మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

కోవిడ్ త‌ద‌నంత‌రం విద్యా సంస్థ‌ల‌లో సాధార‌ణ ప‌రిస్థితుల‌ను, చైత‌న్యాన్ని పున‌రుద్ధ‌రించాల‌ని పిలుపిచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌


దేశ‌వ్యాప్తంగా ఉన్న పాఠ‌శాల‌ల‌ను తిరిగి తెర‌వ‌డం, ఉపాధ్యాయుల టీకాక‌ర‌ణ స్థితిగ‌తుల‌ను స‌మీక్షించిన ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌

దేశ‌వ్యాప్తంగా 92% శాతం పాఠ‌శాల ఉపాధ్యాయుల‌కు టీకాక‌ర‌ణ పూర్తి

Posted On: 02 NOV 2021 5:14PM by PIB Hyderabad

దేశ‌వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, ముఖ్యంగా బ‌డుల‌కు హాజ‌ర‌వుతున్న‌వారి టీకాక‌ర‌ణ ప‌రిస్థితిని కేంద్ర విద్యామంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ మంగ‌ళ‌వారం స‌మీక్షించారు. ఆయ‌న నైపుణ్యాల‌కు సంబంధించిన వ్య‌వ‌స్థ‌లో (స్కిల్లింగ్ ఈకో సిస్టం)లో టీకాక‌ర‌ణ స్థితిని కూడా స‌మీక్షించారు. ఈ స‌మావేశంలో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్, వ్య‌వ‌స్థాప‌క‌త‌ శాఖ స‌హాయ మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్‌, విద్యాశాఖ స‌హాయ మంత్రి రాజ్‌కుమార్ రంజ‌న్ సింగ్ కూడా పాల్గొన్నారు. 
బోధ‌నా సిబ్బంది, బోధ‌నేత‌ర సిబ్బంది టీకార‌ణ‌ను మంత్రి ప్ర‌ధాన్ నిత్యం ప‌ర్య‌వేక్షిస్తూ, పాఠ‌శాల‌లు తిరిగి తెరుచుకునే ప‌రిస్థితి క‌ల్పించే దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దేశంలో ప్ర‌స్తుతం టీకాక‌ర‌ణ వేగంగా జ‌రుగుతున్న నేప‌థ్యంలో విద్యా సంస్థ‌ల‌లో సాధార‌ణ ప‌రిస్థితులు,చైత‌న్యం పున‌రుద్ధ‌రించాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న నొక్కి చెప్పారు. 
ఇప్ప‌టికే మెజారిటీ రాష్ట్రాలు అన్ని త‌ర‌గ‌తుల‌కు పాఠ‌శాల‌ల‌ను తెరిచాయి. దాదాపుగా 92%పైగా బోధ‌నా సిబ్బందికి టీకాక‌ర‌ణ పూర్తైంది. కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్న‌సంస్థ‌ల‌లో 96% బోధ‌నా సిబ్బందికి టీకాక‌ర‌ణ పూర్తి అయింది. 

 

School_Re_opening_Status (2).png

***
 



(Release ID: 1769052) Visitor Counter : 141