పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కాన్పూర్ - బెంగళూరు మధ్య ఇండిగో విమానాన్ని ప్రారంభించిన జ్యోతిరాదిత్య ఎం. సింథియా
కాన్పూర్ నుంచి విమానాల రాకపోకలు వారానికి 20 నుంచి 41కి పెరుగుతుంది
ఉడాన్ పథకం పౌర విమానయాన రంగ ప్రజాస్వామీకరణకు దారి తీసి, సామాన్య పౌరుడు కూడా విమాన ప్రయాణాన్ని సాధ్యం చేసిందన్న మంత్రి
Posted On:
01 NOV 2021 2:52PM by PIB Hyderabad
కాన్పూర్- బెంగళూరు మధ్య ఇండిగో విమానాన్ని కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింథియా సోమవారం ప్రారంభించారు. కాన్పూర్ - ముంబై & హైదరాబాద్‌ల మధ్య విమానాలు నేడు ప్రారంభం అయ్యాయి. దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి, ఉత్తర్‌ప్రదేశ్ పౌర విమాన శాఖ మంత్రి నంద్ గోపాల్ గుప్తా (నంది), పారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రి సతీష్ మహానా, పార్లమెంటు సభ్యులు సత్యదేవ్ పచౌరీ, దేవేంద్ర సింగ్ భోలేవేరే కూడా పాల్గొన్నారు. యుపి ప్రభుత్వ పౌర విమాన శాఖ అధికారులు, ఇండిగో సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కొత్త మార్గం కాన్పూర్ నుంచి, వరకు అనుసంధానతను పెంచడమే కాక నగరాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, టూరిజాన్ని పెంచుతుందని ఈ సందర్భంగా ప్రసంగించిన సింధియా పేర్కొన్నారు. దేశంలో కాన్పూర్ ముఖ్య పారిశ్రామిక కేంద్రం కావడమే కాక, ఆ ప్రాంతానికి చారిత్రిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని తెలిపారు. 1857లో భారత స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించిందన్నారు. జౌళి, తోలు పరిశ్రమల కారణంగా కాన్పూర్‌ను మాన్‌ఛెస్టర్ ఆఫ్ ఈస్ట్ అని పిలిచేవారని చెప్పారు. మూడు ప్రధాన నగరాలతో అనుసంధానత కలిగి ఉండడంతో అక్కడి నుంచి వారానికి తిరిగే విమానాల రాకపోకలు 20 నుంచి 42కి పెరుగుతుందన్నారు. ఇది పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు ప్రేరణను ఇవ్వడమే కాక ఉపాధిని కల్పిస్తుందని వివరించారు. పౌర విమానయాన మౌలిక సదుపాయాల విషయానికి వస్తే, కాన్పూర్ నగరంలో నూతన టెర్మినల్ నిర్ణీత సమయంలో, రూ. 106 కోట్ల వ్యయంతో త్వరలోనే సిద్దం అవుతుందని ఆయన చెప్పారు.
ప్రధానమంత్రి చారిత్రిక, దూరదృష్టి విధానం ఉడాన్ పథక ప్రారంభానికి దారి తీసిందని, ఇది సామాన్య పౌరుడు కూడా విమాన యానం చేసే అవకాశం కల్పించడమే కాక రంగాన్ని ప్రజాస్వామీకరణకు దారి తీసిందని మంత్రి అన్నారు. విమాన ఛార్జీలు తగినంతగా తగ్గాయని, దూర ప్రాంత రైలు టిక్కెట్లకన్నా విమాన టికెట్లే ఇప్పుడు తగ్గాయని ఆయన అన్నారు. ఈ పథకం కింద 100 నూతన విమానాశ్రయాలను నిర్మించి, 1000 నూతన మార్గాలు ప్రారంభమవుతాయన్నారు.
దేశంలో ఇంతకు ముందు 75 విమానాశ్రయాలు ఉండగా, గత ఏడేళ్ళల్లో 62 విమానాశ్రయాలు కొత్తగా జతయ్యాయని సింథియా తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్ విషయానికి వస్తే, రెండు కార్యకలాపాలు సాగించే విమానాశ్రయాలు రాష్ట్రాలు ఉండగా, ఇప్పుడు 80 గమ్యాలకు చేర్చేలా దాని సంఖ్య 9 కి పెరిగిందని, వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రంలో కార్యకలాపాలు సాగించే విమానాశ్రయాల సంఖ్య 15కి పెరుగుతుందని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్‌లో కేవలం రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని, ఇటీవలే కుశీనగర్‌లో మూడవది ప్రారంభమైందని, అయోధ్య, జెవార్‌లలో మరొక రెండు ప్రారంభమవుతాయని తెలిపారు.
(Release ID: 1768844)
Visitor Counter : 129