జెడ్.ఈ.వి. లకు మారే క్రమంలో, కీలక సవాళ్లను సమిష్టిగా పరిష్కరించడానికి, అదేవిధంగా,  అందరూ వేగంగా, చౌకగా, సులభంగా ఈ.వి.లకు మారడానికి వీలుగా, ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ల కు చెందిన  మంత్రులు, ప్రతినిధులను, జెడ్.ఈ.వి.టి.సి. ఒకచోట చేర్చింది. 

ఎలక్ట్రిక్ మొబిలిటీ ని వేగంగా అమలు చేయడానికి వీలుగా అవసరమైన విధానాలను ప్రవేశపెట్టడంలో భారతదేశం ఇప్పటికే గొప్ప పురోగతి సాధించింది.  అన్ని విద్యుత్తు వాహనాలకు సంబంధించిన సమాచారం ఒకే చోట లభించే విధంగా, ఈ.వి.ల పై ఈ-అమ్రిత్ పోర్టల్ ను కూడా, ప్రభుత్వం నవంబర్ 10వ తేదీన,  ప్రారంభించింది.  

ఉద్గారా లు లేని వాహనాలకు అంతర్జాతీయ స్థాయి యాక్సిలరేటింగ్ ట్రాన్సిషన్ పై దృష్టి పెట్టిన, నాన్-బైండింగ్ మరియు సి.ఓ.పి-26 ప్రకటనకు, భారత ప్రభుత్వం తరపున నీతి ఆయోగ్ కూడా ఈరోజు తన మద్దతును అందించింది. 

ఉద్గారాలు లేని వాహనాల విస్తరణ, స్వీకరణకు చురుకుగా పని చేయాలని,  ఆటోమోటివ్ తయారీదారులు, ప్రభుత్వాలు, వ్యాపారాలు, ఫ్లీట్ యజమానులు మొదలైన అనేక మంది భాగస్వాములు ఈ ప్రకటనను చేశారు.

దేశంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ గా, 80 శాతం కంటే ఎక్కువగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను కలిగిఉన్న అతి పెద్ద రవాణా రంగం,  ఉద్గారాలు లేని వాహనాల దిశగా మారవలసిన అవసరాన్ని భారతదేశం నొక్కి చెప్పింది. 

అంతర్జాతీయ సహకారం, మద్దతును బలోపేతం చేయాలని కోరుతూ, అన్ని అభివృద్ధి చెందిన దేశాలకు, ఈ ప్రతిజ్ఞపై సంతకం చేసిన వారు పిలుపునిచ్చారు, తద్వారా ప్రపంచవ్యాప్తంగా సమానమైన, న్యాయమైన పరివర్తన సాకారమవుతుందని వారు పేర్కొన్నారు.

ఈ.వి. లకు సరసమైన మార్పు కోసం ఒక బలమైన సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి, కొత్త ఆర్థిక సాధనాలను రూపొందించడానికి, ఒక సంఘటిత ప్రపంచవ్యాప్త కృషి అవసరం.  ఈ అంతరాలను తగ్గించి, కొత్త ఉపాధి అవకాశాలు, స్వదేశీ మరియు వినూత్న సరఫరా వ్యవస్థను సృష్టించడానికి అనువైన పర్యావరణ వ్యవస్థ అవసరం కూడా ఈ.వి. ఉద్యమానికి ఉంది. 

 

*****

 



(Release ID: 1770840) Visitor Counter : 149


Read this release in: English , Urdu , Hindi , Punjabi