శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శాస్త్రీయ అనువ‌ర్త‌నాలు, సాంకేతిక ప‌రిష్కారాల కోసం 33 లైన్ మంత్రిత్వ శాఖ‌లు / డిపార్ట్‌మెంట్ల నుంచి 134 ప్ర‌తిపాద‌న‌లు / ఆవ‌శ్య‌క‌త‌ల అందుకున్న‌ట్టు చెప్పిన కేంద్ర మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్

న్యూఢిల్లీలో అన్ని సైన్స్ మంత్రిత్వ‌శాఖ‌లు, డిపార్ట్‌మెంట్ల మూడ‌వ సంయుక్త స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగం

వ్య‌వ‌సాయం, ఆహారం, విద్య‌, నైపుణ్యాలు, రైల్వేలు, ర‌హ‌దారులు, జ‌ల‌శ‌క్తి, బొగ్గు వంటి రంగాల‌కు శాస్త్రీయ అనువర్త‌నాల‌ను కోరుత‌న్న శాఖ‌లు ః డాక్ట‌ర్ జితేంద్ర సింగ్

Posted On: 10 NOV 2021 4:19PM by PIB Hyderabad

వైజ్ఞానికి అనువ‌ర్త‌నానికి, సాంకేతిక ప‌రిష్కారాల కోసం 33 లైన్ మంత్రిత్వ‌శాఖ‌లు/   శాఖ‌ల నుంచి 134 ప్రతిపాద‌న‌లు/ ఆవ‌శ్య‌క‌త‌ల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల‌ను  సిఎస్ఐఆర్ స‌మ‌న్వ‌యంతో న‌డుస్తున్న ఆరు ఎస్‌&టి శాఖ‌లు అందుకున్న‌ట్టు కేంద్ర శాస్త్ర‌&సాంకేతిక శాఖ (ఇండిపెండెంట్ ఛార్జి), ఎర్త్ సైన్సెస్ (ఇండిపెండెంట్ ఛార్జి), ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం, సిబ్బంది, ప్ర‌జా ఫిర్యాదులు, పింఛ‌న్లు, అణు ఇంధ‌నం, అంత‌రిక్ష శాఖల స‌హాయ మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ బుధ‌వారం వెల్ల‌డించారు. 
అన్ని శాస్త్ర మంత్రిత్వ శాఖ‌లు, డిపార్ట్‌మెంట్ల మూడ‌వ సంయుక్త స‌మావేశాన్ని బుధ‌వారం ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ, వ్య‌వ‌సాయం, ఆహారం, విద్య‌, నైపుణ్యాలు, రైల్వేలు, ర‌హ‌దారులు, జ‌ల‌శ‌క్తి, విద్యుత్తు, బొగ్గు స‌హా ప‌లు రంగాల‌కు వివిధ శాస్త్రీయ అనువ‌ర్త‌న‌ల‌ను వినియోగించ‌డంపై సెప్టెంబ‌ర్ నెల‌లో ప్రారంభించిన చొర‌వకు రెండు నెల‌ల లోప‌లే లైన్ మంత్రిత్వ శాఖ‌ల నుంచి భారీ స్థాయిలో ప్ర‌తిపాద‌న‌ల‌ను అందుకోవ‌డం ప‌ట్ల డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ సంతృప్తిని వ్య‌క్తం చేశారు. అంటే, నేడు ప్ర‌తి రంగం కూడా శాస్త్ర‌, సాంకేతిక‌త‌ల‌పై భారీగా ఉంద‌ని అవ‌గ‌మ‌వుతోంద‌ద‌ని ఆయ‌న అన్నారు. 
 ఏ శాస్త్రీయ అనువ‌ర్త‌నాన్ని ఏ రంగానికి వినియోగించాల‌నే విష‌యంపై భిన్న భార‌త మంత్రిత్వ శాఖ‌ల‌తో విడివిడిగా మేధోమ‌థ‌నం చేస్తున్న శాస్త్ర‌&సాంకేతిక‌, ఎర్త్ సైన్సెస్‌, అణు ఇంధ‌నం, అంత‌రిక్షం/ ఇస్రో, సిఎస్ఐఆర్‌, బ‌యోటెక్నాల‌జీ స‌హా అన్నిసైన్సు మంత్రిత్వ శాఖ‌ల ప్ర‌తినిధుల‌తో ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నెల మ‌ధ్య‌లో ఈ నూత‌న చొర‌వ‌ను డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. నిర్ధిష్ట మంత్రిత్వ శాఖ‌లు లేదా శాఖ‌ల ఆధారిత ప్రాజెక్టుల‌కు బ‌దులుగా స‌మ‌గ్ర ఇతివృత్త ఆధారిత ప్రాజెక్టుల అవ‌స‌రాన్ని మంత్రి నొక్కి చెప్పారు.
