మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పాఠశాలల కోసం భాషా సంగం కార్యక్రమం, భాషా సంగం మొబైల్ యాప్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మొబైల్ క్విజ్ ప్రారంభించిన కేంద్ర విద్యా మంత్రి


ఫార్మల్ క్రెడిట్ల సంపాదన విధానం ద్వారా భాషా అభ్యాసాన్ని నైపుణ్యంగా ప్రోత్సహించాలి: - ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 01 NOV 2021 5:37PM by PIB Hyderabad

రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను పురస్కరించుకుని పాఠశాలల కోసం భాషా సంగం కార్యక్రమాన్ని, భాషా సంగం మొబైల్ యాప్ను,   ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ క్విజ్ యాప్‌లను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర విద్య,   నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, ఫార్మల్ క్రెడిట్ల సంపాదన విధానంతో భాషా అభ్యాసాన్ని నైపుణ్యంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.  సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 న రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను జరుపుకుంటారు.

‘జాతీయ విద్యా విధానం 2020’ భారతీయ భాషలను  ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుందని  ప్రధాన్ పేర్కొన్నారు. ఫార్మల్ క్రెడిట్ సంపాదన విధానంతో భాషా అభ్యాసాన్ని నైపుణ్యంగా ప్రచారం చేయాలని అన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను దేశం ఘనంగా జరుపుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ రోజు ప్రారంభించిన కార్యక్రమాలు మన దేశంలోని భాషా వైవిధ్యాన్ని స్వీకరించడానికి ఉపయోగపడతాయని చెప్పారు.  మన సంస్కృతి, వారసత్వం,  వైవిధ్యం,  గొప్పతనాన్ని గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి మన విద్యార్థులకు దోహదపడతాయని ఆయన అన్నారు.

భాషా సంగం... 22 భారతీయ భాషలలో రోజువారీ వాడుకను,   ప్రాథమిక వాక్యాలను బోధించడానికి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన  కార్యక్రమం. ప్రజలు తమ మాతృభాష కాకుండా ఇతర భారతీయ భాషల్లో ప్రాథమిక సంభాషణ నైపుణ్యాలను పొందాలనే ఆలోచనే ఇందుకు ప్రేరణ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా కనీసం 75 లక్షల మంది ఈ నైపుణ్యాన్ని పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నామని విద్యాశాఖ ప్రకటించింది.

 

  భాషా సంగమం కింద నేడు ప్రారంభించిన కార్యక్రమాలు:

---–పాఠశాల విద్యార్థుల కోసం దీని దీక్ష, ఈ–పాఠశాల, 22 బుక్‌లెట్ల ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చారు.

–మల్టీభాషీ అనే స్టార్టప్ ద్వారా మై గవర్నమెంట్సహకారంతో భాషా సంగం మొబైల్ యాప్ను అభివృద్ధి చేశారు.

–ఈ మంత్రిత్వ శాఖ  ఇన్నోవేషన్ సెల్ తోపాటు నజారా టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన ఈ క్విజ్ యాప్లో  భారతదేశంలోని రాష్ట్రాలకు సంబంధించిన 10 వేల ప్రశ్నలు ఉంటాయి.

 

పాఠశాలలకు భాషా సంగం కార్యక్రమం

–దీనిని ఎన్సీఈఆర్టీ అభివృద్ధి చేసింది

–పాఠశాల విద్యార్థులు భారతీయ భాషలో, దేవనాగరి లిపిలో, రోమన్ లిపిలో,   హిందీ,  ఆంగ్లంలోకి అనువాదాలు చదవగలిగే విధంగా 22 షెడ్యూల్డ్ భాషలలో 100 వాక్యాలు ప్రదర్శిస్తారు.

–100 వాక్యాలను భారతీయ సంకేత భాషతో ఆడియో,  వీడియో రూపంలో అందించారు.

–భాషా సంగం కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులు అన్ని భాషలు -వాటి లిపిలు, ఉచ్చారణ గురించి తెలుసుకుంటారు.

–దీక్ష, ఈ–పాఠశాల, 22 బుక్‌లెట్ల ద్వారా భాషా సంగం అందుబాటులో ఉంది

 

 భాషా సంగం మొబైల్ యాప్

–ఇది మై గవర్నమెంట్సహకారంతో డీఓహెచ్ఈ మొదలుపెట్టిన కార్యక్రమం

–యాప్‌ను మల్టీభాషి స్టార్టప్ అభివృద్ధి చేసింది.  పోటీ ద్వారా దీనిని  మై గవ్ఎంపిక చేసింది

–మొదట్లో ఈ యాప్‌లో 22 భారతీయ భాషల్లో ప్రతిరోజూ 100 వాక్యాలు కనిపిస్తాయి. ఇవన్నీ రోమన్ లిపితోపాటు  ఇచ్చిన భాషల్లోనూ ఉంటాయి.  ఆడియో ఫార్మాట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వాక్యాలను త్వరలోనే చేర్చుతారు.

–విద్యార్థి పరీక్షల ఆధారంగా దశలవారీగా ముందుకు వెళతాడు. చివరగా వివరణాత్మక పరీక్ష కూడా ఉంటుంది. ఇది పూర్తయితే డిజిటల్ సర్టిఫికెట్ అందుకుంటాడు.

–ఈ యాప్ అండ్రాయిడ్, ఐఓఎస్..రెండింటిలోనూ అందుబాటులో ఉంది

 

 ఈబీఎస్బీ క్విజ్ యాప్

–ఈబీఎస్బీ క్విజ్ గేమ్ మన విభిన్న ప్రాంతాలు, రాష్ట్రాలు, సంస్కృతి, జాతీయ నాయకులు, స్మారక చిహ్నాలు, సంప్రదాయాలు, పర్యాటక ప్రదేశాలు, భాషలు, భౌగోళికం, చరిత్ర, స్థలాకృతి గురించి మరింత తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనదేశంలో చిన్నారులను,   యువకులను లక్ష్యంగా చేసుకొని దీనిని తయారు చేశారు.

–ఈ క్విజ్‌లో భాగంగా ఇందులో ఇప్పటికే 10,000 కంటే ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి. ఆటలు  ఆడటం సులభం. - క్విజ్‌లు ఆడొచ్చు. నేర్చుకోవచ్చు. గ్రేడ్‌లను సాధించవచ్చు. అంతేకాకుండా, ఈ క్విజ్ 15 విభిన్న స్థాయిల కఠినత్వాన్ని కలిగి ఉంటుంది.

–ప్రస్తుతం, ఈబీఎస్బీ క్విజ్ అండ్రాయిడ్ ఓఎస్లో అందుబాటులో ఉంది, ఐఓఎస్ వెర్షన్ త్వరలో అందుబాటులోకి వస్తుంది.

–ఈ గేమ్ ప్రస్తుతం ఇంగ్లీష్,   హిందీలో అందుబాటులో ఉంది. తదుపరి 3 నెలల్లో ఈబీఎస్బీ క్విజ్ 12 ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది.

  –కేంద్ర విద్యశాఖ  సహాయమంత్రి ఆర్ఆర్ సింగ్,  డీఓఎస్ఈఎల్ కార్యదర్శి అనితా కర్వాల్,  హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ  సంజయ్ మూర్తి,  అభిషేక్ సింగ్, మైగవ్ సీఈఓ,  పాఠశాలల,  విశ్వవిద్యాలయాల విద్యార్థులు,  ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


(Release ID: 1768848) Visitor Counter : 202