ఆర్థిక మంత్రిత్వ శాఖ
మేఘాలయలో ఆరోగ్య రంగానికి చెందిన వ్యవస్థల పటిష్టతకు భారత్-ప్రపంచ బ్యాంకు మధ్య ఒప్పందం
Posted On:
01 NOV 2021 12:17PM by PIB Hyderabad
ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో అభివృద్ధికి మరింత ఊతం ఇయ్యడానికి కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, మేఘాలయ ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ 40 మిలియన్ డాలర్ల ఆరోగ్య ప్రాజెక్ట్‌పై 28 అక్టోబర్ 2021న సంతకం చేశాయి. ఈ ప్రాజెక్ట్ ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలాగే కోవిడ్‌తో సహా భవిష్యత్తులో ఆరోగ్య అత్యవసర పరిస్థితులను నిర్వహించగల రాష్ట్ర సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది.
'మేఘాలయ ఆరోగ్య వ్యవస్థల పటిష్ఠత ప్రాజెక్ట్' రాష్ట్రం, దాని ఆరోగ్య సౌకర్యాల నిర్వహణ, పాలనా సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది; రాష్ట్ర ఆరోగ్య బీమా కార్యక్రమం రూపకల్పన, కవరేజీని విస్తరించడం; ధృవీకరణ మరియు మెరుగైన మానవ వనరుల వ్యవస్థల ద్వారా ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడం; మందులు మరియు రోగనిర్ధారణలకు సేవలు అందుబాటులో ఉండడాన్ని ఈ ప్రాజెక్ట్ తగు అవకాశాలను కల్పిస్తుంది.
రాష్ట్రంలోని మొత్తం 11 జిల్లాలు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందుతాయి. ఇది వారి ప్రణాళిక మరియు నిర్వహణ సామర్థ్యాలను బలోపేతం చేయడం మరియు వారి వైద్య నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ప్రాథమిక, ద్వితీయ స్థాయిలలో ఆరోగ్య రంగ సిబ్బందికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్ట్ మహిళలు కమ్యూనిటీ స్థాయిలో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగ్గా ఉపయోగించుకునేలా చేస్తుంది.
“ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం, విస్తరించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో ఆరోగ్య సేవల నిర్వహణ, నాణ్యతను పెంచుతుంది. ఇది ఆరోగ్య సేవల కవరేజీని విస్తరించడంలో సహాయపడుతుంది, రాష్ట్రంలోని పేద, బలహీన వర్గాలకు అందుబాటులో ఉండేలా చేస్తుంది" అని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల శాఖ పేర్కొంది
ఈ ఒప్పందంపై భారత ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ మిశ్రా సంతకం చేశారు; మేఘాలయ ప్రభుత్వం తరపున ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ రామ్‌కుమార్ ఎస్, భారతదేశం కంట్రీ డైరెక్టర్ జునైద్ అహ్మద్, ప్రపంచ బ్యాంకు తరపున సంతకం చేశారు.
ప్రస్తుతం 56% కుటుంబాలను కవర్ చేసే మేఘా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఎంహెచ్ఐఎస్)గా పిలవబడే మేఘాలయ ఆరోగ్య బీమా కార్యక్రమం ప్రభావాన్ని బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుంది. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజెఏవై)లో విలీనం చేయడంతో, ఎంహెచ్ఐఎస్ ఇప్పుడు మరింత సమగ్రమైన ప్యాకేజీని అందించాలని మరియు 100% కుటుంబాలను కవర్ చేయాలని యోచిస్తోంది. ఇది ఆసుపత్రి సేవలను పొందడంలో అడ్డంకులను తగ్గిస్తుంది మరియు పేద కుటుంబాలకు ఖర్చు లేకుండా సంక్షోభం నుండి నివారిస్తుంది.
మెరుగైన ఆరోగ్య సేవలు బయో-మెడికల్ వ్యర్థాల పెరుగుదలకు కూడా దారితీయవచ్చు. బయో-మెడికల్ వ్యర్థాలు మరియు ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇ-వ్యర్థాలు వంటి ఇతర ప్రమాదకర వ్యర్థాలతో సహా వ్యర్థాల ఏదైనా అక్రమ నిర్వహణ పర్యావరణ ప్రమాదాలను కలిగిస్తుంది. బయో-మెడికల్ వ్యర్థ నిర్వహణ (ఘన మరియు ద్రవ వ్యర్థాలు రెండూ) కోసం మొత్తం పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడంలో ప్రాజెక్ట్ పెట్టుబడి పెడుతుంది.
***
(Release ID: 1768498)
Visitor Counter : 218