ఆయుష్
azadi ka amrit mahotsav

18 బిలియన్ అమెరికా డాలర్లు దాటిన - ఆయుష్ మార్కెట్ పరిమాణం


ఏ.ఐ.ఐ.ఏ. లో ఆవిష్కరణలు మరియు సంస్థల స్థాపన కోసం ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన - కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బ్‌నంద్ సోనోవాల్

Posted On: 29 OCT 2021 2:09PM by PIB Hyderabad

*    2014-20 మధ్య కాలంలో ఆయుష్ రంగ వృద్ధి రేటు 17 శాతంగా ఉందని, ఇటీవల విడుదలైన ఆర్.ఐ.ఎస్. నివేదిక అంచనా వేసింది. 

*     ఈ రంగంలో మొట్ట మొదటి ఇంక్యుబేషన్ కేంద్రాన్నీ; బాల్ రక్ష కిట్‌ తో పాటు రక్త నిధిని; ఆర్.ఐ.ఎస్-ఎఫ్.ఐ.టి.ఎం. పత్రికను, ఏ.ఐ.ఐ.ఏ. ప్రారంభించింది.

పెరుగుతున్న జాతీయ, అంతర్జాతీయ డిమాండ్‌ వల్ల కలిగిన ఉత్సాహం,  నియంత్రణ, పరిశోధన, అభివృద్ధి కి అందుతున్న బలమైన మద్దతు తో పాటు,  కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా లభిస్తున్న పూర్తి మౌలిక సదుపాయాల ఫలితంగా,   2014-20 మధ్య కాలంలో ఆయుష్ మార్కెట్ పరిమాణం 17 శాతం పెరిగి 18.1 బిలియన్ అమెరికా డాలర్ల స్థాయికి చేరుకుందని,  కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ శుక్రవారం తెలిపారు.  న్యూఢిల్లీలో జరిగిన ‘ఆయుర్-ఉద్యమ’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.  "భారతదేశంలో ఆయుష్ రంగం :  అవకాశాలు మరియు సవాళ్లు' శీర్షికతో ఆర్.ఐ.ఎస్. రూపొందించిన నివేదికను కేంద్రమంత్రి, ఈ సందర్భంగా, విడుదల చేశారు.   కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంకుర సంస్థలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో, ఈ రంగంలో మొట్ట మొదటి ఇంక్యుబేషన్ కేంద్రంగా ఏర్పాటు చేసిన,  ఏ.ఐ.ఐ.ఏ. ఐ.సి.ఏ.ఐ.ఎం.ఈ. - అఖిల భారత ఆయుర్వేద సంస్థ - ఆవిష్కరణలు మరియు సంస్థల స్థాపన కోసం ఇంక్యుబేషన్ కేంద్రాన్ని, ఈ కార్యక్రమంలో భాగంగా,  కేంద్ర ఆహార, ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పశుపతి పరాస్ జీ ప్రారంభించారు.

మహమ్మారి కారణంగా 2020లో ఆర్థిక కార్యకలాపాలు మందగించినప్పటికీ, ఈ పరిశ్రమ 2021 లో 20.6 బిలియన్ల అమెరికా డాలర్లకు, 2022లో 23.3 బిలియన్ల అమెరికా డాలర్లకు చేరుకుంటుందని, అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం పరిశోధన మరియు సమాచార వ్యవస్థ (ఆర్.ఐ.ఎస్) నివేదిక అంచనా వేసింది.   అంతర్జాతీయ వాటా విషయానికొస్తే, ప్రపంచం తో పోలిస్తే ఆయుష్ మార్కెట్లో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందింది.  మరియు మార్కెట్లో దాదాపు 2.8 శాతం వాటాను కలిగి ఉంది, ఉత్పత్తిలో అంతరాయాలను మినహాయించనప్పటికీ ఇది కలిగి ఉంటుంది.

అదే కాలంలో, వివిధ ఉత్పత్తి విభాగాలు మొత్తం పరిశ్రమ కంటే చాలా ఎక్కువ రేటు తో వృద్ధి చెందాయి.  2014-2020 మధ్య కాలంలో మొక్కల నుండి ఉత్పత్తి చేసిన ఔషధాలు 21 శాతం వృద్ధిని సాధించి ప్రధమ స్థానంలో ఉండగా,  ఆ తర్వాతి స్థానంలో 20.5 శాతం తో  న్యూట్రాస్యూటికల్స్ (వైద్య, ఆరోగ్యపరమైన ప్రయోజనం గల ఆహార పదార్థాలు), 15.8 శాతం తో ఔషధాల తయారీకి సంబంధించిన పదార్థాలు), 14.7 శాతం తో మొక్కల నుంచి తీసిన పదార్థాలు,   14.3 శాతం తో మూలికా సంబంధమైన మొక్కలు ఉన్నాయి. 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ, గత ఒకటిన్నర సంవత్సరాలలో మహమ్మారి మొదటి మరియు రెండవ దశ ఉధృతి సమయంలో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 రోగులు వేగంగా కోలుకోవడంలో ఆయుష్ మందులు చాలా బాగా పనిచేశాయని చెప్పారు.

