ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎంఓఐఎల్‌ కార్మికుల వేతన సవరణను ప్రకటించారు

Posted On: 31 OCT 2021 3:56PM by PIB Hyderabad

ఎంఓఐఎల్‌  కార్మికుల వేతన సవరణకు ఆమోదం తెలుపుతూ గౌరవనీయులైన రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మరియు గౌరవనీయులైన ఉక్కు మంత్రి శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్‌లు  31 అక్టోబర్, 2021న నాగ్‌పూర్‌లో నిర్వహించిన ప్రముఖ కార్యక్రమంలో ప్రకటించారు.

 

ఈ వేతన సవరణ 01.08.2017 నుండి 31.07.2027 వరకు 10 సంవత్సరాల కాలవ్యవధి కోసం ప్రకటించబడింది. దాదాపు 5,800 మంది కంపెనీ ఉద్యోగులకు ఈ ప్రకటన ప్రయోజనం లబ్దిచేకూరుస్తుంది. ఇది ఎంఓఐఎల్‌  అంటే మొయిల్‌ కమ్‌గర్ సంఘటన్ (ఎంకేఎస్‌) నిర్వహణ మరియు గుర్తింపు పొందిన యూనియన్ మధ్య కుదిరిన ఎంఓయూ ఆధారంగా రూపొందించబడింది. ప్రతిపాదనలో 20% ఫిట్‌మెంట్ ప్రయోజనం మరియు 20% చొప్పున పెర్క్‌లు/అలవెన్సులు ఉన్నాయి. మధ్యంతర ఉపశమనం @ 12% బేసిక్ మరియు డిఎ మే, 2019 నుండి కంపెనీ అందించింది.

 

మొండి బకాయిలను ఒకేసారి చెల్లిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీని వల్ల ఆర్థికంగా రూ. 218 కోట్లు బకాయి ఉన్న కాలానికి అంటే ఆగస్టు 1, 2017 నుండి 30 సెప్టెంబర్, 2021 వరకు ఇది వర్తిస్తుంది. ప్రతిపాదిత వేతన సవరణ యొక్క మొత్తం ఆర్థిక ప్రభావం సంవత్సరానికి రూ.87 కోట్లుగా ఉంటుంది. మొయిల్‌ లిమిటెడ్‌ ఇప్పటికే ఖాతాల పుస్తకాల్లో ఈ వేతన పెంపునకు సంబంధించి పూర్తి కేటాయింపులు చేసింది.

 

అదనంగా, 2020-21 సంవత్సరానికి ఉద్యోగులందరికీ ప్రొడక్షన్ లింక్డ్ బోనస్ @ రూ. 28,000/- దీపావళికి ముందు చెల్లించబడుతుంది.

 

గౌరవనీయ మంత్రులు మొయిల్‌కు చెందిన పలు సౌకర్యాలను కూడా ప్రారంభించారు. చిక్లా మైన్‌లో రెండవ నిలువు షాఫ్ట్, ఐదు గనుల స్థానాల్లో ఆసుపత్రులు, అడ్మినిస్ట్రేటివ్ భవనం మరియు మైన్స్‌ వద్ద గ్రాడ్యుయేట్ ట్రైనీ హాస్టల్‌లు వాటిలో ఉన్నాయి.

 

ఈ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే,  కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి, క్రీడలు & యువజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి, శ్రీ సునీల్ కేదార్, పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ వికాస్ మహాత్మేతో పాటు ఎంఎస్‌ శుకృతి ఏఎస్‌&ఎఫ్‌ఏ, ఎంఓఎస్‌ మరియు ఎంఎస్‌ రుచిక గోవి, జెఎస్‌,ఎంఓఎస్‌లు పాల్గొన్నారు.

 

ప్రముఖుల మాటలు వినడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఉద్యోగులు మరియు వివిధ యూనియన్ సభ్యులు ఈ ప్రకటనలతో సంతోషించారు మరియు ఉక్కు మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా, గౌరవనీయులైన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ ఆర్‌సిపి సింగ్..మొయిల్‌ స్థిరమైన పనితీరుకు అభినందనలు తెలిపారు మరియు భవిష్యత్తులో పెద్ద మైలురాళ్లను సాధించేందుకు సన్నద్ధం కావాలని వారిని ప్రోత్సహించారు.

 

గౌరవనీయమైన ఉక్కు మంత్రి నవంబర్ 1, 2021న బాలాఘాట్ గనిని కూడా సందర్శిస్తారు. ఇది మొయిల్‌ ద్వారా నిర్వహించబడుతున్న అతిపెద్ద మాంగనీస్ గని మరియు ఆసియాలో అత్యంత లోతైన భూగర్భ మాంగనీస్ గని.


మొయిల్‌ గురించి: మొయిల్‌ లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ యొక్క అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణలో ఉండే షెడ్యూల్-ఏ, మినీరత్న కేటగిరీ-I సిపిఎస్‌ఈ. మొయిల్ దేశంలోనే అతిపెద్ద మాంగనీస్ ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తుంది మరియు మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పదకొండు గనులను నిర్వహిస్తోంది. మొయిల్‌ దేశంలోని మాంగనీస్ ధాతువు నిల్వలలో ~34% కలిగి ఉంది మరియు దేశీయ ఉత్పత్తిలో ~ 45% సహకరిస్తోంది. 2024-25 ఆర్ధికసంవత్సరం నాటికి దాదాపు దాని ఉత్పత్తిని 25 లక్షల ఎంటికి రెట్టింపు చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని కంపెనీ కలిగి ఉంది. మొయిల్‌ గుజరాత్‌తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఒడిశారాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలలో వ్యాపార అవకాశాలను  అన్వేషిస్తోంది.
 


 

****(Release ID: 1768208) Visitor Counter : 81