ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 06 NOV 2021 9:04AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 107.92 కోట్ల డోసులను అందించారు.

గత 24 గంటల్లో 10,929 కొత్త కేసులు నమోదయ్యాయి.

రికవరీ రేటు 98.23% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 12,509 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,37,37,468 కు పెరిగింది.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.43% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,46,950. ఇది 255 రోజుల కనిష్ట స్థాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.35%) గత 33 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (1.27%) గత 43 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 61.39 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

****



(Release ID: 1769685) Visitor Counter : 116