జాతీయ ఆర్థిక నివేదన ప్రాధికార సంస్థ
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎంఎస్ఎంసిలు)కు చట్టబద్ధ తనిఖీ, తనిఖీ ప్రమాణాల (స్టాట్యూటరీ ఆడిట్ అండ్ ఆడిటింగ్ స్టాండర్డ్స్)పై సమాలోచన పత్రం (కన్సల్టేషన్ పేపర్)పై అభిప్రాయాలను, వ్యాఖ్యలను సమర్పించేందుకు ఆఖరి తేదీ 10 నవంబర్ నుంచి 30 నవంబర్ 2021 వరకు పొడిగింపు
Posted On:
09 NOV 2021 7:18PM by PIB Hyderabad
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎంఎస్ఎంసిలు)కు చట్టబద్ధ తనిఖీ, తనిఖీ ప్రమాణాల (స్టాట్యూటరీ ఆడిట్ అండ్ ఆడిటింగ్ స్టాండర్డ్స్)పై సమాలోచన పత్రం (కన్సల్టేషన్ పేపర్)పై అభిప్రాయాలను, వ్యాఖ్యలను సమర్పించేందుకు ఆఖరి తేదీని 10 నవంబర్ నుంచి 30 నవంబర్ 2021 వరకు పొడిగించారు.
సమాలోచన పత్రాన్ని దిగువన పేర్కొన్న లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చుః
https://nfra.gov.in/sites/default/files/NFRAConsultationPaperMSMCs_0.pdf
తమ వ్యాఖ్యలను, అభిప్రాయాలను కామెంట్స్ -టిఎసి.పేపర్ @ఇన్ఫ్రా.జిఒవి.ఇన్ (comments-tac.paper@nfra.gov.in) అన్న ఇ-మెయిల్ ఐడికి కానీ లేదా ఎన్ఎఫ్ఆర్ఎకు దిగువన ఇచ్చిన చిరునామాకు పోస్టు కానీ చేయవచ్చు.
ది సెక్రెటరీ
నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ
7-8 ఫ్లోర్, హిందుస్తాన్ టైమ్స్ హౌజ్, 18-20,
కస్తూరిబా మార్గ్, న్యూఢిల్లీ 110001
ఎన్ఎఫ్ఆర్ఎ గురించి
నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఎ లేదా అథారిటీ)ని అక్టోబర్ 2018లో భారతదేశంలో ఆడిటింగ్, అకౌంటింగ్‌కు స్వతంత్ర రెగ్యులేటర్ గా ఏర్పాటు చేశారు. నిష్పాక్షికతకు, సమగ్రతకు, న్యాయబద్ధతకు, స్వేచ్ఛకు, నిజాయితీకి, పారదర్శకతకు తార్కాణంగా నిలిచే సంస్థ అని ఎన్ఎఫ్ఆర్ఎ శాసనపత్రం (చార్టర్) పేర్కొంటుంది. ఏదైనా సూచనలు చేసేటప్పుడు, వ్యాపారం చేయడం సులభతరం చేయడంపై ఈ సూచనలు ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయోనన్న విషయాలను దృష్టిలో ఉంచుకుని వాటిని చేసే ప్రయత్నం చేస్తుంది. కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 132(2)(ఎ) ప్రకారం కంపెనీలు, లేదా కంపెనీల శ్రేణి లేదా వారి ఆడిటర్లు అనుసరించడానికి అకౌంటింగ్, ఆడిటింగ్ విధానాలు, ప్రమాణాలను రూపొందించడం, నిర్దేశించడం కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఎఫ్ఆర్ఎ సిఫార్సులు చేయాల్సి ఉంటుంది.
***
(Release ID: 1770413)
Visitor Counter : 169