ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
30 OCT 2021 9:12AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 105.43 కోట్ల డోసులను అందించారు.
గత 24 గంటల్లో 14,313 కొత్త కేసులు నమోదయ్యాయి.
రికవరీ రేటు 98.19% కు చేరింది.
గత 24 గంటల్లో 13,543 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,36,41,175 కు పెరిగింది.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.47% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,61,555.
వారపు పాజిటివిటీ రేటు (1.18%) గత 36 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
రోజువారీ పాజిటివిటీ రేటు (1.22%) గత 26 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
ఇప్పటివరకు 60.70 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
****
(Release ID: 1767854)
Visitor Counter : 194