హోం మంత్రిత్వ శాఖ
రెండు రోజుల పాటు జరగనున్న వేలిముద్రల బ్యూరో డైరెక్టర్ల 22 వ జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా
Posted On:
29 OCT 2021 1:04PM by PIB Hyderabad
రెండు రోజుల పాటు జరగనున్న వేలిముద్రల బ్యూరో డైరెక్టర్ల 22 వ జాతీయ సమావేశాన్ని ఢిల్లీలో ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా ఆన్ లైన్ లో ప్రారంభించారు.
ప్రారంభ సమావేశంలో హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ వి.ఎస్.కే. కౌమది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డైరెక్టర్ శ్రీ రామ్ ఫల్ పవార్, వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ పోలీసు అధికారులు, శాస్త్రవేత్తలు, వేలిముద్రల రంగంతో సంబంధం ఉన్న నిపుణులు పాల్గొన్నారు. నేర పరిశోధనలో వేలిముద్రల శాస్త్ర వినియోగంపై రూపొందిన 24 వ వార్షిక సంచిక ఫింగర్ ప్రింట్ ఇన్ ఇండియా -2020 ను కేంద్ర మంత్రి విడుదల చేశారు. నేర పరిశోధనలో ఐటీ వినియోగం కోసం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అమలు చేస్తున్న చర్యలను మంత్రి ప్రశంసించారు. నీరు పరిశోధన శాస్త్రీయంగా జరగాలని ఆయన సూచించారు.
(Release ID: 1767583)
Visitor Counter : 183