గనుల మంత్రిత్వ శాఖ

ఖనిజాల (అటామిక్ హైడ్రో కార్బన్స్, ఇంధన ఖనిజాలు కాకుండా) రాయితీ నియమాలు, 2021 నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం


కొత్త నియమాల ప్రకారం క్యాప్టివ్ లీజుల నుండి ఉత్పత్తి అయిన ఖనిజాలలో సగం అమ్ముకోవచ్చు.

ఓవర్‌బర్డెన్/వేస్ట్ రాక్‌ను సులభంగా పారవేయడాన్ని అనుమతిస్తుంది; మైనింగ్ లీజు ప్రాంతాన్ని పాక్షికంగా సరెండర్ చేయడానికి ఎప్పుడైనా అనుమతులు ఇస్తారు.

పెనాల్టీ నిబంధనలను హేతుబద్ధంగా మార్చారు. శిక్షలను తగ్గించారు.

Posted On: 09 NOV 2021 12:56PM by PIB Hyderabad

కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఖనిజాల (అటామిక్ హైడ్రో కార్బన్స్ ఇంధన ఖనిజాలు కాకుండా) రాయితీ (నాలుగో సవరణ) నియమాల, 2021ను మార్చింది. ఇందుకోసం ఖనిజాల (అటామిక్ హైడ్రో కార్బన్స్ ఎనర్జీ మినరల్ కాకుండా) రాయితీ నియమాలు, 2016 [ఎంసీఆర్], 2016ను సవరించింది.

 

ఎంఎండీఆర్ సవరణ చట్టం, 2021 ద్వారా గనులు, ఖనిజాల (అభివృద్ధి సవరణ) చట్టం, 1957 (ఎంఎండీఆర్ చట్టం)లో విస్తృతమైన సవరణలు చేశారు. 28.03.2021 నుంచి మైనింగ్ రంగంలో ఉపాధి, పెట్టుబడులను పెంచడం, రాష్ట్రాలకు ఆదాయాన్ని పెంచడం, గనుల ఉత్పత్తి సమయానుకూల కార్యాచరణను పెంచడం, ఖనిజ వనరుల అన్వేషణ, వేలం వేగాన్ని పెంచడం మొదలైన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఎంఎండీఆర్ చట్టం, ఎంసీఆర్, 2016లోని నియమాలను సవరించారు.

రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల సంఘాలు, మైనర్లు, ఇతర వాటాదారులు సాధారణ ప్రజలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత సవరణలు చేశారు. నిబంధనలలోని సవరణల ముఖ్యాంశాలు కింది విధంగా ఉన్నాయి:

 

(i) క్యాప్టివ్ లీజుల నుండి ఉత్పత్తి అయిన 50శాతం ఖనిజాలను విక్రయించేందుకు కొత్త నియమాలు అనుమతి ఇస్తాయి. ఈ సవరణతో, క్యాప్టివ్ గనుల మైనింగ్ సామర్థ్యాలను ఎక్కువగా వినియోగించుకోవడం ద్వారా మార్కెట్‌లోకి అదనపు ఖనిజాల లభ్యత పెంచేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. నిర్ణీత పరిమాణంలో ఖనిజాల అమ్మకానికి భత్యం కూడా లీజుదారులను క్యాప్టివ్ గనుల నుండి ఉత్పత్తిని పెంచడానికి ప్రేరేపిస్తుంది. అమ్మిన పరిమాణానికి సంబంధించి అదనపు ప్రీమియం మొత్తం, రాయల్టీ, ఇతర చట్టబద్ధమైన చెల్లింపుల వల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పెరుగుతుంది.

 

(ii) గనుల తవ్వకం లేదా శుద్ధీకరణ సమయంలో ఉత్పన్నమయ్యే ప్రాథమిక విలువ కంటే తక్కువ ఓవర్‌బర్డెన్/వేస్ట్ రాక్/ఖనిజాలును పారవేసేందుకు వీలుగా నిబంధనను చేర్చారు. దీనివల్ల మైనర్లు మరింత సులభంగా వ్యాపారం చేయడానికి వీలవుతుంది.