కొత్త ఇంక్యుబేషన్ సెంటర్ గురించి శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ, అంకురసంస్థలు దేశంలో కొత్త రకాల సంపద సృష్టికర్తలని పేర్కొన్న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని ప్రస్తావించారు.  "భారతదేశ అంకుర సంస్థలతో పాటు, అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థను ప్రపంచంలోనే అత్యుత్తమంగా మార్చడానికి ప్రభుత్వం అవిశ్రాంతంగా పని చేయవలసిన అవసరాన్ని ప్రధానమంత్రి వివరించారు.  ఇది ఆత్మనిర్భర భారత్ యొక్క దీర్ఘకాలిక దార్శనికతకు దోహదం చేస్తుంది." అని సోనోవాల్ చెప్పారు. 

కొత్త ఆలోచనలు అభివృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణం అవసరమని, యువ పారిశ్రామికవేత్తలు వారి సంస్థలను పెంపొందించుకోడానికి  ముందు వారు పూర్తిగా నిలదొక్కుకోడానికి కేంద్రం సహాయపడుతుందని మంత్రి తెలియజేశారు.  “ఆవిష్కరణలను వాణిజ్యపరంగా లాభదాయకమైన ఉత్పత్తులు, సేవల రూపంలోకి మార్చుకోడానికి అంకురసంస్థల కార్యక్రమం ఆయుష్ వ్యవస్థాపకులకు సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను.  ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, శ్రీ రాజేష్ కోటేచా;  ఏ.ఐ.ఐ.ఏ. డైరెక్టర్, ప్రొఫెసర్ తనూజా మనోజ్ నేసరి నాయకత్వంలో ఏ.ఐ.ఐ.ఏ. కి చెందిన మొత్తం బృందం ఆయుష్ మంత్రిత్వ శాఖతో పాటు వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, వంటి భారత ప్రభుత్వం లోని ఇతర మంత్రిత్వ శాఖలతో, ఎం.ఎస్.ఎం.ఈ. తో  సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. పరిజ్ఞానం ఇచ్చి పుచ్చుకునేందుకు, ఈ ఆహార అంకుర సంస్థలను ప్రారంభించాలనే కార్యక్రమం, ఒక ఆదర్శవంతమైన వేదిక అవుతుంది." అని శ్రీ సోనోవాల్ పేర్కొన్నారు. 

ప్రజారోగ్యం కోసం చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా మధుమేహ నివారణ, నిర్వహణకు దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులు సహకరించారని, మధుమేహ వ్యాధి నివారణ కోసం అనుసరించవలసిన నియమ నిబంధనల (ప్రోటోకాల్) తయారీలో ఏ.ఐ.ఐ.ఏ. కూడా పనిచేస్తోందని, కేంద్ర మంత్రి తెలిపారు.  "మధుమేహ వ్యాధిగ్రస్తుల సంరక్షణ అవసరాలను తీర్చడానికి, అదేవిధంగా ఈ రంగంలో ఇటీవలి పురోగతిని తెలుసుకోవడానికి,  అభ్యాసకులు, పరిశోధనలు చేసేవారు,  విద్యావేత్తలకు  ఈ ప్రోటోకాల్ సహాయపడుతుంది." అని ఆయన చెప్పారు. 

ఏ.ఐ.ఐ.ఏ. రక్త నిధిని ప్రారంభించిన సందర్భంగా కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీ ముంజ్‌ పరా మహేంద్రభాయ్ మాట్లాడుతూ, ఢిల్లీతో పాటు పరిసర రాష్ట్రాల రోగుల అవసరాలను ఈ రక్తనిధి  తీరుస్తుందని చెప్పారు.  "రక్త నమూనాలను దానం చేస్తున్నప్పుడు దాత సురక్షితంగా భావించడం చాలా ముఖ్యం.  నైపుణ్యం కలిగిన, శిక్షణ పొందిన వైద్యుల ఆధ్వర్యంలో, ఏ.ఐ.ఐ.ఏ. లో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో, రక్తాన్ని స్వీకరించడానికి, దానం చేయడానికి ముందు దాతలు, రోగులను అందరినీ, సమగ్రంగా పరీక్షించేలా మేము నిర్ధారిస్తాము." అని ఆయన హామీ ఇచ్చారు. 

కేంద్ర ఆహార, ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పశుపతి పరాస్ జీ, ఏ.ఐ.ఐ.ఏ-ఐ.సి.ఏ.ఐ.ఎన్.ఈ. ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో - పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి;  ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీ శంతను కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆర్.ఐ.ఎస్-ఎఫ్.టి.ఐ.ఎం. పత్రికను కూడా ఆవిష్కరించారు.  వీటితోపాటు, బాల రక్ష కిట్‌ ను,  పిల్లలకు రోగ నిరోధక శక్తిని పెంపొందించే స్వర్ణ ప్రాశనాన్ని కూడా,  ఏ.ఐ.ఐ.ఏ.  ఆవిష్కరించింది.  ఆయుష్ సబ్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (హెచ్.ఎస్.ఎస్.సి) కింద క్వాలిఫికేషన్ ప్యాక్‌లతో పాటు, 2018-2021 సంవత్సరాల్లో అత్యుత్తమ ప్రతిభ తో కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు. 

కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నవంబర్ 2వ తేదీని 6వ ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకుంటోంది.  ఆ రోజు జైపూర్‌ లోని జాతీయ ఆయుర్వేద సంస్థ లో భారీ కార్యక్రమాలతో సహా అనేక కార్యక్రమాలను  నిర్వహించాలని యోచిస్తోంది. 

 

*****


(Release ID: 1767819) Visitor Counter : 239