రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

‘మేక్ ఇన్ ఇండియా’ కింద సాయుధ దళాల ఆధునీకరణకు రూ.7,965 కోట్ల విలువైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్

Posted On: 02 NOV 2021 1:55PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:
- హెచ్ఏఎల్ నుండి 12 లైట్ యుటిలిటీ హెలికాప్టర్ల సేకరణకు ఆమోదం
- నావికా ద‌ళానికి చెందిన యుద్ధ నౌక‌ల గుర్తింపు ట్రాకింగ్, ఎంగేజ్‌మెంట్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి బీఈఎల్ సంస్థ  నుండి లింక్స్ యు2  ఫైర్ కంట్రోల్ సిస్టమ్ సేక‌ర‌ణ‌
- తీర ప్రాంత నిఘా నావికా దళ సామర్థ్యాన్ని పెంచడానికి హెచ్ఏఎల్‌ నుండి డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ యొక్క మిడ్ లైఫ్ అప్‌గ్రేడేషన్‌కు‌ ఆమోదం
- నౌకాదళ తుపాకుల గ్లోబల్ ప్రొక్యూర్‌మెంట్కు; బెహెచ్ఈ ఎల్‌ సంస్థ‌చే తయారు చేయబడిన అప్‌గ్రేడ్ చేయబడిన షార్ట్ రేంజ్ గన్ మౌంట్ బీయింగ్‌కు తుపాకుల పరిమాణం జోడించడం


రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన నవంబర్ 02, 2021న జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ), సాయుధ బలగాల ఆధునీకరణ మరియు కార్యాచరణ అవసరాల కోసం కావాల్సిన  రూ.7,965 కోట్ల విలువైన అవ‌శ్య‌క‌త ప్రతిపాద‌న‌ల‌కు (ఏఓఎన్‌) ఆమోదం తెలిపింది. ఇవ‌న్నీ మూలధన సేకరణ ప్రతిపాదనలే. ఈ ప్రతిపాదనలన్నీ (100%) భారతదేశంలోనే రూపొందించ‌డం,  , అభివృద్ధి చేయ‌డం, తయారు చేయ‌డంపై దృష్టి సారిస్తూ  ‘మేక్ ఇన్ ఇండియా’ కింద చేప‌ట్టిన‌వే.

దేశీయ వనరుల నుండి సేకరణ కింత డీఏసీ అనుమ‌తుల‌ను అందజేసిన వాటిలో.. హెచ్ఏఎల్ నుండి 12 లైట్ యుటిలిటీ హెలికాప్టర్ల సేకరణ,  నావికా ద‌ళానికి చెందిన యుద్ధ నౌక‌ల గుర్తింపు ట్రాకింగ్, ఎంగేజ్‌మెంట్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి బీఈఎల్ సంస్థ  నుండి లింక్స్ యు2  ఫైర్ కంట్రోల్ సిస్టమ్ సేక‌ర‌ణ‌. సముద్ర నిఘా మరియు తీరప్రాంత నిఘా యొక్క నౌకాదళ సామర్థ్యాన్ని పెంచడానికి హెచ్ఏఎల్‌ నుండి సేక‌రించిన డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ యొక్క మిడ్ లైఫ్ అప్‌గ్రేడేషన్ వ్య‌వ‌స్థ ఏర్పాటు.  'ఆత్మనిర్భర్ భారత్'కు మరింత ప్రోత్సాహకరంగా ఉండేలా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) తయారు చేస్తున్న ఆధునిక‌ సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ (ఎస్‌ఆర్‌జీఎం)కి ఈ తుపాకుల పరిమాణాన్ని జోడించడం వంటి అంశాలకు అనుమ‌తులు ల‌భించాయి.

ఈ ఎస్ఆర్‌జీఎం గైడెడ్ మందుగుండు సామగ్రి & రేంజ్ ఎక్స్‌టెన్షన్‌లను ఉపయోగించి వేగవంతమైన యుక్తి లక్ష్యాలను నిమగ్నం చేసే సముచిత సామర్థ్యాలను అందిస్తాయి. ఇవి భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌకలలో అమర్చబడతాయి.(Release ID: 1768943) Visitor Counter : 88