గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీల్యాడ్స్) పునరుద్ధరణకు, కొనసాగింపుకు ఆమోదం తెలిపిన కేంద్రం క్యాబినెట్

Posted On: 10 NOV 2021 3:51PM by PIB Hyderabad

2021–-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన భాగంతోపాటు,  2025–-26 ఆర్థిక సంవత్సరం వరకు పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీల్యాడ్స్) పునరుద్ధరణకు,  కొనసాగింపునకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది.- ఇందులో 15వ ఫైనాన్స్ కమిషన్ కాలంతో కూడిన కో–టెర్మినస్ ఉంటుంది.

పథకం వివరాలు:

· ఎంపీల్యాడ్స్.. భారత ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చే కేంద్ర  పథకం. ప్రధానంగా తమ నియోజకవర్గాల్లో తాగునీరు, ప్రాథమిక విద్య, ప్రజారోగ్యం, పారిశుధ్యం  రోడ్లు మొదలైన వాటిలో మన్నికైన సామాజిక ఆస్తుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, అభివృద్ధి సంబంధమైన పనులను సిఫార్సు చేయడానికి ఎంపీలను అనుమతించడం ఈ పథకం  లక్ష్యం.

· ఎంపీల్యాడ్స్ మార్గదర్శకాల ప్రకారం, షరతుల నెరవేర్పుకు లోబడి, ప్రతి పార్లమెంటు సభ్యుని (ఎంపీ) నియోజకవర్గానికి వార్షిక ఎంపీల్యాడ్స్ ఫండ్ అర్హత రూ.5 కోట్లు. వీటిని రూ.2.5 కోట్ల చొప్పున రెండు విడతలుగా విడుదల చేస్తారు.

·   కోవిడ్ 19  ఆరోగ్యం  ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి కోసం 2020  ఏప్రిల్ 6వ తేదీన జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. కరోనాను కట్టడి చేయడానికి నిధుల కోసం 2020–-21.  2021–-22 ఆర్థిక సంవత్సరంలో ఎంపీల్యాడ్స్ ఇవ్వకూడదని,  నిధులను ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దే ఉంచాలని నిర్ణయించారు. కోవిడ్ 19 మహమ్మారి ప్రభావాలను తట్టుకోవడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది..

· దేశం ఇప్పుడు ఆర్థిక పునరుద్ధరణ మార్గంలో ఉన్నందున  సామాజిక ఆస్తుల సృష్టికి,  స్థానికంగా ముఖ్యమైన అవసరాలను, ఆకాంక్షలను నెరవేర్చడానికి, నైపుణ్యాభివృద్ధి పథకాల కోసం దేశవ్యాప్తంగా ఉద్యోగాల కల్పనకు ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. తద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. దీని ప్రకారం 2021–-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన భాగంలో పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీల్యాడ్స్)ని పునరుద్ధరించాలని  15వ ఫైనాన్స్ కమిషన్ కాలంతో పాటు 2025–-26 వరకు ఎంపీల్యాడ్స్ కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.

మంత్రిత్వ శాఖ ఎంపీల్యాడ్స్ నిధిని  2021–-22 ఆర్థిక సంవత్సరంలొ మిగిలిన కాలానికి ఒక్కో పార్లమెంటు సభ్యునికి 2 కోట్లు విడుదల చేస్తుంది.  2022–-23 నుండి  2025–-26 వరకు ప్రతి పార్లమెంటు సభ్యునికి సంవత్సరానికి 5.00 కోట్లు ఇస్తారు. రెండు విడతలుగా రూ. 2.5 కోట్ల చొప్పున చెల్లిస్తారు. పథకం ప్రారంభించినప్పటి నుండి, మొత్తం 19,86,206 పనులు/ప్రాజెక్టులు ఎంపీల్యాడ్స్ ఆర్థిక సహాయంతో పూర్తయ్యాయి. వీటి కోసం రూ. 54171.09 కోట్లు ఖర్చు చేశారు.

