భారత ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ్యుల కోటాకింద శాసనమండలి సభ్యుల ద్వైవార్షిక ఎన్నిక-సంబంధితం
Posted On:
31 OCT 2021 1:03PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శాసన మండళ్లకు సంబంధిత శాసనసభ్యులు ఎన్నుకున్న సభ్యులలో దిగువ పేర్కొన్నవారి పదవీకాలం 31.05.2021 మరియు 03.06.2021తో పూర్తయింది. వివరాలు కిందివిధంగా ఉన్నాయి:-
వ.సం॥
|
సభ్యుని పేరు
|
పదవీ విరమణ తేదీ
|
ఆంధ్రప్రదేశ్
|
1.
|
చిన్న గోవింద రెడ్డి దేవసాని
|
31.05.2021
|
2.
|
మొహమ్మద్ అహ్మద్ షరీఫ్
|
3.
|
సోము వీర్రాజు
|
తెలంగాణ
|
వ.సం॥
|
సభ్యుని పేరు
|
పదవీ విరమణ తేదీ
|
1.
|
ఆకుల లలిత
|
03.06.2021
|
2.
|
మొహమ్మద్ ఫరీదుద్దీన్
|
3.
|
గుత్తా సుకేందర్ రెడ్డి
|
4.
|
విద్యాసాగర్ నేతి
|
5.
|
వెంకటేశ్వర్లు బోడకుంటి
|
6.
|
శ్రీహరి కడియం
|
|
|
|
|
2. దేశంలో కోవిడ్-19 రెండో దశ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన మండళ్లకు ద్వైవార్షిక ఎన్నికల నిర్వహణ సరికాదని, మహమ్మారి పరిస్థితులు గణనీయంగా మెరుగుపడిన తర్వాత నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎన్నికల కమిషన్ 13.05.2021 నాటి తన పత్రికా ప్రకటన సంఖ్య.ECI/PN/65/2021లో తెలిపింది.
3. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాళ్లో పరిస్థితులను తిరిగి అంచనా వేయడంతోపాటు వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటూ రెండు రాష్ట్రాల శాసనమండళ్లలో శాసనసభ్యుల ద్వారా పైన పేర్కొన్న స్థానాలకు సభ్యులను ఎన్నుకునే ద్వైవార్షిక ఎన్నికలను కింద నిర్దేశించిన కార్యక్రమం మేరకు నిర్వహించాలని ఇప్పుడు నిర్ణయించింది:-
వ.సం॥
|
కార్యక్రమం
|
తేదీలు
|
|
నోటిఫికేషన్ జారీ
|
2021 నవంబరు 9 (మంగళవారం)
|
|
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
|
2021 నవంబరు 16 (మంగళవారం)
|
|
నామినేషన్ల పరిశీలన
|
2021 నవంబరు 17 (బుధవారం)
|
|
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ
|
2021 నవంబరు 22 (సోమవారం)
|
|
పోలింగ్ తేదీ
|
2021 నవంబరు 29 (సోమవారం)
|
|
పోలింగ్ సమయం
|
ఉదయం 09:00 నుంచి సాయంత్రం 04:00
|
|
ఓట్ల లెక్కింపు
|
2021 నవంబరు 29 (సోమవారం) సాయంత్రం 05:00 గం॥
|
|
ఎన్నికలు ముగియవలసిన తేదీ
|
2021 డిసెంబరు 1 (బుధవారం)
|
4. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కోవిడ్-19పై కేంద్ర ఎన్నికల కమిషన్ జారీచేసిన విస్తృత మార్గదర్శకాలుసహా 28.09.2021న కమిషన్ జారీచేసిన పత్రికా ప్రకటనలోని పేరా 6కింద నిర్దేశించిన అందరు వ్యక్తులకూ వర్తించే మార్గదర్శకాల (https://eci.gov.in/candidate-political-parties/instructions-on-covid-19/)ను ప్రతి ఒక్కరూ తప్పక అనుసరించాలి.
5. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల విషయంలో ఇప్పటికే అమలులోగల కోవిడ్-19 నియంత్రణ చర్యలకు సంబంధించి సూచనలను పాటించేలా చూడటం కోసం రాష్ట్రంలోని ఒక సీనియర్ అధికారిని నియమించాల్సిందిగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
***
(Release ID: 1768190)
Visitor Counter : 176