సైన్సు ప‌ట్ల స‌హ‌జ అభిమానం ఉండ‌ట‌మే కాకుండా శాస్త్ర‌, సాంకేతిక ఆధారిత చొర‌వ‌ల‌ను, ప్రాజెక్టుల‌కు మ‌ద్ద‌తునిచ్చి, ప్రోత్స‌హించ‌డంలో ముందుండే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఈ న‌వీన ఐడియాను సూచించార‌ని డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ చెప్పారు. 
మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ ఆదేశాల‌ను అనుస‌రించి భార‌త ప్ర‌భుత్వ ప్ర‌ధాన శాస్త్ర స‌ల‌హాదారు ప్రొఫెస‌ర్ కె. విజ‌య రాఘ‌వ‌న్ ఇప్పటివ‌ర‌కూ లైన్ డిపార్ట్‌మెంట్లు, శాస్త్ర‌, సాంకేతిక శాఖ‌ల‌తో జ‌రిగిన 13 స‌మావేశాల‌కు అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ స‌మావేశాలు గుర్తించిన ఐదు ఇతివృత్తాల‌తో జ‌రిగాయి. 
(1) ఇంధ‌న‌, ప‌ర్యావ‌ర‌ణ మార్పును ప‌రిమితం చేయ‌డం
(2) మౌలిక స‌దుపాయాలు, ప‌రిశ్ర‌మ‌లు
(3) వ్య‌వ‌సాయం, ఆహారం, పౌష్ఠిక‌త‌
(4) విద్య‌, నైపుణ్యాలు, సామాజిక సాధికార‌త‌
(5) ఆరోగ్యం
ప‌రిష్కార ఆధారిత ప‌రిశోధ‌న‌, ప్ర‌జా ప‌రిశోధ‌న & అభివృద్ధి వ్య‌వ‌స్థ‌, లైన్ మంత్రిత్వ శాఖ‌లు అందిచ‌డంలో స‌వాళ్ళ‌, ప‌రిశ్ర‌మ‌ల ఆర్థిక పోటీత‌త్వాన్ని మెరుగుప‌ర‌చ‌డం, పౌరుల‌కు ప్ర‌భుత్వ సేవ‌ల‌ను అందించ‌వ‌ల‌సిన అవ‌స‌రాన్ని స‌మావేశాలు నొక్కి చెప్పాయి. అలాగే,  శాస్త్ర‌, సాంకేతిక శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో ల‌క్ష్య ఆధారిత ప‌రిశోధ‌న‌కు త‌మ అవ‌స‌రాల‌ను, త‌మ ప‌రిశోధ‌న & అభివృద్ధి బ‌డ్జెట్ల‌ను గుర్తించ‌వ‌ల‌సిందిగా లైన్ మంత్రిత్వ శాఖ‌ల‌ను కోరారు. 
భార‌త ప్ర‌భుత్వ ప్ర‌ధాన శాస్త్రీయ స‌ల‌హాదారు ప్రొఫెస‌ర్ కె. విజ‌య‌రాఘ‌వ‌న్‌, డిజి, సిఎస్ఐఆర్ & డిఎస్ఐఆర్ కార్య‌ద‌ర్శి, శాస్త్ర సాంకేతిక శాఖ‌లు, ఎర్త్ సైన్సెస్‌, బ‌యోటెక్నాల‌జీ శాఖ కార్య‌ద‌ర్శులు, ఇత‌ర సీనియ‌ర్ శాస్త్ర‌వేత్త‌లు బుధ‌వారం స‌మావేశంలో పాల్గొన్నారు. ఇస్రో చైర్మ‌న్‌, అంత‌రిక్ష‌శాఖ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ కె. శివ‌న్‌, అణు ఇంధ‌న క‌మిష‌న్ చైర్మ‌న్ డాక్ట‌ర్ కె.ఎన్‌. వ్యాస్ ఈ స‌మావేశంలో దృశ్య మాధ్య‌మం ద్వారా పాలుపంచుకున్నారు. 


 (Release ID: 1770747) Visitor Counter : 76


Read this release in: English , Urdu , Hindi , Tamil