 

(iii) మైనింగ్ లీజు మంజూరు కోసం కనీస ప్రాంతం 5 హెక్టార్ల నుండి 4 హెక్టార్లకు సవరించడం జరిగింది. నిర్దిష్ట డిపాజిట్ల కోసం కనీసం 2 హెక్టార్లు ఉంటే చాలు.

 

(iv) అన్ని సందర్భాల్లోనూ మైనింగ్ లీజు ప్రాంతాన్ని పాక్షికంగా సరెండర్ చేయడానికి అనుమతి ఇస్తారు. ప్రస్తుతం, ఫారెస్ట్ క్లియరెన్స్ మంజూరు చేయని సందర్భంలో మాత్రమే పాక్షిక సరెండర్ అనుమతించడం జరుగుతుంది.

 

(v) అన్ని రకాల గనుల మిశ్రమ లైసెన్స్ లేదా మైనింగ్ లీజు బదిలీని అనుమతించడానికి నియమాలను మార్చారు.

 

(vi) లీజుదారు లేదా లైసెన్స్‌దారు మరణం తరువాత చట్టపరమైన వారసులకు అనుకూలంగా ఎంఎల్/సీఎల్ మ్యుటేషన్‌ను అందించడానికి కొత్త నియమాలను చేర్చారు.

 

(vii) ఆలస్యంగా చెల్లించే మొత్తాలపై వడ్డీని ప్రస్తుతం ఉన్న 24శాతం నుండి 12శాతానికి తగ్గించారు.

 

(viii) ప్రభుత్వ కంపెనీలకు మంజూరు చేసిన మైనింగ్ లీజు కాలానికి చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన నియమాలను ఎంసీఆర్, 2016లో చేర్చారు.

 

(ix) జరిమానా నిబంధనలను కూడా హేతుబద్ధీకరించారు. గతంలో, నిబంధనలు ఉల్లంఘన తీవ్రతతో సంబంధం లేకుండా ప్రతి నియమాన్ని ఉల్లంఘించినందుకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 5 లక్షల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ ఉండేవి. కొత్త నిబంధనల ఉల్లంఘనలకు శిక్షలను వర్గీకరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

 

ప్రధాన ఉల్లంఘనలు: జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ ఉంటాయి.

చిన్న ఉల్లంఘనలు: జరిమానా తగ్గించడం జరిగింది. ఇటువంటి ఉల్లంఘనలకు మాత్రమే జరిమానా విధించడం జరుగుతుంది.

ఇతర నిబంధనలను ఉల్లంఘించడాన్ని నేరంగా చూడరు.

ఈ నియమాలు రాయితీ హోల్డర్ లేదా మరే ఇతర వ్యక్తులకు ఎటువంటి ముఖ్యమైన బాధ్యతలను ఇవ్వలేదు. తద్వారా 49 నిబంధనల ఉల్లంఘన నేరంగా పరిగణించడం ఉండదు.

పైన పేర్కొన్న సవరణలతో పాటు, ఖనిజాలు (కాప్టివ్ పర్పస్ కోసం వేలం వేసినవి లేదా మంజూరు అయిన మైనింగ్ లీజుల బదిలీ) రూల్స్, 2016 మినరల్ (ప్రభుత్వ కంపెనీ ద్వారా మైనింగ్), రూల్స్, 2015 అనే రెండు నియమాలను రద్దు చేస్తూ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఎంఎండీఆర్ చట్టం ఎంసీఆర్, 2016లో పై సవరణల దృష్ట్యా నియమాలు రద్దు అవుతాయి.

గనుల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ (www.mines.gov.in)లో సవరణ నిబంధన నోటిఫికేషన్ అందుబాటులో ఉంది.



(Release ID: 1770498) Visitor Counter : 206