ఆర్థికపరమైన అంచనాలు:

2021–-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన భాగంతోపాటు  2025–-26 వరకు ఎంపీల్యాడ్స్  పునరుద్ధరణ  కొనసాగింపు కోసం మొత్తం ఆర్థిక అంచనా వ్యయం రూ. 17417.00 కోట్లు. వివరాలు కింది పట్టికలో ఉన్నాయి

ఆర్థిక సంవత్సరం

2021-22

2022-23

2023-24

2024-25

2025-26

మొత్తం ఖర్చు

ఆర్థికపరమైన అంచనాలు (రూ. కోట్లలో)

1583.5

3965.00

3958.50

3955.00

3955.0

17417.00

అమలు వ్యూహం,  లక్ష్యాలు:

· ఎంపీల్యాడ్ పథకం మార్గదర్శకాల  ద్వారా అమలవుతుంది. వీటిని ఎప్పటికప్పుడు సవరిస్తారు.

 

· ఎంపీల్యాడ్స్ కింద ప్రక్రియ పార్లమెంటు సభ్యులు నోడల్ జిల్లా అథారిటీకి పనులను సిఫార్సు చేయడంతో ప్రారంభమవుతుంది. సంబంధిత నోడల్ జిల్లా.. పార్లమెంటు సభ్యులు సిఫార్సు చేసిన అర్హత గల పనులను అమలు చేస్తుంది.  పథకం కింద అమలు చేసిన వ్యక్తిగత పనులను,  ఖర్చు చేసిన మొత్తాన్ని పర్యవేక్షిస్తుంది.

 

ప్రభావం:

 · ఎంపీల్యాడ్స్  పునరుద్ధరణ  కొనసాగింపు, ఎంపీల్యాడ్స్ కింద నిధుల కొరత కారణంగా ఆగిపోయిన/ స్తంభించిన సామాజిక అభివృద్ధి ప్రాజెక్ట్‌లు / ఫీల్డ్‌లోని పనులను పునఃప్రారంభిస్తారు.

 

· ఇది స్థానిక సమూహాల  ఆకాంక్షలు,  అభివృద్ధి అవసరాలను నెరవేర్చుతుంది. ఇందుకోసం  మన్నికైన ఆస్తుల సృష్టిని పునఃప్రారంభించడం ఎంపీల్యాడ్స్  ప్రాథమిక లక్ష్యం.

 

· ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో కూడా సహాయపడుతుంది.

 

నేపథ్యం:

 

· ఎంపీల్యాడ్స్ అనేది భారత ప్రభుత్వమే పూర్తిగా నిధులు సమకూర్చే కేంద్ర  పథకం. ప్రధానంగా తమ నియోజకవర్గాల్లో తాగునీరు, ప్రాథమిక విద్య, ప్రజారోగ్యం, పారిశుధ్యం  రోడ్లు మొదలైన ఆస్తుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి సంబంధమైన పనులను సిఫార్సు చేయడానికి ఎంపీలను అనుమతించడం ఈ పథకం  లక్ష్యం.

 

· ఎంపీల్యాడ్స్ మార్గదర్శకాల ప్రకారం షరతుల నెరవేర్పుకు లోబడి, ప్రతి పార్లమెంటు సభ్యుని (ఎంపీ) నియోజకవర్గానికి వార్షిక ఎంపీల్యాడ్స్ ఫండ్ అర్హత రూ.5 కోట్లు. వీటిని రూ.2.5 కోట్ల చొప్పున రెండు విడతలుగా విడుదల చేస్తారు.

 

· మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 216 జిల్లాల్లో 2021లో ఎంపీల్యాడ్స్ పనుల థర్డ్ పార్టీ మూల్యాంకనాన్ని నిర్వహించింది. ఎంపీల్యాడ్స్ కొనసాగింపు కోసం మూల్యాంకన నివేదికను సిఫార్సు చేసింది.

 

***(Release ID: 1770838) Visitor Counter : 74