ఆర్థిక మంత్రిత్వ శాఖ
కర్ణాటకలో ఆదాయం పన్ను శాఖ దాడులు
Posted On:
03 NOV 2021 11:27AM by PIB Hyderabad
రహదారుల నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టుల రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక ప్రముఖ సంస్థ పై ఆదాయం పన్ను శాఖ అధికారులు 28.10.2021న దాడులు చేసి సోదాలు నిర్వహించారు. ఉత్తర కర్ణాటక వివిధ ప్రాంతాలలో ఈ దాడులు, సోదాలు జరిగాయి.
ముడి పదార్ధాల కొనుగోలు, కూలీల ఖర్చులు, సబ్ కాంట్రాక్టర్‌లకు చెల్లింపుల రూపంలో సంస్థ తప్పుడు లెక్కలను చూపుతూ లాభాలను తగ్గించి సంస్థ చూపుతున్నదని అధికారులు గుర్తించారు.
ఈ లెక్కల వాస్తవ విలువకు చూపే పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ రూపంలో ఉన్న ఈ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించిన అధికారులు సంస్థకు చెందిన ఒక ముఖ్య వ్వక్తికి సదరు ముడి పదార్థాలు సరఫరా చేసిన సంస్థలు / వ్యక్తులు నగదు చెల్లింపులు చేసినట్టు గుర్తించారు. ఈ మొత్తాన్ని సంస్థ లెక్కల్లో చూపలేదు. స్వంత బంధువులు/స్నేహితులు/ఉద్యోగులనే సబ్‌కాంట్రాక్టర్ల పేరుతో సంస్థ ఉపయోగించుకుంది. వారు ఏ పనిని అమలు చేయలేదని లేదా ఆ పనిని అమలు చేయగల సామర్థ్యం/కలిగి లేరని కూడా అధికారులు గుర్తించారు . ఈ లావాదేవీల ద్వారా సదరు సంస్థ లెక్కలు లేని నగదును ఆర్జిస్తోంది. సోదాలు, దాడుల్లో లెక్కలు చూపని 70 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించినట్లు అధికారులు గుర్తించారు. దీనిని సదరు సంస్థ కూడా అంగీకరించింది. అధికారులు కేసులో తదుపరి విచారణ సాగిస్తున్నారు.
***
(Release ID: 1769183)
Visitor Counter : 150